యూనిట్
Flash News
'నవ్యాంధ్ర అభివృద్ధిలో పోలీసు పాత్ర - పోలీసు-ప్రజల భాగస్వామ్యం ఆవశ్యకత
ఉపోద్ఘాతం:
ఇండో-టిబెట్ సరిహద్దుల్లో చైనా సైన్యం దాడిలో అమరులైన భారత సైనికులకు నివాళులర్పిస్తున్నాను. 1959 అక్టోబర్ 21న ఇండో-టిబెట్ సరిహద్దులోని ఈశాన్య లడఖ్ ప్రాంతంలో ''హాట్ స్ప్రింగ్స్'' ప్రవేశం వద్ద భారత సైనిక బృందాలపై చైనా దళాలు దాడులు చేశారు. వారి ప్రాణత్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు.
నవ్యాంధ్ర అభివృద్ధిలో పోలీసుపాత్ర:
దేశంగాని, రాష్ట్రంగాని రాజకీయ సుస్థిరత కలిగి ఉండాలన్న ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న సామాజిక సమస్యలు, ప్రజల మధ్య అంతరాలు, వర్గ తగాదాలు లేకుండా ఉండాలన్న ఆ రాష్ట్ర భద్రత, రక్షణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ చేపట్టి పోలీసుశాఖ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
నవ్యాంధ్ర - ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నుండి నవ్యాంధ్ర రాష్ట్రంగా అవతరించిన నూతన రాష్ట్రము 13 జిల్లాలతో మన రాష్ట్ర రాజధాని ''అమరావతి''
రాష్ట్ర పునర్నిర్మాణంలో పోలీసుపాత్ర ముఖ్యమైనది.
రాష్ట్ర, దేశ మరియు రాష్ట్ర అభివృద్ధి శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుంది.
నూతన రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, పటిష్టమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
మోడల్ పోలీస్‌స్టేన్లు ఏర్పాటు.
రాజధాని నిర్మాణంలో పోలీసు భాగస్వామ్యం అయింది.
మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా శాంతి భద్రతలను పరిరక్షిస్తుంది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
ఈనాడు నూతన రాష్ట్రములో నవ్యాంధ్రలో ఉన్న శాంతిభద్రతల విషయాలలో విభిన్నమైన పాత్ర కొనసాగిస్తున్నది.
రాష్ట్ర శాంతిభద్రతల విషయాలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలని, తెలంగాణ కావాలి అని, శాంతి భత్రలకు విఘాతం కలిగింది.
ప్రజల మధ్య ఉంటు వారికి ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టములు జరుగకుండా పోలీసువారు బాధ్యత వహించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు కలదు.
సమాజంలో శాంతిభద్రతల అదుపులో ఉండే ఆ రాష్ట్రం అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుంది.
రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు అంతమొందించుటలోను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు పాత్ర కలదు.
రాష్ట్రంలో ఉన్న వివిధ వ్యవస్థలలో పోలీసు పాత్ర చాలా కీలకమైనది. పోలీసు వ్యవస్థలో వివిధ విభాగాలు సిఐడి, ఎస్.ఐ.బి., ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ వంటి ముఖ్యమైన విభాగాలు పనిచేస్తున్నవి.
నవ్యాంధ్రలో పోలీసు పాత్ర కీలకం.
నవ్యాంధ్రలో మహిళా భద్రతకు రక్షణ కవచంగా సైబర్ మిత్ర, ఫేస్‌బుక్ పేజ్‌తో మహిళలను సైబర్ నేరాల నుండి కాపాడటం సులభతరమైంది.
భారీ ఎత్తున దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాలను చాకచక్యంగా పట్టుకోవడం.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'స్పందన' కార్యక్రమ నిర్వహణలో పోలీసుశాఖ ప్రగతి పథంలో ఉన్నది.
పోలీసు శాఖకు వస్తున్న వినతులలో ఎక్కువగా సివిల్ వివాదాలు, మహిళలపై వేధింపులు, దాడులు సంబంధించినవే వీటన్నింటిని పరిష్కరిస్తోంది.
నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగంగా సమాజాన్ని నిర్వీర్యం చేసి, అస్థిరతకు దారి చేపే జూదం, మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం, బెట్టింగ్ వంటి వాటిని కట్టడం చేయటం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'వనం-మనం' కార్యక్రమాన్ని పోలీసుశాఖ విజయవంతంగా నిర్వహిస్తోంది.
వివిధ కారణాలతో ఆయుధాన్ని చేపట్టి హింసాపథాన్ని ఎంచుకున్న మావోయిస్టులు వారి సానుభూతి పరులకు జన జీవన స్రవంతిలో కలిసిపోయి సమాజ శాంతికి తోడ్పతున్నారు.
లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తూ, హోంగార్డ్సుగా, ఆటో డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది.
మహిళలకు గిరిజన ప్రాంతాలలో కుట్టు మిషన్‌లు వంటి స్వయం సహాయక కార్యక్రమాలు పోలీసు శాఖ చేస్తోంది.
గిరిజన విద్యార్థులకు విజ్ఞాన యాత్ర.
గిరిజన యువత నైపుణ్యాభివృద్ధికి పోలీసు తోడ్పాటునందిస్తోంది.
యువతకు ఉచితంగా నైపుణ్యంలో శిక్షణ, వసతి సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. నవ్యాంధ్ర అభివృద్ధిలో పోలీసు కీలక పాత్ర పోషిస్తోంది.
ఎర్రచందనం స్మగ్లర్లను ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది.
మహిళలు, బాలికల భద్రత పట్ల పోలీసు యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
మహిళల భద్రత కోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో 'మహిళా మిత్ర'లను ఏర్పాటు చేశారు.
నేరాలు చేధించటంలో సిఐడి విభాగం పనిచేస్తోంది.
ఆర్థిక, సైబర్ నేరాలు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయి.
నేరాల నియంత్రణ : ఆర్థిక నేరాలు:
1. కాల్‌మనీ నేరాల అదుపు
2. భూ కబ్జాలు ఈ మధ్యకాలంలో రాజధాని ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.
3. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా పోలీసుశాఖ సమస్యను పరిష్కరించింది.
4. ఇసుక మాఫియాను అదుపు చేసింది.
5. వైట్ కాలర్ నేరాలను అదుపు చేసింది.
6. ఏటిఎం కార్డుల ద్వారా పిన్ తెలుసుకుని ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకు సమస్యలను అదుపు చేస్తోంది.
7. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠాలను అదుపు చేస్తోంది.
8. మతపరమైన, కుల పరమైన విషయాలలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మన పోలీసువ్యవస్థ పనిచేస్తు నవ్యాంధ్ర అభివృద్ధికి సహకారం అందిస్తోంది.
రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంగాని, వామపక్షాల ధర్నాల సమయంలో పోలీసు వ్యవస్థ చాకచక్యంగా వ్యవహరిస్తోంది.
ఆపదలో ఉన్న బాధితులకు మొదటగా గుర్తుకు వచ్చేది పోలీసు వ్యవస్థే.
నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగంగా వరద ప్రాంతాలైన కేరళ రాష్ట్రానికి పోలీసు వ్యవస్థ తరపున ఒక రోజు వేతనాన్ని ఇవ్వడం జరిగింది.
దేశంలోనే మన పోలీసు ఆదర్శవంతంగా ఉన్నాము.
నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారికి శాంతిభద్రతలు కల్పించి భరోసా ఇవ్వటం జరుగుతోంది.
మహిళా నేరాల అదుపునకు చర్యలు:
మహిలా సాధికారం కోసం మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడం.
చిన్న పిల్లలను కిడ్నాప్, రేప్ వంటి కేసులను తగ్గించినట్లయితే నవ్యాంధ్ర అభివృద్ధి చెందినట్లే.
ఇటీవల కాలంలో వైవాహిక సంబంధాలు, గ్యాంగ్ రేప్‌లు వంటి వాటిని అరికట్టగలుగుతున్నారు.
ప్రభుత్వం మహిళలపై దాడులను తగ్గించుటకు గాను హోంశాఖామాత్యులు, మహిళా కమిషనర్, మహిళా శిశు సంక్షేమ శాఖలకు మహిళలను కేటాయించి నవ్యాంధ్ర అభివృద్ధిలో మహిళలపై దాడులు ఆపేందుకు షీటీంలను ఏర్పాటు చేసి, నేరాల సంఖ్య తగ్గించేందుకు ప్రణాళికలు రచించింది. ఇది నవ్యాంధ్ర అభివృద్ధికి వెన్నెముకగా పోలీసు వ్యవస్థ చేయగలుగుతున్నది.
కాలేజి, స్కూల్స్ నందు 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' వంటి కార్యక్రమాలపై షీ టీమ్స్ అవగాహన కల్పించడం జరిగింది.
పోలీసు - ప్రజల భాగస్వామ్యం ఆవశ్యకత:
పోలీస్‌లకు - ప్రజల శ్రేయస్సే ముఖ్యం.
రాజకీయపరంగా రాయలసీమ ప్రాంతంలో ముఠా కక్షలు తగ్గాయి.
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా కార్యచరణ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పూర్తి చేశారు.
పోలీసు వ్యవస్థ - చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నది.
ప్రజలు - పోలీసులతో స్నేహాభావం కలిగి ఉండేలా ఇద్దరి మధ్య ప్రాధాన్యతలను కల్పిస్తున్నది.
ఇటీవల కాలంలో పలు జిల్లాలలో చిన్న పిల్లలు, కిడ్నాప్ గ్యాంగ్, పార్థీ గ్యాంగ్‌లు సంచరిస్తున్నారు అనే ప్రచారంతో ప్రజలకు, పోలీసు వ్యవస్థకు మధ్య ప్రాధాన్యతను కలిగి ఉన్నది.
కుటుంబ సభ్యులు వృద్ధులను నిర్లక్ష్యం చేస్తూ రోడ్లపై వదిలిన వారిపై మానవత్వంతో వాళ్ల పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులు, పిల్లలను చూసుకోవటంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
పేదలకు దుస్తులు, దుప్పట్లు, పంపణీ చేయటం వంటివి జరిగింది.
పిల్లలను బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, థియేటర్లు, హోటళ్ళలో పనిచేస్తున్న 14 యేళ్ళ లోపు పిల్లలను గుర్తించి వారికి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు.
చిన్న పిల్లలను పనులకు పంపించడం నేరమని వారి ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 'ఆపరేషన్ ముస్కాన్''ను చేపట్టారు.
వీధి వ్యాపారుల నుండి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల వరకు వ్యాపారాభివృద్ధికి టెక్నాలజీ సమాజానికి అవసరం.
ప్రకాశం జిల్లా ఎస్.పి. సిద్ధార్థ కౌశల్ గారు ప్రజలతో ప్రత్యక్ష సమావేశాలు, ఫేస్‌బుక్ లైవ్ ప్రోగ్రామ్, స్పందనపై ప్రతి పోలీస్‌స్టేషన్‌లో విధిగా రిసెప్షన్ విభాగాలను, ప్రజలకు మెచ్చేలా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రకాశం ఎస్.పి.గారు 'సిద్దార్థ్ కౌశల్‌గారు తక్కువ ఖర్చుతో పాతబడిన కంప్యూటర్లు ఆధునీకరించి ఆధునిక పరిజ్ఞానంతో ప్రజలను సమన్వయం చేస్తూ, నిత్యం ప్రజలతో ఉండే విధంగా రాష్ట్రం మొత్తం వీడియో కాన్ఫరెన్స్‌లను నిర్వహించి నవ్యాంధ్రకు, దేశానికి ఆదర్శవంతంగా ప్రజలకు చేరువ చేసి, సత్వర సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు.
పల్నాడు ప్రాంతంలో ఇటీవల ప్రజల ప్రశాంతతకు భంగం కల్గించే చర్యలను అడ్డుకున్నారు.
ప్రజలకు సమస్యలను సృష్టించవద్దని ఎటువంటి సమస్యనైనా సత్వరమే పరిష్కరించి తగిన న్యాయం చేయడం జరిగింది.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజల శాంతికి భంగం కలిగించే వారు ఏ రాజకీయ పార్టీ వారైనా, వారు ఎంతటి వారైనా అట్టివారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు భరోసా కల్పిస్తున్నారు.
ఇటీవల కాలంలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు, వారికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు సమకూర్చటం జరిగింది.
మొదటగా పోలీసులు స్వీయ క్రమశిక్షణకు పెంపొదించుకోవాలి.
పోలీసులు తమ విధి నిర్వహణలో అవసరమైనంత వరకు ప్రజలతో భాగస్వాములు కావడానికి కృషి చేయాలి.
మైత్రి సంఘాలను, శాంతి కమిటీలు, మహిళా కమిటీలు, గ్రామ సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది.
సమాజంలో పోలీసులకు, ప్రజలకు మధ్య ఏర్పడిన ఈ అంతరాన్ని తొలగించడానికి వివిధ రకాల సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేపట్టాలి.
అమరవీరుల సంస్మరణ దినోత్సవం మురియు జాతీయ పండుగల సమయంలో ప్రజలను రక్తదాన శిబిరాలను, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం పొందవలెను.
పోలీసులకు తగిన శారీరక ధారుఢ్యం లేకపోవటం.
సమ్మెలు, ధర్నాలు, ఇతర ఉద్యమాలలో బాడీవార్న్ కెమెరాలు, డ్రోన్‌ల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాంతిభద్రతలను పరిరక్షించవచ్చును.
ధర్నాల సమయంలో బస్సు అద్దాలు పగుల గొట్టడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం వంటివి చేయవచ్చును.
రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చును, ఈ మధ్యకాలంలో ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించి, అర్హత ఉన్న యువతకు లైసెన్స్‌లు ఉచితంగా ఇప్పించటం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు, వ్యవస్థకు దగ్గరగా ఉంటుంది.
తిరునాళ్ళ, జాతరలు సమయంలో ఆయా శాఖలతో సమన్వయం కలిగి ఉండవలెను.
ఇటీవల జరిగినటువంటి రొట్టెల పండుగ సందర్భముగా లక్షల మంది భక్తులకు ఆటంకం కలుగకుండా శాంతి భద్రతలను పరిరక్షిస్తుంది.
మీడియాలో సమయపాలనగా, ఎన్‌జీవోలతో సత్సంబంధాలు కలిగి ఉండవలెను.
ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడుటలో పోలీసులు విధులు బాధ్యతతో చేయవలెను.
ప్రజల మర్యాదకు భంగం కల్గించకుండా, దూషణలు లేకుండా, అవాంతరాలను ముందుగా గ్రహించి, ప్రజలకు తగిన రక్షణ కల్పించవలెను.
నవ్యాంధ్ర అభివృద్ధిలో విజిబుల్, శక్తి టీమ్స్, కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సత్వర పరిష్కారం చేయగలుగుతున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బాడీవార్న్ కెమెరాలు, ఎల్‌హెచ్‌ఎంఎస్, ఫిన్స్, ఈ-లెర్నింగ్, బ్రీత్ ఎనలైజర్, వంటి సాంకేతిక పరికరాల ద్వారా నవ్యాంధ్ర అభివృద్ధిలో పోలీసు పాత్ర కీలకమైనది.
స్పందన, చేరువ, అబల వంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సాధిస్తుంది.
విద్యార్థులకు అవగాహన కల్పించడం.
మహిళలు పనిచేయు చోట నిఘా వ్యవస్థను కలిగించడం.
ఎన్‌జీవో వంటి సంస్థల ద్వారా భిక్షాటన చేయించే చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళి రక్షణ సదుపాయం కల్పించి, భిక్షాటన చేయించే వారికి శిక్షలు వేయించటం.
ప్రజలతో మమేకమై వారు చెప్పేవిషయాలను మనం వినటం.
చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించటం వంటివి చెయ్యాలి.
వృద్ధులు, పిల్లల యెడల ఎలాంటి అవకతవకలు లేకుండా పని చేయాలి.
ముగింపు:
పోలీసులకు ప్రజలు సహకరించిన నాడే నేర నియంత్రణ సాధ్యం అవుతుంది. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 21 వరకు వారోత్సవాలు జరిపారు. నవ్యాంధ్ర కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి, ఆర్థికంగా, పారిశ్రామికం అభివృద్ధి, సామాజిక అభివృద్ధి శాంతి భద్రతలపైనే ఆధారపడి, అభివృద్ధి సాధిస్తుంది.