యూనిట్
Flash News
గుండెపోటు తో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కు నివాళులు అర్పించిన పోలీస్ అధికారులు
చిత్తూరు పి.సి.ఆర్. కళాశాలలో
గార్డ్ విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆర్.పురుషోత్తం, గుండె పోటుతో మరణించారు. అతని దహన కార్యక్రమాలకు చిత్తూరు జిల్లా
ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, ఆదేశానుసారం, అడ్మిన్ ఆర్.ఐ. నీలకంటేశ్వర
రెడ్డి పురుషోత్తం స్వగ్రామమైన బెస్తపల్లె
(ఐరాల మం.)కు వెళ్లి అతని పార్ధివ దేహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. దహన
సంస్కరణలకు క్రిమేషణ్ ఫండ్ లో బాగంగా 25,000/- రూపాయలను వారి
కుటుంబానికి అందించారు. అనంతరం ఆర్మ్డ్ రిజర్వు పోలీసులచే గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ
అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్.ఐ. అడ్మిన్
వారి కుటుంబం సభ్యులతో మాట్లాడుతూ పోలీస్ డిపార్టుమెంటు తరపున వారి
కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడు సిద్దంగా
ఉంటామని వారి కుటుంభానికి రావలసిన అన్ని ప్రయోజనాలను త్వరగా అందేలా చేస్తామని
తెలిపారు.