యూనిట్

గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలి : విశాఖపట్నం నగర పోలీస్ కమీషనర్

 డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా నగర పోలీస్ కమిషనర్ డా. సి.యం.త్రివిక్రమ వర్మ, శుక్రవారం నగర కాన్ఫరెన్స్ హాల్ నందు ఆర్.పి.ఎఫ్, జి.ఆర్.పి.ఎఫ్, ఎస్.ఈ.బి, సిటీ టాస్క్ ఫోర్స్, క్రైమ్స్ మరియు రైల్వే స్టేషన్ పరిధిలో గల శాంతి భద్రతల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యముగా నగరము మీదుగా రైల్వే మార్గాల ద్వారా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను చర్చించారు. ఏయే మార్గాలలో అక్రమ రవాణా జరుగుతుంది మొదలు, గత సంవత్సర కాలం నుండి నమోదైన కేసుల వివరాల విశ్లేషణ, అక్రమరవాణా జరుగుతున్న తీరు వాటిపై అన్ని శాఖలు తీసుకుంటున్న చర్యలను ఉమ్మడిగా చర్చించారు. సమాచార మార్పిడికి, ఇతర అవసరాలకు మరియు ఫిర్యాధులకు టోల్ ఫ్రీ నంబరు అయిన 14500 కు డైల్ చేయవలసినదిగా తెలిపారు.  

వార్తావాహిని