యూనిట్

శానంభట్ల వరుస అగ్ని ప్రమాదాల మిస్టరీని ఛేదించిన చంద్రగిరి పోలీసులు.

తన తల్లి  ప్రవర్తన నచ్చక, దానికి కారుకులైన వారిని గ్రామం నుండి బయటికి పంపించాలననే ప్రధాన ఉద్దేశంతో వరుస అగ్ని ప్రమాదాలను సృష్టించి గ్రామస్తులను భయభ్రాంతులకు ఓ యువతి గురిచేసిందని తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ   వెంకటరావు అన్నారు.  జిల్లా ఎస్పీ  పి. పరమేశ్వర రెడ్డి   ఆదేశాల మేరకు చంద్రగిరి డిఎస్పి డా. టి.డి.యశ్వంత్ ఆధ్వర్యంలో చంద్రగిరి సీఐ ఓబులేసు ఎస్సైలు వంశీధర్, హిమబిందు, రవీంద్రనాథ్ మరియు జిల్లా ఐడి పార్టీ సిబ్బందితో వివిధ బృందాలుగా ఏర్పడి, శానంభట్ల గ్రామాన్ని రేయింబవళ్లు జల్లెడ పట్టి ఈ కేసును చాలా చాకచక్యంగా చేదించడం జరిగిందని అదనపు ఎస్పీ  చంద్రగిరి డిఎస్పి ఆఫీసు నందు ఏర్పాటుచేసిన  సమావేశంలో వెల్లడించారు.  శానంభట్ల గ్రామంలో వరుస అగ్ని ప్రమాదాలకు కారకురాలైన అదే గ్రామానికి చెందిన కుమారి పిల్లపాలెం కీర్తి,గా గుర్తించడం జరిగిందన్నారు.

            ఈ యువతి ఇంటర్ మీడియట్  ఫెయిల్ అవడముతో ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటూ ఉన్నది. ఈ క్రమములో తన తల్లి ప్రవర్తన  తనకు నచ్చడం లేధు. మా అమ్మ మారాలి అంటే మేము మా వూరి నుండి వెళ్లిపోవాలిఅని ఆ యువతి భావించింది. ఆ విధంగా తమ కుటుంబం ఈ గ్రామాన్ని విడిచి వేరే గ్రామానికి వెళ్లిపోతే సమస్య తీరిపోతుందని భావించి లేదా తల్లి ప్రవర్తనలో మార్పు వస్తుందని ఉద్దేశంతో మొదట్లో యువతి వారి సొంత ఇంటిలో ఇటువంటి అగ్ని ప్రమాదాలకు పాల్పడ్డం జరిగింది. తరువాత తన తల్లి అటువంటి ప్రవర్తనకు కారకులైన వారి ఇంటిలో కూడా ఇదేవిధంగా నిప్పునీ పెట్టి వారిని భయ బ్రాంతులకు గురి చేసి వారికి నష్టం వాటిల్లేల జరగాలని అనుకుంది. ఈ క్రమంలో తనను ఎవరికీ పట్టుబడకపోవడంతో ధైర్యంగా వారి కుటుంబానికి మరియు తనకు వ్యక్తిగతంగా మనస్పర్దలు ఉన్న వారి ఇండ్లల్లో కూడా ఇటువంటి ఘాతకాలు కొనసాగించింది. సుమారు 12 అగ్ని ప్రమాదాలకు కారకురాలైంది. దీనికి సంబందించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా ఎటువంటి రసాయనాలు లేకుండా ఈ ప్రమాదాలు జరిగినాయని నివేదిక పోలీసు వారికి అందడం జరిగింది. పై సంఘటనలు అన్నియు కూడా ఎవరి సహాయం లేకుండా ఆ యువతి ఒక్కతే చేసిందని పోలీసు విచారణలో ఆ యువతి చెప్పడం జరిగింది.   యువతి పై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకోని వారి ఇంటి బీరువలో కాలిపోయాయని చెప్పి, తన దగ్గర ఉంచుకున్న సుమారు రూ. 30,000/- లను  ఆ యువతి నుండి స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.  కేసు చేధనలో ప్రతిబ కనుబరిచిన చంద్రగిరి డి.యస్.పి డా. టి.డి.యశ్వంత్, చంద్రగిరి సి‌.ఐ జి.ఓబులేష్, యస్.ఐ లు వంశీదర్, హిమబిందు, రవీంద్రనాథ్ మరియు జిల్లా ఐ.డి పార్టీ సిబ్బంది వారిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

వార్తావాహిని