యూనిట్

పల్లె పిలుపు

జనని జన్మ భూమిచ్ఛా

కన్న తల్లి, కన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి. తల్లి ముఖంలో ఆనందం కోసం... తన ఊరి సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తుల జీవితం ధన్యం. ఈ సత్యాన్ని అక్షరాల నమ్మి ఆచరిస్తున్నారు శ్రీ జె.వి.రాముడు గారు. బాల్యం నుంచీ తల్లిదండ్రులు నేర్పిన విలువలు... ఊరి ప్రజలు పంచిన ప్రేమాభిమానాలే నార్శింపల్లి సమగ్ర ప్రగతిపై దృష్టి సారించేలా చేశాయి. ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా... తాను నడిచి వచ్చిన పల్లె మార్గాన్ని మరచిపోకుండా తనవంతుగా సహాయపడుతున్నారు. స్నేహానికి, వృత్తి ధర్మానికి, పల్లె ప్రగతికి అత్యంత విలువ ఇచ్చి... తనను ఇంతటి వ్యక్తిని చేసిన పల్లె తల్లి రుణం తీర్చుకునేందుకు, ఒకవైపు రాష్ట్ర డి.జి.పి.గా కీలక బాధ్యతలు నిర్వర ఇంకా »

అన్బురాజన్‌ గ్రామ దత్తత

మాటల్లేవ్‌..మాట్లాడుకోడాలు లేవ్‌... అంతా మాట్లాడేది కత్తులు.. బాంబులు.. సుమోలు గాల్లోకి లేవాల్సిందే.. అలాంటి ఊరిలో ఎంతో మంది మహిళలు, చిన్నారులు తమ కుటుంబంలో ఎవరికి ఏమి ఆపదో వస్తుందో తెలియని పరిస్థితి.. రోజు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెళ్ళదీస్తుంటారు. గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగే గొడవ, ఘర్షణ ఊరికంతా అంటగట్టి సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది రాయలసీమ ఫ్యాక్షనిజం. ఇలాంటి ఫ్యాక్షనిజం వల్ల ఒరిగిందేమి లేదు.. ఇంకా »

కప్పట్రాళ్ళ గ్రామం దత్తత

పగలు, కక్షలతో నిరంతరం ఫాక్షన్‌ గొడవల్లో , అభివృద్ధికి ఆమడదూరంలో పెత్తందార్ల నిరంతర శ్రమదోపిడి రాజ్యమేలే కప్పట్రాళ్ళను అభివృద్ధిపథంలో నిలిపే బృహత్తర ప్రయత్నం చేస్తున్న కర్నూలు జిల్లా ఎస్‌.పి. ఆకే రవికృష్ణ గారి కృషి ఈనెల పల్లెపిలుపులో.... ఇంకా »

వార్తావాహిని