యూనిట్

పోలీసుకు సెల్యూట్‌

అరే శివ రేపు పండుగ కదా, స్కూలు సెలవు కదా, మా ఇంటికి రారా, గేమ్స్‌ ఆడుకుందాము అన్నాడు జగదీష్‌.

            ''రావడము కుదరుదురా, మా అమ్మా నాన్నలతో పండుగ సెలబ్రేట్‌ చేసుకోవాలి, రేపు పార్కు, సినిమా, బీచ్‌కు వెళ్తాము ఎంజాయ్‌ చేస్తాము.''అని ఉత్సాహంగా జవాబిచ్చాడు శివ.

            ''సరేరా, మా డాడి డ్యూటీలో వున్నారు నా చెల్లితో ఆడుకుంటాను. అని 8 సంవత్సరాల జగదీష్‌ స్కూలు నుండి యింటికి వచ్చాడు.

            ఆ రోజు  సాయంత్రం స్కూలు నుండి వచ్చిన తన కొడుకు ముబావంగా వుండటం చూసి ''ఏమ్మా! అలా వున్నావు'' అన్న అమ్మ సరోజిని ప్రశ్నకు జగదీష్‌ ''ఏమీ లేదు మమ్మీ! రేపు పండుగ కదా... నా ఫ్రెండ్‌, శివగాడు మిగతా ఫ్రెండ్సు తమ డాడి-మమ్మిలతో షికార్లకి వెళ్తారట! మరి మనకేమిటీ మా డాడి ఎప్పుడో గాని యింటిలో వుండరు.?'' అని ప్రశ్నించాడు.

            - డాడి ఎప్పుడూ డ్యూటీ...డ్యూటీ.. అంటుంటారు!

            - డాడి మమ్ములను ఎప్పుడో గాని బయటికి తీసుకెళ్ళరు!

            - డాడి డ్యూటీ వలన మమ్మిగా నువ్వె మమ్ములను బయటకు తీసుకెళ్తావు!

            - యింటిలో ఒక ఫ్రెండులా నువ్వే వుంటావు!

            - ఆదివారం కూడా డాడి ఇంటి వద్ద వుండరు, అందరి డాడీలు లాగ, మా డాడికి డ్యూటీలో సెలవు వుండదా!

అందుకే బాదగా వుంది మమ్మి, బాదగా వుంది. ఏడుపు వస్తుంది. అనే తన 8 ఏళ్ళ పసివాడు జగ్గు మాటలకు తల్లిగా మనసు గాయమయ్యింది సరోజినికి.  పసివాడి మాటలకు ఛలించిన సరోజిని మాటల్లో...

            ''మీ స్నేహితుడు శివ వాళ్ళ డాడి ఏమి జాబ్‌ చేస్తారు.'' అని అడిగింది.

            ''శివ వాళ్ళ డాడి బ్యాంకులో జాబ్‌ చేస్తారు.''

            ''ఇంకా మీ ఫ్రెండ్సు రమణ, సంజయ్‌, విజయ్‌వారి డాడీలు ఏమి జాబ్‌ చేస్తారు!''

            ''రమణ వాళ్ళ డాడి స్కూలు టీచరు, సంజయ్‌ వాళ్ళ డాడి కలెక్టర్‌ ఆఫీసులో జాబ్‌ చేస్తారు.''

            ''మరి మీ డాడి ఏమి జాబ్‌ చేస్తారు?''

            ''పోలీసు జాబ్‌ చేస్తున్నారు, అయినా యిప్పుడు ఉద్యోగాలు గురించి ఎందుకు మమ్మి'' అని తన కొడుకు అమాయకంగా అడిగాడు.

            ''మీ స్నేహితులు వాళ్ళ వాళ్ళ డాడీలు ప్రతిరోజు ఉదయం 9-10 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు యింటికి వస్తారు.''

రెండవ శనివారం, ఆదివారాలు యింకా పండుగలు, దేశ నాయకుల పుట్టిన రోజు సెలవులు. యింకా బంద్‌లు, స్ట్రైయిక్‌లు చేసినా వీరికి సెలవులే!

వీరికి సమాజం పట్ల  గౌరవము. దేశంపట్ల భక్తి, కంటే వారి, వారి భార్య, పిల్లలు, కుటుంబం మీద ప్రేమానురాగాలు వుంటాయి. ఎందుకంటే వారివారి ఆఫీసులు. 10 గంటల నుంచి 5 గంటలు అయిపోగానే, ఎవరితో సంబంధం లేకుండా, యింటికి వెళతారు. అదేవారి అదృష్టంగా భావించి, మనలాంటి పోలీసు కుటుంబాన్ని, నీలాంటి పోలీసు పిల్లల్ని  ఎక్కిరించినట్లు, సెలవులను ఆస్వాదిస్తూ, కుటుంబంతో సరదాగా వుంటారు.

వీరికి ఎన్ని సెలవులు వచ్చినా!

ఎంత సమయం కుటుంబ సభ్యులతో గడిపినా!

పండుగలకు వారి వారి స్వగ్రామలకు వెళ్ళినా!

-          దేశం మీద గౌరవనీయ, సమాజము పట్ల ఆలోచన లేని.. ప్రజల కోసం కనీసం ఆలోచన లేని మీ స్నేహితులు డాడీలు కన్నా...

-          మీ డాడి పోలీసు ఉద్యోగం వందశాతం గ్రేట్‌ ఆయనకి బిడ్డలుగా నువ్వు. చెల్లి. భార్యగా నేను వుండటము. చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి.

            ఈ జీవకోటిలో అన్ని జన్మలు కన్నా మానవ జన్మ అతి  పవిత్రమైనది. ఉన్నతమైనది...

ఇటువంటి మానవ జన్మలో ప్రతీ మనిషి తను బ్రతికిన కాలంలో ఏదో ఒక మంచి పని, అనగా కష్టాలలో వున్నవాడిని ఆదుకోవడం. ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు పిడికెడు అన్నం పెట్టడం, పేదవారికి సహాయ పడటం, వారికి ఓదార్పు యివ్వడం లాంటి మానవ సేవ చేయడం పుణ్యం, పరమార్థం.

డబ్బుకోసం, పలుకుబడి కోసం,

హోదాకోసం, హత్యలు, దోపిడీలు,

గుండాయిజం, పేట్రేగిపోతున్న

ఈ సమాజంలో... కరువు కాటకాలతో, కిటకిటలాడుతున్న సమాజంలో, మనం బాగుంటే చాలు ఎదుటివాడు ఎలా పోయినా, పర్వాలేదు. అనుకునే ఈ రోజుల్లో...

ప్రత్యక్షంగా, పరోక్షంగా, మానవ సేవయే మాదవ సేవగా, మీ డాడి పనిచేస్తున్న పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది.

''దేముడు ప్రాణం పోస్తాడు''

''వైద్యుడు ప్రాణం నిలబెడతాడు''

''పోలీసు ప్రాణం కాపాడతాడు''

మండు ఎండాకాలములో బయటకు రావడానికి భయపడి యింటిలోనే వుండి, సాయంత్రం కాస్త చల్లబడ్డాక యింటినుండి బయటకు వచ్చే ప్రజలు..

కాని మన పోలీసువారు మాత్రం, సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా... నడిరోడ్లపై వాహనాలు క్రమంగా వెళ్లేలాగున ట్రాఫిక్‌ డ్యూటీ చేస్తుంటారు. యిదే రోడ్లపై వర్షాలు పడినా, వర్షాన్ని లెక్క చేయకుండా, వాహనదారులకు ఏ ఇబ్బంది కలగకుండా యాక్సిడెంట్లు లాంటివి జరగకుండా డ్యూటీ చేసేది మన పోలీసులే..!

యిక ఏ కాలమైనా తమ యిలాకాలో ప్రజలు తమ గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు అంటే కారణం, మన పోలీసులే...

రాత్రి అయితే హాయిగా యింటిలో పడుకోవాలి అని అందరికి ఉంటుంది కాని..

-          ప్రజల సేవయే పరమార్థంగా,

-          ప్రజల  ధన, మాన, ప్రాణ రక్షణగా,

-          ఎటువంటి నేరాలు, దొంగతనాలు, దోపిడీలు జరుగకుండా...రాత్రులు మన పోలీసువారు తిరగడం వలన గ్రామాల్లో పట్టణాల్లో గస్తి తిరగడం వలన, ప్రజల ఆస్తులకి ఎటువంటి భంగం కలగకుండా. కాపలా కాస్తున్నా పోలీసు వారికి ధన్యవాదాలు...

ముఖ్యముగా ఏజెన్సి ప్రాంతములో డ్యూటీ చేయుచున్న మన పోలీసుల పరిస్థితి యింకా దుర్భరముగా వుంటుంది.

అడవుల్లో తిరుగుచూ, గిరిజనులకు అందవలసిన ప్రభుత్వ పథకాలు అందనీయకుండా ఆయా గిరిజన గ్రామాలకు సరైన మరుగుదొడ్లు, రోడ్లు, తాగునీరు లాంటి ప్రజెక్టులు కట్టనీయకుండా, ప్రభుత్వ అధికారులను అడ్డుకుంటూ, శాంతిభద్రతలని కాపాడుతున్న పోలీసువారి మీద కాల్పులు జరిపి ఎంతోమంది అమాయకపు పోలీసువారిని, తమ మూర్ఖత్వపు ఆలోచనలతో తమ ఉనికి కాపాడుకోవడం కోసం, నక్సలైట్లు ప్రవర్తిస్తున్న తీరు బాధాకరం.

అయినా పోలీసు వ్యవస్థతో రాను, రాను పూర్వంలా కాకుండా కొత్త కొత్త ఆలోచనలతో, కమ్యూనికేషన్‌ పరిజ్ఞానంతో ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తూ వుంది. గిరిజన గ్రామాల్లో నక్సలైట్ల వ్యూహాలకు ప్రతి వ్యూహంగా పోలీసులు ముందుకు సాగిపోతున్నారు.

-          గిరిజనులకు అవగాహన సదస్సులు.

-          గిరిజన గ్రామాల్లో మారుమూల అటవీ ప్రాంతాల్లో జీవనం గడుపుతున్న బాల-బాలికలకు స్పోర్ట్స్‌, గేమ్స్‌ టోర్నమెంటులో పెట్టి, వారిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి, మరియు అర్హులైన గిరిజన బాల బాలికలకు పోలీసు డిపార్టుమెంటులో హోంగార్డు, కానిస్టేబుల్స్‌గా నియమిస్తున్నారు.

-          ఇంకా బాగా చదువుకుని నిరుద్యోగులుగా వున్న గిరిజన బాల, బాలికలకు పోలీసు డిపార్టుమెంటులో కాకుండా.. వేరు, వేరు డిపార్టుమెంటులలో ఉద్యోగాలు వచ్చులాగునా చేయడం.

-          ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మీ గ్రామానికి వచ్చి, గిరిజనులతో మమేకమై వారికి ప్రభుత్వ పథకాలు అందేలా.. గిరిజనుల్లో సృజనాత్మకత తీసుకొచ్చేది ఈ పోలీసులే...!

యిన్ని విధాలుగా గిరిజన గ్రామాల్లో ప్రజలకు, మంచి ఏదో.. చెడు ఏదో.. తెలియపరుస్తున్నా.. కూడా...!

ప్రస్తుతం రాష్ట్రంలో నక్సలైట్ల ఉనికి కాస్త తగ్గినా, అడపా.. దడపా.. పోలీసులపై కాల్పులు జరపడం, అభం, శుభం, తెలియని పోలీసు సోదరులను దొంగదెబ్బతో హతమార్చడం జరుగుతూనే వుంది.

ఈ సంవత్సరం మే నెలలో విశాఖపట్నం జిల్లాలో డ్రైవరుగా పనిచేయుచున్న ఎస్‌.కె. దాదావలి అను హోంగార్డు, అన్నవరం పోలీసుస్టేషన్‌ ఏరియాలో తన జీపులో వస్తుండగా, నక్సలైట్ల మందుపాతర పెట్టి అతి కిరాతముగా హతమార్చి నక్సలైట్లు ఉనికి చాటుకున్నారు. 

ఇటువంటి సంఘటనలు రాష్ట్రం, దేశం మొత్తం మీద జరుగుతూనే వున్నాయి.

''పొట్ట కూటికోసం, భార్య, పిల్లలు కోసం,''

పనిచేయుచున్న పోలీసులు ఈ నక్సలైట్ల దొంగదెబ్బకు వారు పెట్టుచున్న మందుపాతరలకు, సంవత్సరానికి దేశం మొత్తం మీద వందల్లో చనిపోతున్నారు.

యిటువంటి సంఘటనల్లో నక్సలైట్లు దొంగ దెబ్బకు అసువులు బాసిన పోలీసు కుటుంబాలకు.

-          ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా ఎంత ఇచ్చినా!

-          కుటుంబంలో ఒకరికి ఉద్యోగము యిచ్చినా!

-          పాపం, పిల్లలకు తండ్రి, ఆ భార్యకు భర్త, లేని లోటు ఎవరమూ తీర్చలేము.

యిటువంటి రిస్కు జాబు చేస్తూ, మన కోసం, మన సమాజం కోసం, సేవ చేస్తున్న మీ డాడి లాంటి మొత్తం పోలీసు వ్యవస్థకు అందరమూ రుణపడి ఉండాలి.'' అని తన మనసులో దాచుకున్న ఆవేదనను, ఆలోచనలను జగదీష్‌కు అర్థమయ్యేలా వివరించింది. 

            ''నిజమే మమ్మి, డాడి యింటి వద్ద వుండరు, మమ్ములను ఎక్కడికి బయటికి తీసుకెళ్ళరు. ఎప్పుడూ డ్యూటీ, డ్యూటీ అనే డాడి. ప్రజలు మనిషిగా ప్రజా సేవలో వున్నారు. నిజముగా పోలీసు ఉద్యోగము చేస్తున్న డాడికి మేము పిల్లలుగా చాలా గర్వపడుతున్నాము.'' అని కొండంత ఆత్మవిశ్వాసంతో అన్నాడు జగదీష్‌.

తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా, కొత్త కొత్త... వచ్చాయి. ముఖ్యంగా ఆడవారిపై లైంగిక దాడులకు పాల్పడే వారి పట్ల ''నిర్బయ'' లాంటి చట్టాలే కాకుండా.

పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి బయపడే వారికోసం, డయల్‌ 100, 1091 లాంటివి ప్రవేశపెట్టి పోలీసులే సరాసరి బాధిత మహిళ వద్దకు వచ్చి ఫిర్యాదు స్వీకరించి తక్షణ న్యాయం చేయడం, చాలా బాగుంది.

ముఖ్యంగా హర్యాణాలో గుర్మిత్‌సింగ్‌ డేరా బాబా, లైంగిక దాడికి, శిక్ష వేయడం పట్ల, అలాంటి కీచకులకు, మహిళలు పట్ల భయం, గౌరవం ఏర్పడి, ముందు రానున్న రోజుల్లో ఆడవారిపై లైంగిక దాడులు తగ్గుముఖం పడతాయి.

మగవారితో సమానంగా, చదువు,

ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న మహిళలు ధైర్యంగా వుంటూ, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. మహిళలు అన్ని రంగాల్లో ముందు వున్నారు అనడానికి.

ఉదా: ప్రపంచంలో అతిపెద్ద దేశం అయిన మన భారతదేశ రక్షణ రంగ మంత్రివర్యులుగా శ్రీమతి నిర్మలా సీతారామన్‌ గారిని మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలి.

''ఈ సంవత్సరములో ఉగ్రవాద, తీవ్రవాద, నక్సలైట్ల దాడిలో వీరోచితంగా పోరాడి, అసువులు బాసిన రాష్ట్రంలోని 18 మంది, దేశంలోని 383మంది పోలీసు సోదరులకు..

జోహార్‌... జోహార్‌...

పోలీసు అమర్‌ రహే!''

శ్రీమతి వి.వి.కల్యాణి

వార్తావాహిని