యూనిట్
Flash News
షికారి దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసే షికారీ దొంగల ముఠా సభ్యులు ఇద్దరిని అనంతపురం నగరంలోని వన్‌టౌన్, టూ టౌన్, రూరల్ పోలీసులు సంయుక్తముగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.18 లక్షలు విలువ చేసే 458 గ్రాముల బంగారం, 59 గ్రాముల వెండి, ద్విచక్ర వాహనం, చేతి గడియారం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హాల్లో వెల్లడించారు. అనంతపురం నగరంలోని టీవీ టవర్ ప్రాంతా నికి చెందిన నీరు షికారి అర్జున్ అలియాస్ శీనా అలియాస్ జూటుకా, బుడ్డప్పనగర్‌కు చెందిన నీరు షికారి కుమార్ అలియాస్ వాఘయ్య తాళం వేసిన ఇళ్లలో దొంగ తనాలు చేయడంలో సిద్ధహస్తులు. వీరు పలు ఇళ్లలో దొంగతనాలు చేసి వచ్చిన సొమ్ముతో తాగుడు, జూదం తదితర వ్యసనాలకు బానిసయ్యారు. గత రెండేళ్లుగా నగరం లోని వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీసుస్టేషన్‌ల పరిధి లో 14 దొంగతనాలు చేశారు. ఆయా కేసులపై పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులిద్దరిని నగర శివారులోని టీవీటవర్ సమీపంలో సోమవారం అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐలు ప్రతాపరెడ్డి, జాకీర్ హుసేన్, మురళీధర్‌రెడ్డి , లతో పాటు ఎస్‌ఐలు రాఘవరెడ్డి, జైపాల్‌రెడ్డి, ఏఎస్‌ఐ రమేష్, కానిస్టేబుళ్లు జయరాం, దాసు, గిరి, రామకృష్ణ, భాస్కర్‌లను ఎస్పీ అభినందించారు.