యూనిట్

పోలీస్ గృహిణులకు ప్రత్యేకం

కొడిగట్టుతున్న చిరుదివ్వెలు

ప్రతి ఇంట్లోనూ బాధ్యతాయుతంగా సంసారాన్ని నిర్వహిస్తున్న తల్లితండ్రులూ, తల్లిదండ్రుల చెప్పుచేతలలో నడుచుకుంటూ, వారి కనుసన్నలలో మెదులుతూ, క్రమశిక్షణతో నియమ, నీతిబద్ధంగా ప్రవర్తిస్తున్న పిల్లలూ ఉంటే ఆ ఇల్లు అనురాగాలు వెదజల్లే కుటుంబానికి నమూనా, చిరునామా అయిపోదూ! డా|| సి. నారాయణరెడ్డి గారన్నట్లు ఇది ''చల్లని సంసారం - చక్కని సంతానం'' అవుతుంది మహా చక్కగా! ఇంకా »

కోరలు చాచిన కల్తీ భూతం

పుట్టిన ప్రతి జీవికీ స్వచ్ఛమైన తిండీ, నీరూ, గాలీ అవసరం. మా చిన్నప్పుడైతే ఇంట్లో బావులుండేవి. బావిలోని నీరు కొబ్బరి నీరులా తీయగా కమ్మగా ఉండేది. బావినీళ్ళనీ, కుళాయి నీళ్ళనీ కాచి వడగట్టకుండా తాగేసేవాళ్ళం. ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడయితే RO లు వచ్చేశాయ్‌! కాలం ఎంత మారిందనీ! ఇంకా »

ఆడవాళ్ళు - ఆత్మరక్షణ

ఆత్మరక్షణ అంటే తనని తాను కాపాడుకోవడం. ఇంగ్లీషులో self-defence అంటాం కదూ! మనం తత్వశాస్త్రంలోని ''ఆత్మ'' జోలికి వెళ్ళి దీన్ని విశ్లేషించటం లేదు. 'ఆత్మ' అంటే 'తన' అనుకుంటే సరిపోతుంది. మరి ఈ ''ఆత్మరక్షణ'' ఆడవాళ్ళకే పరిమితమా? అని ప్రశ్నించుకుందాం! సృష్టిని తేరిపారి పరిశీలిస్తే మగ జంతువు కానీ, పక్షి కానీ, పురుగు కానీ తమలోని ''ఆడ'' జాతికంటే బలంగా ఉంటాయి. మనిషి ప్రాణే కాబట్టి మగవాడు ఆడదాని కంటే బలాఢ్యుడే తప్పకుండానూ! ''బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు'' అని శ్రీశ్రీ అనలేదూ! బలహీనులంటే బలవంతులికి చులకనా, అలుసూ, చిన్నచూపూను. ఇంకా »

''సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ''

ఉలిపికట్టెలా వేరుగా, ఒంటరిగా జీవించలేడు. నలుగురితో కలిసి ఉంటున్నప్పుడు, ఒకటే స్వభావంగల వ్యక్తులు - ఆడవారు గానీ, మగవారు గానీ - ముఖ్యంగా ఒకటే వయసుగలిగిన వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. ఆంగ్లంలో Birds of same feather flock together అనే సామెత ఎంత నిజమనీ! ఒకరితో నొకరు, భావాలూ, భావోద్వేగాలూ, ఊహలూ పంచుకుంటారు. హృదయాలు విప్పుకుంటారు. సాన్నిహిత్యం పెరిగి బంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఆపదలలో తోడుగా, నీడగా, అండగా, స్థిరంగా, దృఢంగా నిలబడతారు. ఒకరి హృదయం బరువెక్కితే మరొకరు స్వాంతన చేకూర్చి హృదయాన్ని దూదిపింజలా చేస్తారు. (అంటే తేలిక చేస్తారన్న మాట!). వాళ్ళ గమ్యాలూ, లక్ష్యాలూ, వీక్ష ఇంకా »

''రావమ్మా మహాలక్ష్ష్మీ రావమ్మా''

మనం నివసిస్తున్న భూమి, స్త్రీ-ఇద్దరూ సృష్టికర్తలే. సమృద్ధికారులే, ''పుడమితల్లికి పురిటినొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయ్‌'' (శ్రీశ్రీ) కాసుల పురుషోత్తమ కవి చెప్పినట్టు ''ఈ సకల చరాచర జంతు చయము'' భూమి సృస్టే మరి. చెట్టూ పుట్ట, ఎలుకా, ఏనుగు, పులీ, సింహం - ఇవన్నీ భూమి చేతలే కదూ! మరి మనిషి మాటో! ఈ సకల మానవ కోటికి స్త్రీయే నిర్మాత. ఆడదే ఆధారం తప్పకుండా అందుకే దేవీస్తుతిలో ''యాదేవి సర్వభూతేషు సృష్టి రూపేణా సంస్థితా'' (ఆ దేవే ప్రాణుల్లో సృష్టిరూపంలో నిలిచింది) అనిస్తుతించారు. ఇంకా »

చల్లచల్లగా మెల్లమెల్లగా రావె ..నిదురా హాయిగా

డా|| శ్రీమతి కె. అరుణా వ్యాస్‌ మనమంతా ఆరోగ్యంగా ఉండాలంటే కావలసినవి రెండే రెండు. ''కరకరా' ఆకలివేసి కడుపు నిండా అన్నం తినడమూ, కంటి నిండా ఆదమరచి నిద్రోపోవడమూను. ఎంతమందికి ఈ రెండూ లభిస్తున్నాయ్‌? ఇది మిలియన్‌ డాలర్‌ క్వాశ్చన్‌. ఉన్నవాడికి 'అరగని జబ్బూ, లేనివాడికి ఆకలి జబ్బూ'' అన్నాడో సినీ కవి. బాగా కాయకష్టం చేసి - అది మంచి వ్యాయామమైనా సరే - కడుపులో ఆకలి ఆవురావురుమంటూంటే తింటున్న ప్రతి మెతుకూ రుచిగా నోటికి హితవై కడుపు నింపుతూంటే వేళపట్టున నిద్రాదేవి ఠపీమని హాజరై మనని ఒడిలోకి తీసుకొని చిచ్చికొట్టదూ! ఆ జీవితం స్వర్గానికి ఓ చీడీ తక్కువేం కాదుమరి! ఇంకా »

పోలీసు గృహిణులకు ప్రత్యేకం - ఆకాశం నినదిస్తోంది

ఎర్రని బాల సూర్యుడు పెద్ద కమలాపండులా తూర్పు దిక్కున పైకి లేస్తుంటే, కోడి పుంజులు ఠీవిగా మెడలు నిక్కపొడుచుకుని మరీ ''కొక్కొరోకో'' మంటూ తెల్లారిపోయిందని తట్టి లేపుతుంటే, చల్లని పిల్లగాలుల సోయగానికి నిద్రలేవడానికి బద్ధకిస్తూ ''మరో ఐదు నిమిషాలు పడుక్కుంటానమ్మా'' అని పిల్లలు ముసుగుతన్నుతూ వుంటే, తల్లి రేడియో తిప్పి భక్తి రంజని పాట వినిపిస్తే, మత్తంతా వదిలి ఠకీమని లేచి కూర్చునేవాళ్ళం. మా చిన్నప్పుడు. బాలాంత్రపు రజనీకాంతరావు గారు స్త్రీల పాటలలో సేకరించిన సూర్యుడి పాటకి ఆయనే సంగీతం సమకూర్చి ఆయనే పాడిన పాట ఇది. శ్రీసూర్యనారాయణా - మేలుకో - హరి సూర్యనారాయణ ఇంకా »

ప్రవర్తన

మనిషిని అందలం ఎక్కించేదీ, పాతాళానికి తొక్కేసేదీ కూడా అతని ప్రవర్తనే. ''సర్వేషామపి సర్వ కారణమిదం శీలం పరం భూషణం'' అన్నాడు సుభాషితకారుడు. మంచి ప్రవర్తనే అన్నింటికన్న మిన్న అని భావం. ఇంకా »

ఏటేటా పలకరించి మురిపించే పండుగ

మనమంతా కూడా జనవరి 1వ తేదీని సంవత్సర ఆరంభంగానే భావించి పెద్ద ఎత్తున పండుగలా జరుపుకుంటున్నాం కదా! ప్రపంచం యావత్తూ కూడా జనవరి 1ని నూతన సంవత్సరాదిగానే బేషరతుగా ఒప్పుకుంది మరి! అసలీ సంవత్సరాలని లెక్కించడం, జనవరి 1వ తేదీ సంవత్సరపు తొలి మజిలీగా తీసుకోవడం ఎలా వచ్చింది? దీనికి చాలా కథా కమామిషూ ఉందండోయ్‌! దానిని గురించి ఇప్పుడే ముచ్చటించు కొందాం. ఇంకా »

వార్తావాహిని