యూనిట్

ముఖ్యమంత్రి గారి పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు : కృష్ణా ఎస్పీ

సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో  ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసింతవరకు బందోబస్తు విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పటిష్ట బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ   పి జాషువా  బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులకు, సిబ్బందితో అన్నారు.  జిల్లా ఎస్పీ బందోబస్తు విధులలో పాల్గొనబోయే పోలీసు అధికారులు, సిబ్బందితో హిందూ కళాశాల మైదానంలో బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. విధులకు హాజరయ్యే క్రమంలో, తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని, వాహన రాకపోకల విషయంలో నిర్లక్ష్యం లేకుండా భద్రత నియమాలు పాటించాలని, ఏ చిన్న ప్రమాదం జరిగిన మనకే కాక మనపై ఆధారపడి ఉన్న కుటుంబం మొత్తం చిన్నాభిన్నమవుతుందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సిబ్బందితో తెలిపారు. సమావేశంలో  ఎస్పీ  బందోబస్తును గూర్చి మాట్లాడుతూ బందోబస్తు విధులలో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన స్థలానికి, నిర్దేశించిన సమయానికి విధులకు హాజరయ్యి  ఉండాలన్నారు. హెలిప్యాడ్ నుండి సభావేదిక వరకు ఉన్న పాయింట్లో ఉండే అధికారులు మరియు సిబ్బంది  కాన్యాయ్ వచ్చే సమయంలో ఎంతో  అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. కొంత దూరం రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తారు. విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సమయస్పూర్తితో వ్యవహరించాలని, ట్రాఫిక్ బందోబస్తులో ఉండే అధికారులు ట్రాఫిక్ నియంత్రణ మరియు సవ్యంగా జరిగేలా చూడాలి. విధుల్లో పాల్గొనే సిబ్బంది నీట్ యూనిఫామ్ ధరించి, విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ మీ విధులు ఉండాలి. సీఎం కాన్వాయ్ మార్గంలో ఏర్పాటుచేసిన బారిగెడ్ల వద్ద జాగ్రత్తగా వ్యవహరిస్తూ, సమూహాలను అదుపు చేస్తూ, మహిళలను అదుపు చేసే క్రమంలో మహిళా ఉద్యోగులు తప్పకుండా ఆ ప్రాంతంలో ఉండేలా చూడాలి. ముఖ్యమంత్రి గారిని చూడడానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలగకుండా నిబద్ధతగా ఉండాలి. విధుల్లో మంచి ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముఖ్యమంత్రి గారి పర్యటన పూర్తి చేయాలని తెలిపారు.

 

అంతేకాకుండా రోజురోజుకీ పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అంతేకాకుండా పోర్ట్ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రివర్యులు విచ్చేయుచున్న నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో జన సమీకరణ ఉండబోతుంది కాబట్టి దానికి తగిన విధంగా విధులు నిర్వర్తించాలన్నారు. కేటాయించిన విధులను, నిర్ణయించిన సెక్టార్లలో, నిబద్ధత కలిగి పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని, తెలిపారు. ఈ బందోబస్తుకు మొత్తం 1000 సిబ్బందిని వినియోగిస్తున్నట్లు అందులో అడిషనల్ ఎస్పి స్థాయి అధికారులు ఇద్దరు, డీఎస్పీ స్థాయి అధికారులు 9 మంది, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు 37 మంది, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు 92 మంది, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 1000 మంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే మచిలీపట్నంలో జరగబోవు  కార్యక్రమానికి ఎటువంటి  ఆంక్షలు లేవు  కావున ప్రజలందరూ  స్వేచ్చగా పాల్గొనాలని  కోరారు.

వార్తావాహిని