యూనిట్

ప్రవాహం

పౌరులుగా మన బాధ్యత ఏంటి??

నిన్న రాత్రి హెల్ప్లైన్ కి ఒక కాల్ వచ్చింది. ఒక వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉంటున్న ఒకమ్మాయి ఇలా చెప్పింది. ‘‘మేము ఆఫీసు ముగించుకుని హాస్టల్కి వచ్చేటప్పటికి 6 గంటలు ఒక్కోసారి ఇంకా ఆలస్యమౌతుంది. బస్సు దొరక్క ట్రాఫిక్జామ్లు ఇలా చాలా కారణాలతో ఆలస్యం అయిపోతుంది. ఇంకా »

గురజాడ కలగన్న అత్యాధునిక మహిళ ‘నాంచారమ్మ’

ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందని ఢంకా బజాయించి చెప్పిన గురజాడ జీవితం 54 సంవత్సరాలకే ముగిసిపోవడం తెలుగు సాహిత్యానికి సంబంధించి అత్యంత విషాదమైన అంశం. గురజాడ కాలం నాటికి పౌరాణిక కథలతో, పద్యాలతో కాలక్షేపం చేస్తున్న తెలుగువారికి కందుకూరి, గురజాడల సాహిత్య ప్రవేశం చాలా విలువైంది. కందుకూరి నవల, ప్రహసనాలతో రంగ ప్రవేశం చేస్తే గురజాడ నాటకం, గేయం కథానికలతో ఆధునికమైన నూతన పక్రియలతో తెలుగు వారికి కొత్త రుచు లను అందించాడు. ఇంకా »

కటకటాల కరకు దారుల్లోంచి

జైలులో ముఖ్యంగా శిక్షలు పడినవాళ్ళు, శిక్షల కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు ఉంటారు. తీవ్రమైన నేరాలలో కేసులెదుర్కొనే వాళ్ళకి అదే స్థాయిలో శిక్షలు పడతాయి. రెండు సంవత్సరాలుగా వీళ్ళందరితో అతి సమీపం నుండి పనిచేయడం వల్ల, కౌన్సిలర్‍లు రోజంతా వారితో గడపడం వల్ల ఖైదీలందరిలో మా పట్ల గొప్ప భరోసా ఏర్పడింది. ఇంకా »

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఛాయాదేవి గారితో నా పరిచయం అలా మొదలైంది. రెండున్నర దశాబ్దాల అనుబంధం. ఎన్ని సార్లు ఆ ఇంటికెళ్ళానో, ఏమేమి కబుర్లు చెప్పుకున్నామో! కాలింగ్‍బెల్‍తో సహా ఎంత కళాత్మకంగా ఆ ఇంటిని అలంకరించుకున్నారో ఆ ఇంటికి వెళ్ళగానే కాళ్ళకు చుట్టుకునే ఆమె పెంపుడు పిల్లలు. తనకి ఇష్టమని ఎక్కడి వెళ్ళినా ఏదో ఒక పిల్లి బొమ్మని తెచ్చి ఇస్తే ఎంత సంబరపడిపోయేవారో! పిల్లులంటే ఎంత ప్రేమో! ఇంకా »

పోలీసులకు వారాంతపు సెలవు - ఒక మంచి పరిణామం

పోలీసులు తమ పిల్లల్ని చూడలేకపోతున్నామని, తాము డ్యూటీ నించి వెళ్ళేటప్పటికి వాళ్ళు నిద్రపోయారని, తాము డ్యూటీకి బయలుదేరేటప్పటికి వాళ్ళు నిద్ర లేవరని, చాలా రోజులపాటు పిల్లల్ని చూడలేమని, వారితో క్వాలిటీ టైమ్‍ గడపలేమని చెబుతారు. భార్యతో గడిపే సమయం కూడా చాలా తక్కువగా ఉండడంవల్ల తమ మధ్య అగాధాలు ఏర్పడతాయని, కుటుంబ జీవితం ఒడిదుడుకులుగా ఉంటే అది తమ ఉద్యోగ బాధ్యతల మీద ప్రతిబింబిస్తుందని చాలా బాధపడుతూ చెప్పినవారూ ఉన్నారు. అందరిలాగా తమకి ఒక రోజు సెలవుంటే, తమ కుటుంబంతో సంతోషంగా గడపగలిగితే తమ వొత్తిళ్ళు చాలా వరకు తగ్గిపోతాయని చాలా మంది చెబుతారు. ఇంకా »

అమ్మ... అమెరికా

వృద్ధాశ్రమంలో తమ తల్లి తండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు. ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు, కొందరికి పొలాలు, ఆస్తులూ ఉన్నాయి. ఎవ్వరూ చూసేవాళ్ళు లేక, పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు. ఇంకా »

జిలుగు వెలుగుల వెండితెర వెనక మహిళా ఆర్టిస్టుల బీభత్స జీవితాలు

వివిధ పనిస్థలాల్లో పనిచేసే మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు రకరకాలుగా ఉంటాయి. ఒక పనిస్థలం, ఒక యజమాని ఉండే ఆఫీసుల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులకి, ఒక పనిస్థలం లేకుండా పనిచేసే అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు ప్రతి రోజు ఎదుర్కొనే వేధింపులకి కొంత తేడా ఉంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేసే స్త్రీలు, మేస్త్రీల నుండి చాలా వేధింపుల్ని ఎదుర్కొంటారు. ఇళ్ళల్లో పనిచేసే గృహ కార్మికులు యజమానుల నుండి ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అందరికీ గొప్ప వినోదాన్ని, ఆనందాన్ని అందించే సినీ పరిశ్రమలోని మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులను భరిస్తుంటారో తెలియదు. దానికి సంబంధించిన వివరాలు ఎప్పుడూ వెల్లడ ఇంకా »

ఫ్రెండ్లీ పోలీసింగ్‍ అంటే.. ఎలా ఉండాలి?

ప్రజలతో ఎలా వ్యవహరించాలి, పోలీస్‍ వ్యవస్థ ప్రతిష్ట ఇనుమడించేలా ఎలా పనిచెయ్యాలి, పోలీస్‍ వ్యవస్థ ప్రతిష్ట ఇనుమడించేలా ఎలా పనిచెయ్యాలి అనే అంశాలను జెండర్‍ ట్రయినింగ్‍లో అర్థం చేయిస్తారు కాబట్టి ఈ ట్రయినింగ్‍లు అందరికీ తప్పనిసరి కావాలి. ఈ ప్రయత్నాలన్నీ అమలైనప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్‍ వ్యవస్థ ఏర్పడి ప్రజల ప్రేమాభినమాలను చూరగొంటుంది. ఇంకా »

ఆకలి

అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడే దేశాలు వ్యర్థపరిచే ఆహారం వేల టన్నుల్లో వుంటుందంటారు. రుచుల కోసం వెంపర్లాడే ప్రపంచం, ఏ రుచులూ తెలియని మట్టి కేకులతో కడుపు నింపుకునే ఆకలి ప్రపంచం వేపు కళ్ళు విప్పి చూసి, చెవులార ఆలకించి, గుండెను తెరిచి సహానుభూతిని వ్యక్తం చెయ్యగలిగితే... తమ తిండి యావను తగ్గించుకుని కొంతైనా ఆకలి ప్రపంచానికి అందించగలిగితే ప్రపంచంలో ఆకలి చావులుండవు. ఇలా ఆశించడం మహా అత్యాశ... అందమైన కల... ఇంకా »

‘వైధవ్యం’ రసి కారుతున్న ఓ రాచపుండు

హిందూ మతావలంబికులే ఈ దారుణ ఆచారాలన్నీ కొనసాగిస్తున్నారు. భర్త చనిపోయిన స్త్రీ ముఖంమీద ‘విధవ’ ముద్రవేసి ఆమె జీవితాన్ని మోడులాగా మార్చేస్తారు. ఆమె తిరిగి చిగురించడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా కుటుంబం, సమాజం ‘అరిష్టం’ ‘అనర్ధం’ పేరుతో ఆ చిగుళ్ళను చిదిమిపారేస్తారు. ఇంకా »

ధీర గాంభీర్యాల వెనక దాగిన వేదన

తమ అహంకారాల వల్ల, అణిచివేతల వల్ల, అత్యాచారాల వల్ల సమాజంలో తమతో బాటే బతుకుతున్న సగం జనాభా ఎన్ని కష్టాలుపడుతుందో, ఎంత హింసని భరిస్తుందో అర్థం చేసుకోగలిగితేనే వారికీ విముక్తి. ధీర,గాంభీర్యాహంకారాల వెనుక దాగి ఉన్న తమ అసలు స్వరూపాన్ని గుర్తించగలిగితేనే అందరికీ మంచిది. తమకు తెలియని ప్రపంచం గురించి ('అంతా నాకు తెలుసూ అనే అహం వదిలి) తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మరీ మంచిది. ఇంకా »

మహిళలపై హింసకు వ్యతిరేకంగా పదహారు రోజుల కార్యక్రమం

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్ అగెన్‍స్ట్ విమెన్స్ డే’ అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంకా »

చైల్డ్ వెల్ఫేర్‍ ఆఫీసర్లు - పిల్లల భద్రత

ప్రతి పోలీస్‍ స్టేషన్లలోను ఉండే చైల్డ్ వెల్ఫేర్‍ ఆఫీసర్‍, జిల్లా శిశు రక్షణాధికారి, చైల్డ్ వెల్ఫేర్‍ కమిటి, చైల్డ్ హెల్ప్ లైన్‍. బాలల భద్రత సంక్షేమం కోసం ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్‍ స్టేషన్లో ఉండే చైల్డ్ వెల్ఫేర్‍ ఆఫీసర్‍ పాత్ర చాల ముఖ్యమైంది. ఇంకా »

జెండర్‍ స్ప్రహ ఎందుకుండాలి?

ఆధునిక పోలీసు వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీసింగ్‍ చేస్తున్నదనే పేరు నిజమవ్వడానికి గీటురాయి వారిలో వెల్లివిరిసే జెండర్‍ స్ప్రహ మాత్రమే. వారి భాష, శరీర భాషా ప్రవర్తనలో సున్నితత్వం వ్యక్తమవ్వాలంటే వారికి జెండర్‍ సెన్సిటైజేషన్‍ శిక్షణ చాల అవసరం. పాతుకుపోయిన భావాల్లో మార్పు రావాలంటే వారికీ క్రమం తప్పని శిక్షణాలవసరం అన్నది పోలీస్‍ విభాగం గుర్తించడం ఎంతైనా ముదావహం. ఇంకా »

మహిళలు పనిచేసే చోట్లు భద్రమైనవిగా ఉండాలి - కొండవీటి సత్యవతి

మహిళల్లో అవగాహన కల్పించాల్సిన కలెక్టర్లు ఎవ్వరూ ఆ పని చేయడంలేదు. కొంతమంది కలెక్టర్లు లోకల్‍ ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసినా అవి పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఇంకా »

అమ్మ ఇంట్లో వండును... నాన్న సంపాదించి తెచ్చును- ఇక్కడే ఆగిపోయిన పాఠ్యాంశాలు - కొండవీటి సత్యవతి

ప్రేమ దాడుల మీద హాట్‍ హాట్‍ చర్చ జరిగింది. ‘‘ప్రేమించడం మా హక్కు. మమ్మల్ని ప్రేమించకపోతే చంపడం కూడా మా హక్కు’’ లాంటి వాదనల్లోంచి- అమ్మాయిలు మిమ్మల్ని బలవంతంగా ఎందుకు ప్రేమించాలి. ప్రేమ సహజంగా వికసించాలి గానీ, ప్రేమించక పోతే యాసిడ్‍ పోస్తాం. కత్తుల్తో నరుకుతాం అంటే అది ప్రేమ అవుతుందా? ప్రేమకి, యాసిడ్‍కి, కత్తులకి ఎలా పొంతన కుదురుతుంది. అమ్మాయిలకి ‘నో’ అనే హక్కు వుంటుంది కదా! అంటే మగపిల్లల వేపు మహా నిశ్శబ్దం. ఇంకా »

కటకటాల కరకు దారుల్లోంచి

జైలు అంటే చాలామంది భయపడతారు. జైలు పురాణాల్లో వర్ణించిన నరకంలా, భయానకంగా ఉంటుందని అనుకుంటారు ఇంకా »

వార్తావాహిని