యూనిట్
Flash News
మంచి చెడు
అటవీ ప్రాంతంలో తప్పిపోయిన వృద్ధ మహిళలను కాపాడిన కడప పోలీసులు
జీవనోపాధిగా ఉన్న చీపురు పుల్లలను ఏరుకునేందుకు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన ఇరువురు వృద్ధ మహిళలు తప్పిపోయిన ఘటన కడప జిల్లా జరిగింది. ఇంకా »
పేగు బంధాన్ని కలిపిన ‘స్పందన’
పసిప్రాయంలో తల్లిదండ్రుల చెంత గారాభంగా పెరగాల్సిన వయసులో తెలిసీ తెలియక చేసిన చిన్నచిన్న తప్పులకు ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులను వదిలి పారిపోవడం, ఇంకా అనేక అఘాయిత్యాలు చేసుకోవడం జరుగుతోంది. ఇంకా »
కాల్వలో పడి కొట్టుకుపోతున్న మహిళను రక్షించిన ఆర్ఎస్ఐ
కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో బందరు కాలువకు సమీపంలో పోలీస్ నివాస సముదాయాలు ఉన్నాయి. విజయవాడ నగర ఒకటవ పట్టణ ట్రాఫిక్ పీఎస్ లో ఆర్ఎస్ఐగా విధు నిర్వర్తిస్తున్న డి. అర్జునరావు అక్కడే క్వార్టర్స్లో నివాసముంటున్నాడు. ఇంకా »
అంబులెన్సు వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించిన విజయవాడ నగర పోలీస్ కమీషనర్
ప్రజలకు పోలీస్ సేవలను వినూత్నంగా అందిస్తున్న విజయవాడ నగర పోలీస్ కమీషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావును నగర ప్రజలు అభినందిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పందన కార్యక్రమానికి రాష్ట్ర పోలీస్ శాఖ చిత్త శుద్దితో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ సరికొత్త వెన్నెలను అద్దుతూ ప్రజలచే శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నది. ఇంకా »
సి.ఐ. పవన్ కిశోర్ దాతృత్వం
తప్పు ఎవరు చేశారో గాని అభం..శుభం తెలియని ఇద్దరు ఆడపిల్లల జీవితాలు ప్రమాదంలో పడి విగతజీవులుగా మారారు. కాకినాడ తీర ప్రాంతంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఫ్యాక్టరీలు, అదిచాలదన్నట్లు వాటి వ్యర్థాలను సైతం రోడ్లపైనా, బహిరంగ ప్రదేశాలలోనూ డంపింగ్ చేస్తున్నారు. దీని వలన చుట్టు ప్రక్కల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అనే ఇబ్బందులు పడటంతో పాటు రోడ్డుపైన వేస్తున్న వ్యర్థాలవల్ల ప్రమాదాలకు గురై మరణిస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఇంకా »
సౌదీలో బందీ అయిన మహిళను రక్షించిన సిద్దవటం పోలీసులు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను మభ్యపెట్టి సౌదీకి వెళితే.. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బును సంపాదిస్తారని ఆశచూపి అమాయకులను సేఠ్‌లకు అక్రమంగా అమ్మేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా సిద్ధవటం -1 లోని లక్ష్మీపురంకు చెందిన పేరూరు సుబ్బలక్ష్మమ్మ గత పదేళ్ళ క్రితం వంటపని నిమిత్తం దుబాయ్‌కు వెళ్లింది. ఇంకా »
సాహసం చేసి అమ్మాయి ప్రాణాలు కాపాడిన పోలీసులు
అనంతపురం పిటిసి ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పైన ఒక అమ్మాయి ఇందిరా అలియాస్ ఇందు, (28) నడుచుకుంటూ వెళ్లడాన్ని అటుగా వెళుతున్న ఇద్దరు అనంతపురం 2 టౌన్ పోలీస్‌స్టేషన్ స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్ళు కే. విష్ణువర్దన్ రెడ్డి, జి. దిలీప్ కుమార్‌లు గమనించారు. ఇంకా »
క్షతగాత్రురాలికి జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ రక్తదానంజంగారెడ్డిగూడెం ఎస్‌ఐ దుర్గారావు
క్షతగాత్రురాలికి జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ రక్తదానంజంగారెడ్డిగూడెం ఎస్‌ఐ దుర్గారావు ఇంకా »
మానవత్వాన్ని చాటుకున్న మైదికురు సి ఐ
కడప జిల్లా మైదుకూరు రోడ్లపై మానసిక పరిస్థితి సరిగాలేక అస్తవ్యస్తంగా తిరుగాడుతున్న వ్యక్తిని అందరూ చూస్తున్నారేగాని ఎవరూ పట్టించుకోవడం లేదు. మానవత్వంతో కొందరు ఆహారం పెట్టినా, అతను విసిరిపారేస్తున్నాడేగాని తినాలన్న ధ్యాసే తెలియడం లేదు. ఇది గమనించిన గాలితొట్టి వెంకటేశ్వర్లు అన్న పాత్రికేయుడు తన సోషల్ మీడియా గ్రూప్‌లో ఆ వ్యక్తి దీనావస్థ గూర్చి సభ్యులందరికీ తెలియపర్చాడు. మైదుకూరు రూరల్ సి.ఐ వై. వెంకటేశ్వర్లు ఈ విషయమై తక్షణం స్పందించి, ఆ మానసిక రోగి వద్దకు వెళ్ళి, తన సిబ్బంది సహాయంతో అతనిని హాస్పిటల్‌కు తరలించి, అక్కడ జాయిన్ చేయించారు. ఇంకా »
శభాష్ పోలీస్
కడప జిల్లా ఇందిరానగర్‌కు చెందిన ఆదిజా మణికంట అనే విద్యార్థి హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. స్నేహి తుతో కలిసి సరదాగా షికారుకు పాకొండకు వెళ్ళారు. అక్కడి వాటర్‌ఫాల్స్‌లో ఈత కొట్టేందుకు సిద్దమయ్యారు. అక్కడే ఒక తేనెతుట్టె కనిపించడంతో వారిలో ఒకరు తేనెతుట్టెపై రాయి విసిరాడు. ఒక్కసారిగా పెద్ద తేనెటీగు విద్యార్థును చుట్టుముట్టాయి. ఇంకా »
మానవత్వాన్ని చాటిన డి.ఎస్.పి.
తిరుమల ట్రాఫిక్ డి.ఎస్.పి.గా విధులు నిర్వర్తిస్తున్న మునిరామయ్య ప్రమాదం జరిగిన సమయంలో స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుమల మొదటి కనుమ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తుల కాళ్లు తెగిపడ్డాయి. ప్రమాద ఘటన తెలుసుకుని హుటాహుటీన బయల్దేరిన మునిరామయ్య తెగిపడి రోడ్డుపై ఉన్న కాళ్లను చూశాడు. అప్పటికే ప్రమాదంలో గాయపడిన కుమార్, మధులను తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్‌కు అంబులెన్స్‌లో తరలించారు. తెగిపడిన కాళ్లను రోడ్‌పై వదిలేసి వెళ్ళడం వలన వాటిని తిరిగి సర్జరీ ద్వారా అతికించే అవకాశం జేజారవచ్చని భావించిన మునిరామయ్య మరో అంబులెన్స్‌ను రప్పించి ఆ కాళ్లను స్విమ్స్ హాస్పిటల్‌కు ఇంకా »
విద్యార్థులకు 'భరోసా'నిస్తున్న పోలీసు రామ్మూర్తి-బాహాబాహీకి దిగిన పోలీసులపై చర్యలు
వృత్తి పరంగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ...ప్రవృత్తి పరంగా విద్యార్థులకు, సమాజంలో మార్పుకోసం నడుం బిగించాడు కుప్పం, స్పెషల్‌బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ (2949) డి.జి.రామ్మూర్తి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే భయాందోళనలు పోగొట్టి, వారిలో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నాడు. పోలీస్ డిపార్టుమెంట్‌లో తీరికలేని సమయాన్ని గడుపుతూ దొరికిన కొద్దిపాటి సమయాన్ని సమాజ మార్పునుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఇటు విద్యార్థులకే కాకుండా, అటు అటవీ సంరక్షణను ఎర్రచందనం దుంగల పేరుతో అడవులను నరికివేస్తున్న వారిలో మార్పుకోసం ఎన్నో చైతన్యవంత కార్యక్రమా ఇంకా »