యూనిట్

మంచి కవిత

పరిమళకృష్ణ

అని ఓ సినీకవి ప్రశంసించిన కృష్ణానది మహారాష్ట్రంలో సతారా జిల్లా మహాబలేశ్వరం వల్ల (జోర్‌ గ్రామం)లో జన్మించి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ప్రవహిస్తూ, బీళ్ళను బంగారు చేలగా మార్చుతూ, ఆంధ్రావనికే అన్నపూర్ణలా కైమోడ్తూలందుకుంటూ, కృష్ణాజిల్లా హంసలదీవి వల్ల బంగాళఖాత సాగరంలో సంగమిస్తుంది. ఆధునిక కాలంలో కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ నుండి పైగంబరకవి దేవిప్రియ వరకు కృష్ణానదిని వేనోళ్ళ కొనియాడారు. ఇంకా »

దేవదాసి

'దేవదాసి' అంటే - గుడిలోని దేవుని ఉత్సవాల్లో నాట్యసేవచేస్తూ జీవితాంతం అవివాహితగా ఉంటూ వేశ్యవృత్తిలో జీవించే స్త్రీ. దాదాపు 'నరబలి' అని చెప్పవచ్చు దీన్ని. సతీ సహగమనం వంటి దురాచారం ఇది. భారతదేశంలో పూర్వకాలం ఈ ఆచారం వుండేదని చరిత్రకారులు రచించారు. కాని ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి ఆచారం వుందని తెలుస్తోంది. ఒక స్త్రీని శాశ్వతంగా ఒక దేవాలయానికి, లేక దేవునికి 'అప్పగించే' పద్ధతి, ఆమె కొందరు పూజారులకి, గొప్ప వాణిజ్యవేత్తలకి, రాజులకి ''అందరి సొంతం''గా మారిపోయే విధానం దారుణం. ఆ స్త్రీ నిత్య సుమంగళి. ఇంకా »

నిప్పుల నీడ

ఏ జాతి, ఏ భాష, ఏ దేశం వారైనా కాలంతో పాటు మునుముందుకు సాగుతూ, తమ వెనుకటి తరంవారి జీవన విధానాలు తెలుసుకోవాలంటే ఆనాటి సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. ఆనాటి చేతివృత్తులు, కులవృత్తులు, కళారూపాలు గురించి కూలంకషంగా పరిశీలించాలి. ఇంకా »

నిత్య హరిత శోభితం

అన్నం ముద్దదీ నీటి చుక్కదీ విడదీయరాని బంధం చినుకు చిందులేస్తేనే చేనుకు ప్రాణకళ వచ్చేది ఇంకా »

కురుసభ నాటి గొంగళి

''ఆడవాళ్ళు మనశ్శాంతికి హానికరమా?'' అన్న ప్రశ్నే అధ్వాన్నం, అన్యాయం అనుకుంటే, ''పక్కలోకి పనికి వస్తారా'' అన్న సమాధానం అత్యంత అహంకారపూరితమైన, దుర్మార్గపు వ్యాఖ్య. కురుసభల నాటి నుండి మనసుల్లో పేరుకుపోయిన మకిలి, కుళ్ళుకి పరాకాష్ఠ. ఒకడు బైటికి అన్నాడు. లోపల అలా అనుకునేవాళ్ళెంతమందో! ఇలాంటి వ్యాఖ్యలు ఇంతకుముందు ఎన్నో జరిగాయి. మహిళలు సిగ్గుతో చితికిపోయారు. ఇంకా »

నిశ్శబ్ద ఘోష

కా...న్స..ర్‌...! ఈ మూడక్షరాలు తలుచుకుంటే మృత్యువు కళ్ళముందు మెదులుతుంది. ఆ మాట పలికినా, విన్నా గుండెల్లో దడ. పెదాల్లో తడబాటు. స్వరంలో మార్పు. ఆ భయానికి ప్రధాన కారణం - అపోహలు, అనుమానాలు, అవగాహనరాహిత్యం. కాన్సర్‌ని ఎదిరించి నిలవడం వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సాధ్యమే. పోరాడి జయించడం అసాధ్యమేమీ కాదు. అది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా చుట్టూ దుర్భేద్యమైన కోట కట్టుకోవడము సాధ్యమే. ఎందుకంటే, నూటికి డెబ్బై అయిదు శాతం కాన్సర్‌ వ్యాధులు కొని తెచ్చుకుంటున్నవే. ఇంకా »

పనిముట్లు

భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రాచీన చరిత్ర కలిగిన వృత్తి ''క్షౌరవృతి'' ప్రపంచ వ్యాప్తంగా క్షౌరవృత్తి నిర్వహించేవారందరూ తమ వృత్తితోపాటు వైద్యం, సంగీతం ద్వారా వేల సంవత్సరాలుగా మానవజాతికి సేవలందించారన్నది చారిత్రక సత్యం. ఆదిమకాలంలో జంతురూపం నుండి మానవజాతిని మనిషిగా వేరు చేసిన క్షౌరవృత్తి ఉన్నతమైనది. ఇంకా »

బొమ్మలాంతరు

తోలుబొమ్మలాట అనేది పండితపామరులను ఆకర్షించే, అలరించే ప్రాచీన జానపద కళారూపం. వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని కల్గించే కళా ప్రదర్శన యిది. రంగస్థలం మీద అట్టలను ఆయా పాత్రలకనుగుణంగా కత్తిరించి, రంగులద్ది దారాలను కట్టి, తమ చేతివేళ్ళతో దారాలను పట్టుకొని, తెరవెనుక నుండి కొందరు (సూత్రధారులు), వేళ్ళను ఆడిస్తూ బొమ్మల్ని ఆడిస్తారు. చలనచిత్రాలకు పూర్వం నాటకాలు రాజ్యమేలాయి. ఇంకా »

మేరా భారత్‌ మహాన్‌

ఏ బద్మాష్‌ ఐ.ఎస్‌.ఐ.గాడో ఢిల్లీలో పేల్చే గలీజు బాంబుకు గల్లీల్లో పల్లీలమ్ముకునే భుక్కాఫకీరుకు సంబంధమేంది భాయ్‌! అమెరికా ఎక్కాడుందో తెలీని అ,ఆలు రాని అమాయక సాయిబుకు ఆల్‌ఖాయిదాకు లింకేంది భాయ్‌! అమాయక ముస్లిమ్‌లను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్న వైనాన్ని తీవ్రంగా నిరసిస్తాడు ప్రముఖ ముస్లింకవి షేక్‌ కరీముల్లా. ఇంకా »

నా దేశపు నాలుగో స్తంభం

పత్రికొక్కటున్న పదివేల సైన్యము పత్రికొక్కటున్న మిత్ర కోటి ప్రజ రక్షలేదు పత్రిక లేకున్న - అన్నారు ప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుగారు. పత్రికలు అంత శక్తివంతమైనవి ప్రజాస్వామ్య సౌధానికి పత్రికలు మూల స్తంభాలు. వార్తనందించే పత్రికలు వార్తాపత్రికలు (న్యూస్‌ పేపర్స్‌). ప్రపంచంలో మొట్టమొదటిగా వెనిస్‌ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. ఇంకా »

కూలాడు దొరకలేదు

చెమటకు విలువ లేకపోవడం శ్రమకు వెలుగు రాకపోవడం ధనానికైనా - దాని జనానికైనా ప్రమాదం - ఇంకా »

చెట్టుకింది మనుషులు

''పైన రంగు రంగుల ఆకాశం కింది మర్రిచెట్టు దాని కింద వీళ్ళు'' ఎవరు వీళ్ళు? అభివృద్ధివైపు దూసుకుపోతోంది అంటున్న భారతదేశంలో ఇంకా చెట్టుకింద జీవనమా? ఇంకా »

విసనకర్ర

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి ప్రాంగణంలో తెలుగు సాహిత్యవిభాగం డీన్‌గా, శాఖాధిపతిగా పని చేస్తున్న ప్రొఫెసర్‌ ఎండ్లూరి సుధాకర్‌ 10 గ్రంథాలు, 60 సాహిత్యవ్యాసాలు, 40 (జాతీయ, అంతర్జాతీయ) పరిశోధన పత్రాలు వెలువరించారు. 21-1-1959న పాములబస్తీ, నిజామాబాద్‌లో జన్మించిన సుధాకర్‌ బాల్యం, విద్యాభ్యాసం అక్కడే జరిగి, ఉస్మానియా యూనివర్శిటీలో ఎం.ఏ.చేశారు. తర్వాత కొన్నాళ్లు సికింద్రాబాద్‌ వెస్టీ ్లబాయ్స్‌ హైస్కూల్‌లో గ్రేట్‌ 1 పండిట్‌గా పనిచేసి, తెలుగు విశ్వవిద్యాలయ రాజమండ్రిలో అధ్యాపకునిగా చేరి, రీడర్‌గా ఎదిగి, ప్రొఫెసర్‌గా, డీన్‌గా, 'వాఝ్మయి' త్రైమాసిక పత్రికకు సంపాదకునిగా, నిరంతర సాహ ఇంకా »

శిలాలోలిత

అమ్మ జన్మనిస్తే, నాన్న జీవితానికి భరోసా ఇస్తాడు. అమ్మ గురించి ఎన్నో పాటలు, ప్రసంగాలు, రచనలు. మరి నాన్న గురించి...? బిడ్డలపై తన ప్రేమను గుండెల్లోనే దాచుకొని, పైకి గంభీరంగా, బిడ్డల భóవిష్యత్‌కి బాట, దిశానిర్దేశం చేస్తూ, వారి ఉన్నతికి మౌనంగా శ్రమించే శ్రమజీవి నాన్న. ఎప్పుడో తప్ప ఆయన మమకారం కట్టలు తెంచుకొని, వారిపై కురవదు. అలాగే నాన్న గురించి మన గుండెల్లో దాచుకొన్న అభిమానం ఒక్కోసారి మనల్ని ముంచెత్తుతూ వెల్లువలా ఇంకా »

వార్తావాహిని