యూనిట్

ఇసుక, మద్యం, NDPS కేసులు, పేకాట వంటి గేమింగ్లు, టౌన్ న్యూసెన్స్ కేసులు (T.N Act), బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు

నగర పోలీస్ కమిషనర్ శ్రీ Dr. సి.యం త్రివిక్రమ వర్మ, ఐ.పీ.ఎస్., వారి ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది, మే 19 న ఇసుక, మద్యం, NDPS కేసులు, పేకాట వంటి గేమింగ్లు, టౌన్ న్యూసెన్స్ కేసులు (T.N Act), బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.

·      2 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో NDPS Act  నందు ఒక కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది.

·      నగరంలో పలు ప్రాంతాలలో 57 మందిపై టౌన్ న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు.

·      పోలీసులు, సెబ్ అధికారులు   గంజాయి, డ్రగ్స్  మరియు ఇతర   మాదకద్రవ్యాల దుష్పరినామాలపై  అవగాహన తరగతులు నిర్వహించారు. అనుమానిత ప్రదేశాలను, పార్సెల్ గోడౌన్లను మరియు షాపులను తనిఖీ చేశారు.

·      బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన 53 మందిపై కేసులు నమోదు చేశారు.

·      నగరంలో డ్రింక్ అండ్ డ్రైవ్ నందు 49 కేసులు నమోదు చేయబడ్డాయి,  ఎం.వి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 2282 కేసులు   నమోదు చేశారు.  ఆటో వయోలెషన్ కేసులు 202 ఆర్టీసీ బస్సు వైలేషన్ కేసులు 02 నమోదు చేశారు.

·      నగరంలోని ప్రజలకు దిశా ???? యాప్ పట్ల అవగాహన  కల్పిస్తు 779 మందితో దిశ యాప్  డౌన్లోడ్ చేయించారు.

·      నగర పోలీసులు వాహన తనిఖీలు, ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయడం, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించడం,దిశా పెట్రోలింగ్,బీచ్ సాండ్ బందో బస్త్ నిర్వహిస్తూ ట్రాఫిక్ భద్రత నియమాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు.

·      మహిళా పోలీసులు తమ పరిధిలోని  సైబర్ క్రైమ్స్,లోన్ యాప్స్,ఓటిపి ఫ్రాడ్స్ మరియు తక్కువ వడ్డీకి సులభతరమైన లోన్లు ఇస్తామని చెప్పి జరిగే మోసాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.


నగర పోలీసు, విశాఖపట్నం సిటీ.

వార్తావాహిని