యూనిట్

వేటపాలెం పోలీస్ స్టేషన్ ను తనిఖీ నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ

ప్రారంభ దశలోనే నేరాలను అరికట్టటలో గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసుల పాత్ర కీలకమని బాపట్ల  జిల్లా ఎస్పీ  వకుల్ జిందాల్  తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా  శుక్రవారం జిల్లా ఎస్పీ  చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ ను తనిఖీ నిర్వహించారు. ముందుగా సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ పరిసరాలను, ఎస్.హెచ్.ఓ, రైటర్, కంప్యూటర్ గదులను, కేస్ ప్రాపర్టీ భద్రపరిచిన గదిని పరిశీలించి, కేసు ప్రాపర్టీ సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు.  వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసులు, పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారు చేస్తున్న విదుల గురించి,  "మహిళా పోలీస్ డ్యూటీ ట్రాకర్" వెబ్ సైట్ లో వారి రోజువారి విధుల వివరాలను పొందుపరుస్తున్నార లేదా, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి, రౌడీలు సస్పెక్ట్ లు, పాత నేరస్తులు ఎవరు ఉన్నారు, వారి కదలికలు గురించిన వివరాలను, స్థల వివాదాలు, కుటుంబ తగాదాలు, వర్గ విభేదాలు గురించిన సమాచారాన్ని, గతంలో ఎటువంటి నేరాలు జరిగినాయి, అందులో ముద్దాయిలు ఎవరు బాధితులు ఎవరు వారి ప్రస్తుత జీవన విధానం వంటి విషయాల గురించి విపులంగా అడిగి తెలుసుకున్నారు.

వార్తావాహిని