యూనిట్

విజయనగరం జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అస్మా ఫర్హీన్

విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా అస్మా ఫర్హీన్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలో చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్  బ్యూరో అదనపు ఎస్పీగా బాధ్యలు నిర్వహిస్తున్న ఆమెను  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అదనపు ఎస్పీగా నియమించింది. బాధ్యతలు చేపట్టి అస్మా ఫర్హీన్ జిల్లా ఎస్పీ ఎం. దీపిక ను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్ఛం అందజేయగా, జిల్లా ఎస్పీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 2012లో గ్రూపు 1 విభాగంలో డైరెక్ట్ డిఎస్పీగా పోలీసుశాఖకు ఎంపికైన ఆమె గతంలో రాజమండ్రి, విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో డిఎస్పీగా సమర్ధవంతంగా పని చేసారు. అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది కృష్ణా, విజయనగరం జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా సమర్ధవంతంగా బాధ్యలు నిర్వహించి, మద్యం, నాటుసారా అక్రమ రవాణ, అమ్మకాలను కట్టడి చేసారు. అదే విధంగా ప్రజలు, విద్యార్ధులు మత్తు, మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా కళాశాలల్లో పలు అవగాహన కార్యక్రమాలను చేపట్టి, వాటి వలన కలిగే అనర్ధాలను విద్యార్థులకు వివరించి, వాటికి దూరం చేయడంలో సఫలీకృతులయ్యారు. అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యలు చేపట్టిన ఆమె స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో జాయింట్ డైరెక్టరుగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.  

వార్తావాహిని