యూనిట్

పశ్చిమ గోదావరి జిల్లాలో నానమ్మను హత్య చేసిన మనువడు

పశ్చిమ గోదావరి జిల్లా  శ్రీపర్రు గ్రామ పంచాయితీ మానూరుకు చెందిన పేరం చిట్టెమ్మ (70)ను  హత్య చేసిన మనువడు రవిని అరెస్ట్ చేసినట్లు  ఏలూరు రురల్ సీఐ ఎ.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సురేష్‌  సమావేశంలో తెలిపారు. కేసు వివరాలను వారు వెల్లడించారు. చిట్టమ్మ వృద్దురాలు   కావడంతో కుమారుడు ప్రకాశ్‌ రోజు సపర్యలు చేస్తు న్నాడు. తండ్రి   కష్టాన్ని చూడలేని ప్రకాష్ కుమారుడు రవి నానమ్మను చంపివేయాలని నిర్ణయించుకున్నాడు.   ఈనెల 21న రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో రవికుమార్‌ చిట్టెమ్మ తలను గుమ్మానికి కొట్టి కొంతు పిసికి చంపేశాడు. తర్వాత రోజు బంధువులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. శ్రీపర్రు వీఆర్వో దౌలూరి సుబ్రహ్మణ్యానికి సమాచారం అందడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూరల్‌ ఎస్‌ఐ చావా సురేష్‌ కేసు నమోదు చేశారు. నిందితుడు రవికుమార్‌ను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తులో ఏలూరు రూరల్‌ ఎస్‌ఐ చావాసురేష్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు ఎన్‌వీఆర్‌. సత్యనారాయణ, డీవీ.రమణ, కానిస్టేబుళ్లు వి.కృష్ణప్రసాద్‌, వి.చిన్నారావు, ఎ.నాగేశ్వరరావు సహకరించారు.  

వార్తావాహిని