యూనిట్

సుమారు ఒక కోటి రూపాయలు విలువ గల 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి, ఐపీఎస్ గారు.

సుమారు ఒక కోటి రూపాయలు విలువ గల 500 మొబైల్ ఫోన్లను చాట్ బాట్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి,  ఐపీఎస్ గారు

.


·      అతి తక్కువ సమయంలోనే 500 ఫోన్లను రికవరీ చేసాం.

·      ఒక భాదితురాలి ఫిర్యాదు అందిన 4 గంటల లోపు మొబైల్ ఫోన్ రికవరీ చేసాం.

·      ఇతర  రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరి చేసి భాధితులకు అందజేశాం.

·      జమ్మూ & కాశ్మీర్, రాజాస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ల రికవరీ.

·      బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం తో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు.

·      ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుండి కూడా ఫిర్యాదు చేస్తున్న బాధితులు.

·      "CHAT BOT" సేవలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు సేవలు మరింత సులువుగా ఉంటుంది.

·      మొబైల్స్ ట్రేస్ చేసిన చిత్తూరు పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ గారు.


చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ లో “మొబైల్ రికవరీ  మేళా” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడుతూ మారుతున్న జీవనశైలిలో మొబైల్ వినియోగం ఎక్కువ అయ్యి మనలో ఒకటిగా మారిపోయిన మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారి బాధ వర్నతాతీతం. అటువంటి మొబైల్ ఫోన్ ను ఎటువంటి కంప్లయింట్ లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసు వారి “చాట్ బాట్” సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను మరల పొందవచ్చునని తెలిపారు.

ఈ రోజు 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్ బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు. పోయిన మొబైల్ ఫోన్లు మన రాష్ట్రం లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు అయిన జమ్మూ & కాశ్మీర్, రాజాస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్, పంజాబ్, మరియు మన జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ల రికవరీ చేసి భాదితులకు అందజేసిన పోలీస్ సిబ్బంది పని తీరు హర్షనీయమని తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్న భాదితులు కేవలం చిత్తూరు జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుండి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఫోన్ లను కూడా రికవరీ చేసి అందజేస్తున్నాం. ఇంకా పెండింగ్ రికవరీ లు ఉన్నాయని వాటిని కూడా అతిత్వరలో రికవరీ చేసి భాదితులకు అందచేస్తామని తెలియజేసారు. మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్బముగా ఎస్పీ గారు తెలియజేసారు.

మీ వివరాలు CHAT BOT కు పంపవలసిన విధానం :

·      మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్ కు HI, లేదా Help అని పంపాలి.

·      తర్వాత వెనువెంటనే Welcome to Chittoor Police పేరున ఒక లింకు HI లేదా HELP అని పంపిన మొబైల్ కు వస్తుంది.

·      ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్ , పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నంబర్ , మిస్సయిన మొబైల్ మోడల్, IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ వివరాలను సబ్మిట్ చేసిన వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది.

·      “CHAT BOT” సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, ఫోన్ చోరీకి గురయినా... మిస్ అయినా వెంటనే వాట్సాప్ నంబర్ 9440900004 కు HI లేదా HELP అని మెసేజీ పంపాలని జిల్లా ఎస్పీ గారు చిత్తూరు జిల్లా ప్రజలను కోరారు.



అతితక్కువ సమయంలో 500 మొబైల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందజేసేందుకు కృషి చేసిన క్రైమ్ సి.ఐ. శ్రీ భాస్కర్, క్రైమ్ ఎస్.ఐ. శ్రీ ఉమా మహేశ్వర రావు మరియు వారి సిబ్బందిని ఎస్పీ గారు సర్టిఫికేట్ మరియు కాష్ రివార్డ్ తో అభినందించారు.

వార్తావాహిని