యూనిట్

మీతో మీ డి.జి.పి

రాష్ట్రవ్యాప్తంగా ''మహిళామిత్ర'', ''సైబర్‌మిత్ర''

గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్‌షాగారి ఆధ్వర్యాన ఢిల్లీలో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం గారితో పాటు హాజరయ్యాను. దేశంలో 11 రాష్ట్రాలలోని అటవీ ప్రాంత పరిధిలోనే ఉన్న మావోయిస్టు ప్రభావాన్ని సమీప భవిష్యత్తులో పూర్తిగా నిర్ములించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడింది. గిరిజన ప్రాంతాలలో త్వరితగతిన చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మావోయిస్టు ఉనికిని సమూలంగా తుడిచిపెడతాయని ఇరువర్గాలు దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి. ఈ సమస్యపై ఆంధ్రప్ ఇంకా »

మహిళా భద్రతకు రక్షణ కవచం ''సైబర్‌ మిత్ర''

మహిళలు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా స్వేఛ్చా, సాధికారతలతో ఉన్నతంగా జీవించగలిగే ప్రశాంత పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత మనపై వుంది. బాలికలు, మహిళల భద్రతకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి అనుగుణంగా హోం మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారి ఆధ్వర్యంలో వినూత్న విధానాలకు శ్రీకారం చుడుతున్నాము. అందులో భాగంగా బాలికలు, మహిళలను సైబర్‌ నేరాల నుండి కాపాడే రక్షణ కవచం ''సైబర్‌ మిత్ర'' ఫేస్‌బుక్‌ పేజ్‌, 9121211100 వాట్సాప్‌ నెంబర్‌ను హోం మంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించాము. ఇది బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు రాకుండానే తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసు ఇంకా »

చిరకాల స్వప్నం 'వారాంతపు సెలవు' సాకారం

దశాబ్దాలుగా పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు చిరకాల స్వప్నమైన 'వారాంతపు సెలవు'ను దేశ పోలీస్‌ చరిత్రలోనే మొదటిసారిగా సగర్వంగా సాకారం చేసాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆదేశానుసారం, త్వరితగతిన అధ్యయనం పూర్తిచేసి వారాంతపు సెలవును కార్యాచరణలోకి తీసుకువచ్చాం. కానిస్టేబుల్‌ స్థాయినుండి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు ఈ సౌలభ్యం వినియోగించుకునే అవకాశం వున్నది. వివిధ విభాగాలలో అందుబాటులో వున్న సిబ్బంది, వారి విధి నిర్వహణ స్వభావాలను బట్టి వారాంతపు సెలవుకు పంతొమ్మిది విధానాలు రూపొందించడమైనది. ఆయా విభాగాధిపతులు తమకు అనుకూలంగా వుండే సెలవు విధానాన్ని ఎంచుకుని, అమలు పర్చే అవకాశ ఇంకా »

డిజిపిగారి సందేశం

దేశంలోనే ఎంతో ఘన చరిత్ర, విశిష్టత గల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి డిజిపిగా పదవీ బాధ్యతలు చేపడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను, గర్వకారణంగా భావిస్తున్నాను. నా మీద అపార నమ్మకంతో ఈ గురుతర బాధ్యతను అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర విభజన జరిగి ఐదు సంవత్సరాలు గడిచినా మన శాఖలో విభజన సంబంధిత సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర పోలీసు వ్యవస్థ బహుముఖ సవాళ్ళను ఎదుర్కొంటున్నది. మనకున్న పరిమిత వనరులతోనే వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. అందుబాటులో లేని అవకాశాల కోసం కాలాయాపన చేయకుండా... స్వయం సిద్ధ శక్తి సామర్థ్యాలను ఇంకా »

ప్రజా రక్షణే లక్ష్యంగా ముందుకు...

రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమాలను వారం రోజులపాటు స్ఫూర్తిదాయకంగా పూజ్యారాధనతో జరుపుకుని వారి ఎనలేని త్యాగాలను మననం చేసుకున్నాము. వారి అపూర్వ త్యాగాల స్మృతిలో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలను, రక్తదాన శిబిరాలను, ర్యాలీలను నిర్వహించి త్యాగధనులకు నీరాజనాలు పలికాము. ఇంకా »

సవాళ్ళను సమయస్ఫూర్తితో, సమర్థవంతంగా ఎదుర్కోవాలి

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను మరింతగా నియంత్రించే ప్రణాళికలో భాగంగా 'రహదారి భద్రత' అంశంపై ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించాము. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర రహదారులలో గస్తీ నిర్వహిస్తున్న వాహనాలకు అదనంగా మరిన్ని వాహనాలను సమకూర్చాల్సిన ఆవశ్యకతను గుర్తించడమైనది. ప్రమాదాలు తీరు విశ్లేషించుటకు, బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించేందుకుగాను గస్తీ వాహనములు, అంబులెన్స్‌లు, టోల్‌ ప్లాజాలు ఇతర రహదారులుపై గల సిసి కెమెరాలను జిల్లా కేంద్రం, ప్రధాన కార్యాలయం నందలి కమాండ్‌ కంట్రోల్‌నకు అనుసంధానం చేయాలని నిర్ణయించాము. ఇందుకు గాను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా సేఫ్టీ అడ్వైజర్‌ వారి సమ్మతి, సహకారంతో మూడు నెల ఇంకా »

రాష్ట్రవ్యాప్తంగా ''మహిళామిత్ర'', ''సైబర్‌మిత్ర''

గౌరవ కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్‌షాగారి ఆధ్వర్యాన ఢిల్లీలో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం గారితో పాటు హాజరయ్యాను. ఇంకా »

వార్తావాహిని