యూనిట్
Flash News
మాయమై పోతున్నాడమ్మ మనిషన్నవాడు
మనిషితనం కనుమరుగవుతున్న
సమాజంలో ఎలా జరగడానికైనా అవకాశం వుంది. మానవ సంబంధాలు - ఆర్థిక సంబంధాలుగా
కొనసాగుతున్నప్పుడు, అక్రమ
సంబంధాలు విజృంభిస్తున్నప్పుడు, నైతిక విలువలు, సామాజిక కట్టుబాట్లు వాటికవే తెగిపోవడం సహజం. వాటిని నిలబెట్టే ప్రయత్నంలో
పోలీసు శాఖ వున్నప్పటికి ఆ వ్యవస్థలోనే కీచకలు బయట పడినప్పుడు ఎటువంటి దారుణాలు
సమాజం ఎదుర్కోవలసి వస్తుందో ఈ సంఘటనే ఉదాహరణ.
తే||13-09-2016న విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలంలోని జగ్గునాయుడు
గ్రామస్తుడు రాగాల గంగునాయుడు అను వ్యక్తి బొబ్బిలి పోలీస్ స్టేషనుకు వచ్చి తన
కూతురు కునుకు మంగ తే|| 12-9-2016 ది నుండి కనిపించడంలేదని,
తన కూతురును 17 సం|| క్రితం
అదే గ్రామానికి చెందిన కునుకు శంకర్రావు అనే ఎస్‌పిపి హెడ్ కానిస్టేబుల్‌కు
యిచ్చి వివాహం చేసినట్లుగా వారిద్దరూ కొంతకాలం అన్యోన్యముగా కాపురం చేయగా యిద్దరు
ఆడపిల్లలు పుట్టినట్లు, తర్వాత వారిద్దరికి మనస్పర్థలు వచ్చి
ప్రస్తుతం కొంతకాలముగా వేరువేరుగా వుంటున్నట్లు, తన కూతురు
మంగ - తన అల్లుడిపై కట్నం వేధింపు కేసు సీతానగరం పోలీసు స్టేషనులో కేసు
పెట్టినట్లు, అలాగునే మనోవర్తి దావా కూడా కోర్టులో
పెండింగులో ఉన్నట్లు, అలాగునే తన అల్లుడు కూడా - తన కూతురిపై
విడాకులు కావాలని కోర్టులో కేసు పెట్టగా ఆ కేసు కూడా పెండింగులో వున్నట్లు మొదలగు
వివరాలు చెబుతూ, ప్రస్తుతం తన కూతురుకన్పించుట లేదని,
తన అల్లుడు, అతని తమ్ముడు, తండ్రి యింకా కుటుంబసభ్యులు ఏమైనా చేసి వుంటారని అనుమానం వ్యక్తం చేశాడు.
సదరు ఫిర్యాదును బొబ్బిలి ఎస్‌ఐ
అమ్మినాయుడుగారు వెంటనే (వుమెన్‌మిస్సింగ్) కేసుగా నమోదు చేసి దర్యాప్తు
ప్రారంభించారు. అనుమానం వ్యక్తం చేసిన తన అల్లుడు కునుకు శంకర్రావు, అల్లుడు తమ్ముడు కునుకు రామారావు, తండ్రి కునుకు సత్యనారాయణ సెల్‌ఫోన్ కాల్ డిటైల్స్‌పై నిఘా పెట్టారు.
ఔట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్ అలాగునే బాధితురాలు
మంగమ్మ సెల్‌ఫోన్‌పైన నిఘా పెట్టారు. మరొకవైపునుండి మంగమ్మ కోసం తీవ్ర అన్వేషణ
ప్రారంభించారు.
తప్పిపోయిన మంగమ్మ శం తే, 5-10-2016న కళేబరము (వుమెన్‌మిస్సింగ్) రూపంలో
సంతరాం గ్రామ సమీపంలో, బ్రిడ్జి వద్ద తుప్పల్లో చిక్కుకొని
కన్పించింది. సదరు కళేబరము తరలించడానికి కూడా వీలు లేనందున, శవము
వున్న ప్రదేశము బలిజిపేట పోలీస్ స్టేషన్ పరిధి అయినందున బలిజిపేట ఎస్‌ఐగారు
డాక్టరుగారిని శవము దొరికిన ప్రదేశము వద్దకే పిలిచి 'శవ పంచనామా'
చేసి శవము తాలూకా వివరాలు ధరించిన చీర, జాకెట్టు,
మెడలో ఉన్న నల్లపూసలు వగైరాలు వివరాలు బొబ్బిలి ఎస్‌ఐగారు
తెల్సుకొని, ఎందుకైనా తప్పిపోయిన మంగ శవముగా అనుమానించి సదరు
మంగయొక్క తండ్రి రాగాల గంగునాయుడును, మరియు ఆమె బంధువులను
కళేబరము వున్న ప్రదేశమునకు తీసుకుపోయి చూపించగా మంగ తండ్రి సదరు తప్పిపోయిన తన
కుమార్తెదేనని ఆమె కళేబరముపై నున్న చీర, జాకెట్టు, నల్లపూసలు వగైరాలు ఆమెవే అని గుర్తుపట్టారు. వెంటనే బలిజిపేట ఎస్‌ఐగారు
సదరు సిడి ఫైలును తదుపరి దర్యాప్తు నిమిత్తం బొబ్బిలి పోలీస్ స్టేషనుకు బదిలీ
చేశారు. శవ పంచనామా చేసిన డాక్టర్లు టీమ్, సదరు ూసశీశ్ర్‌ీవతీ
తల ఖీతీaష్‌బతీవ అయిందని, యింకా డిఎన్‌ఏ,
'విసిరా' జూతీవరవతీఙవ చేసి ూఅaశ్రీaరవర నిమిత్తం జూతీవశ్రీఱఎఱఅa్‌ఱశీఅ పై సదరు బలిజిపేట ఎస్‌ఐగారు కట్టిన 174
డబ్ల్యుపివో కేసుని 302, 201, 120-బి ఐపిసి కేసుగా aశ్ర్‌ీవతీ చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
తదుపరి దర్యాప్తులో భాగంగా, ముద్దాయిలు, బాధితురాలు
సెల్ ఫోన్ డేటా ఆధారంగా ముద్దాయిలు ఈ విధంగా తమ యొక్క నేర ఒప్పందంను గ్రామ విఆర్‌వో
ముందు ఒప్పుకున్నారు. భార్యాభర్తలుగా విడిపోయిన మంగ - శంకర్రావు దంపతుల మధ్య
విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో సదరు శంకర్రావు (యస్‌పిఎఫ్‌హెచ్‌సి) తన తమ్ముడైన
రామారావు, తన తండ్రియైన కునుకు సూర్యనారాయణలకు తన భార్యఅయిన
మంగను ఏ విధంగానైనా సాక్ష్యంలేకుండా చంపమని చెప్పడంతో సదరు శంకర్రావు పన్నిన పథకం
ప్రకారం, అదే గ్రామానికి చెందిన మడక సత్యనారాయణ అనే డ్రైవర్‌కు
డబ్బులు రూ. 2,50,000/- యిచ్చి కుట్రలో భాగంగా సదురు డ్రైవర్
సత్యనారాయణ బొబ్బిలికి దూరంగా వున్న మామిడి తోటలోకి తనకు బాగాపరిచయస్తురాలైన మంగను
తీసుకువచ్చి, ఆ విషయము మంగ మరిది అయిన రామారావుకు ఫోన్‌లో
చెప్పగా సదరు రామారావు ఆ నిర్మానుష్య ప్రదేశమునకు చేరుకొని అక్కడవున్న మంగను
వెంటబెట్టుకెళ్లిన 'జీడిమామిడి కర్ర'తో
తలపై విచక్షణా రహితంగా కొట్టగా తల పగిలిన మంగ రక్తపు మడుగులో అక్కడిక్కడే
చనిపోయినది.
వెంటనే రామారావు, డ్రైవర్ సత్యనారాయణ మరియు సూర్యనారాయణ ముగ్గురు మంగ శవాన్ని
తగరపు పట్టాలో చుట్టి వేగావతి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అందులోకి
విసిరిపారేశారు. ఆమెను చంపడానికి
ఉపయోగించిన జీడిమామిడి కర్రను కూడా అక్కడే
పడవేసి, శవాన్ని తెచ్చిన వాహనంపై
ముగ్గురు ఎవరింటికి వాళ్లు ఏమీ తెలియనట్లు వెళ్లిపోయి జరిగిన అన్ని విషయాలు మంగ
భర్తకు తెలియజేశారు. అయినా ఏమి ప్రయోజనం. ప్రతివాడు నేను తెలివైనవాడినే అని
అనుకుంటాడు. కానీ, వాడిలోనే వున్న తెలివితక్కువ తనం వాడికి
తెలియకుండానే వాడిని చట్టానికి పట్టిస్తుంది. ఆ తెలివితక్కువ తనమే పోలీసు శాఖకు
ఉపయోగపడుతుంది. నేరమే నేరస్థుడిని
పట్టిస్తుంది. నేరం చేసిన ఎవడూ చట్టం కబంధహస్తాల నుండి తప్పించుకోలేరు. నేరం చేసిన
వాడు ''నేను చట్టానికి దొరకను'
అనుకోవడం భ్రమ. మంగ మరిది రామారావు, మంగ
మామగారు, డ్రైవర్ లను తే|| 09-10-2016న
బొబ్బిలి సిఐగారు అరెస్టు చేసి జైలుకు పంపించారు.