యూనిట్
Flash News
అన్వేషణ
నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
పదార్థాలు, ఉత్పత్తులు, నిర్మాణాలు లేదా భాగాలు వైఫల్యం చెందటం లేదా సరిగా పనిచేయకపోవటం వల్ల వ్యక్తులకు గాని లేదా ఆస్తులకు గాని నష్టం వాటిల్లినప్పుడు అట్టి సంఘటనా స్థలాన్ని దర్యాప్తు చేసి కారణాలు కనుగొనే ప్రక్రియే 'ఫోరెన్సిక్ ఇంజనీరింగ్'. ఈ విభాగంలోని నిపుణులు వాహనాలు లేదా యంత్రాల నిర్వహణలో జరిగే ప్రమాదాలు లేదా సంఘటనలలో వైఫల్యాలను, కారణాలను గుర్తించి ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి దర్యాప్తునకు కోర్టుకు సహాయ పడతారు. ఈ క్రింది కేసులలో దర్యాప్తు అధికారికి వీరు సహకరిస్తారు. ఇంకా »
ఫోరెన్సిక్ భౌతిక శాస్త్ర విభాగం
మానవులు వారి ఆలోచనలను, భావోద్వేగాలను, వివిధ సంగతులను స్వరపేటికను ఉపయోగించి నిర్ధిష్టమైన శబ్దాలు, పదాల కలయికలతో వేరొకరితో పంచుకోవటాన్ని ప్రసంగం (స్పీచ్) అని అంటారు. మనోభావాలు ధ్వని మరియు శబ్దతరంగాల రూపంలో వినేవారి చెవికి ప్రయాణిస్తుంది. ఈ విధంగా శబ్దం మాటల రూపంలో ఉత్పన్నమవడానికి ప్రధాన కారణం మన శరీరంలోని ఊపిరితిత్తులు, స్వర నాళాలు, నాలుక, పెదవులు ముఖ్యమైనవి. ఇంకా »
నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
ఫోరెన్సిక్ భౌతిక సాక్ష్యాధారాల వలే కాకుండా ఆడియో మరియు వీడియో రికార్డింగులు దర్యాప్తు అధికారికి దర్యాప్తుకే కాకుండా కోర్టులలో ప్రత్యక్ష సాక్షుల వలె ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. నేటి డిజిటల్ ప్రపంచంలో క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ సిస్టమ్ (సిసిటివి) వంటి అత్యాధునిక ఆడియో మరియు వీడియో రికార్డర్లను వ్యాపార సంస్థల్లో, షాపుల్లో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, పార్కింగు స్థలాల్లో, బ్యాంకుల్లో, ఏటిఎమ్ సెంటర్లు ఇంకా »
కరెన్సీ నోట్లలోని భద్రతా అంశాలు
అసలైన -500 మరియు -2000 నోట్లను గుర్తించుటకు చూడవలసిన అంశాలు: ఈ అంశాలను రిజర్వుబ్యాంకు 8 నవంబర్, 2016న విడుదల చేసింది. ఈ క్రొత్త -500 నోటు పాతనోటుకంటే ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నది. ఇది సైజు, రంగు, ముద్రణ, సెక్యూరిటీ అంశాల స్థానాలు, డిజైన్ ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఈ క్రొత్త -500 నోట్లు 150 ఞ 66 మి.మీ. పరిమాణంలో స్టోన్ గ్రే రంగుతో, ముందు భాగాన చారిత్రాత్మక ఎర్రకోట గుర్తును, వెనుకవైపు భారత జాతీయ పతాకాన్ని కలిగి ఉంటుంది. అలానే, -2000 నోటు 166 ఞ 66 మి.మీ. పరిమాణంలో మజంటా రంగుతో, ముందు భాగాన మహాత్మా గాంధీ గుర్తును, వెనుకవైపు అంతరిక్ష నౌక మంగల్‌యాన్ గుర్తును కలిగి ఉంటుంది. ఇంకా »
నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
నకిలీ నోట్లు-పరీక్షలు-చట్టాలు 7. సూక్ష్మ అక్షరాల ముద్రణ: వీటిని భూతద్ధం సహాయంతో మాత్రమే చూడగలము. అన్ని నోట్లలో గాంధీబొమ్మ పక్కనే ఆర్‌బిఐ అనే అక్షరాలు ప్రక్కనే డినామినేషన్ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడున్న కొత్త రూ.500లు, రూ.2000లు నోట్లలో గాంధీగారి కళ్ళజోడు ఫ్రేముకు ఆర్‌బిఐ అని, అలాగే ప్రక్కనే ఆర్‌బిఐ 2000 ఇండియా అని, రూ.500లలోని ఎర్రకోట పట్టీకి భారత్, ఇండియా అని సూక్ష్మ అక్షరాల వరుస ముద్రించబడి ఉంటుంది. నోటు గణాంక విలువను వివిధ పద్ధతులలో నోటుపై ముద్రించి ఉంటారు. ఇంకా »
నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
ఇటీవల కాలంలో తరచూ పోలీసులు దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేశారంటూ వస్తున్న వార్తలను మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు భారత దేశంలో దొంగనోట్లు ముద్రించే వారి సంఖ్య కూడా ఎక్కువే. దీంతో అసలు ఏది? నకిలీ ఏది? అనేది తెలుసుకోవటం సామాన్యుడికి కష్టతరంగా మారింది. నకిలీ నోట్ల కేసుల్లో దర్యాప్తు అధికారి కేసులు నమోదు చేసి నోట్లను ఫోరెన్సిక్ భౌతికశాస్త్ర విభాగానికి పంపుతారు. వాటికి వారు వివిధ శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి తమ నివేదికలను ఇస్తారు. కావున దర్యాప్తు అదికారికి ఈ బ్యాంకు నోట్ల గురించి అవగాహన ఇంకా »
నేరస్థల పరిశోధనలోభౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
అక్రమార్జన కోసం వ్యాపారులు చట్టాలను ఉల్లంగించి నకిలీ వస్తువులు తయారు చేయటం రోజు రోజుకు పెరిగిపోతున్నది. మార్కెట్లన్ని నకిలీ వస్తువులతోను, నాణ్యతలేని వస్తువులతోనూ నిండిపోతున్నాయి. పెన్నులు మొదలు కొని యంత్రాల వరకు అనేకానేక వస్తువులకు నకిలీలు తయారవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో సబ్బులు, టాల్కమ్ పౌడర్లు, డిటర్జెంట్లు, తల నొప్పి మందులు, తూనికలు కొలతలు, ఆటోమొబైల్ స్పేర్ పార్టులు, ఇంజన్ ఆయిల్స్, పెయింట్లు, గృ¬పకరణ వస్తువులు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, గుట్కాప్యాకెట్లు, విత్తనాలు, సీళ్ళు, లేబుళ్ళు, ముద్రించిన పుస్తకాలు, కోర్టు స్టాంపులు, ఇంజను విడిభాగాలు, జ్యువెలరీ మొదలైన పలు వస్తువులకు నకిలీలు ఇంకా »
నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
గత సంచికలో దర్యాప్తు అధికారి అబ్జర్వేషన్ నోట్స్‌లో ప్రమాదం గురించి వ్రాసుకోవాల్సిన విషయాలు, నేరస్థలాన్ని స్కెచ్ మెథడ్ పద్ధతిలో ఏ విధంగా రికార్డు చేయాలి? అన్న విషయాలతోపాటు హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ స్థలాల్లో ముఖ్యంగా దొరికే సూక్ష్మ భౌతిక సాక్ష్యాధారాల గురించి చర్చించాం. ఈ సంచికలో వాహనం ఢీకొని పారిపోయిన నేరాలలో దర్యాప్తు అధికారి ఏయే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి? మరియు జారుడుగుర్తుల పొడవును ఏ విధంగా గణనలోకి తీసుకోవాలి? డ్రాగ్ ఫ్యాక్టర్ మరియు బ్రేకింగ్ ఎఫీషియన్సి అంటే ఏమిటి? ప్రమాదస్థలంలో దొరికే స్కిడ్ మార్కులు మరియు ఇతర అంశాల ఆధారంగా ఏ విధంగా నేరవాహనపు వేగాన్ని లెక్కించవచ్చో? తెలుపు ఇంకా »
అన్వేషణ భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
గత సంచికలో వివిధ రూపాల్లో నేరస్థలంలో లభించే పెయింట్‌కు, అనుమానిత వాహనపు పెయింట్‌కు ఎటువంటి శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తారు? ఇంకా »
భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
చెరిపి వేయబడిన నంబర్లను పునరుద్ధరించడం దొంగిలించబడిన వస్తువులు, వాహనాల నంబర్లను గుర్తించటానికి వీలు లేకుండా ఫైలింగ్, చిసెలింగ్, గ్రైండింగ్, ఆబ్లిటరింగ్, స్కోరింగ్ పద్ధతుల ద్వారా ఆ నంబరును చెరిపివేసి కొత్త నంబర్లను ముద్రిస్తారు. వీటిని పునరుద్ధరించడానికి ఫొరెన్సిక్ నిపుణులు రసాయన ఎచ్చింగ్, ఉష్ణోపచారం (హీట్ ట్రీట్‌మెంట్), అయస్కాంత కణ పద్దతి, ఎలక్ట్రో లైటిక్ రెస్టొరేషన్, ఆల్ట్రాసోనిక్ కావిటేషన్ పద్దతి వంటి శాస్త్రీయ పద్దతులను ఉపయోగిస్తారు. ఇంకా »
నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ
మనం వాడే ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, టీవీలు, నీటి మోటర్లు, తుపాకులు, ఆభరణాలు మొదలగువాటిని గుర్తించడం కొరకు వాటిపై తయారీ తేదీ, సంవత్సరం, సీరియల్ నంబర్లు, ఇంజన్లపై ఛాసిస్ నంబర్లు, బ్రాండ్ గుర్తులు, చిహ్నాలు, ఎంబ్లమ్‌లు లేదా ట్రేడ్ మార్కులను ఆయా కంపెనీలు వాటిపై ముద్రిస్తాయి. సాధారణంగా ఇవన్నీ లోహాలతో తయారు చేసిన ఇంజనుమీద, ఛాసీస్‌మీద లేక బాడీమీద లేదా లోహపు ప్లేట్ల మీద చాలా కట్టు దిట్టంగా ముద్రించి ఉంటాయి... ఇంకా »
భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
గత సంచికలో టైరుమార్కులు, అందులోని రకాలైన జారుడు గుర్తులు, వంపు తిరిగిన గుర్తులు, రుద్దుడు గుర్తులు మొదలైనవి ఎటువంటి సందర్భాల్లో వాహన ప్రమాదాల్లో మనం రోడ్డుమీద గమనిస్తుంటాము. ఈ అంశాలతోపాటుగా వాహన ప్రమాదాలు జరిగినప్పుడు దర్యాప్తు అధికారి ప్రత్యక్షసాక్షుల ద్వారా నమోదు చేసుకోవాల్సిన అంశాలేమిటి, వాహన ప్రమాద స్థలంలో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీపద్ధతులలో ఏయే విషయాలను రికార్డు చేసుకోవాలి అన్న విషయాల గురించి తెలుసుకున్నాం. ఈ సంచికలో అబ్జర్వేషన్ నోట్స్‌లో దర్యాప్తు అధికారి ప్రమాదం గురించి ఏయే విషయాలను వ్రాసుకోవాలి అన్న విషయాలే కాక, నేరస్థలాన్ని స్కెచ్ పద్ధతిలో ఎలా రికార్డు చేసుకోవాలి? మరియు హిట్‌అండ్ రన్ ఇంకా »
నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
ఏయే నేరాలలో మనకు పెయింట్ భౌతిక సాక్ష్యాధారాలుగా లభిస్తుంది? పెయింట్ అంటే ఏమిటి? అవి ఎన్నిరకాలుగా మనకు లభ్యమవుతున్నాయి? దానిలో ఏయే రసాయనాలు కలిసి ఉంటాయి? వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు నేరస్థలంలో, నేరస్థునిపై, అనుమానిత వాహనంపై, బాధితునిపై లేదా పరికరాలపై లభించినపుడు దర్యాప్తు అధికారి వీటిని ఏవిధంగా సేకరించాలి అన్న విషయాలే కాక వీటిపై ఫోరెన్సిక్ భౌతిక శాస్త్ర విభాగంలో ఎటువంటి శాస్త్రీయ పర్షీలు నిర్వహిస్తారు అన్న విషయాలను చర్చిచాం. ఇంకా »
భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
నేరస్థలంలో సేకరించిన శాంపిళ్ళను అనుమానిత వాహనపు శాంపిళ్ళతో లేదా అనుమానితుని వద్ద లభించిన పరికరాలపై లభించిన శాంపుళ్ళతో శాస్త్రీయ పరీక్షలు చేసి ఈ రెండు పెయింట్ నమూనాలు ఒకటేనా? కాదా? అన్న విషయాన్ని నిర్దారిస్తారు. ఇంకా »
భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
ఈ ఆధారాలకు జ్వలన పరీక్షలు, మట్టి రేణువుల సాంద్రత పరీక్షలు, ఫోరోసెన్స్ పరీక్షలు, స్పెక్ట్రోగ్రాఫిక్ అనాలసిస్, ఎక్స్‌రే డిఫ్రాక్షన్ పరీక్షలు, ఆమ్ల, క్షార పరీక్షలు మొదలగునవి ఎలా నిర్వహిస్తారు? వాటివల్ల ఏయే విషయాలు తెలుసుకోవచ్చు? వాటివల్ల దర్యాప్తు అధికారికి ఉపయోగం ఏమిటి? మొదలైన విషయాలను తెలుసుకోవడమే కాక, మట్టి, దుమ్ము మరియు ధూళి సేకరణ మరియు రవాణాలో ఎటువంటి పరికరాలను, సామగ్రిని ఉపయోగించుకోవచ్చు, ఈ భౌతిక సాక్ష్యాధారాల సేకరణ మరియు రవాణాలో దర్యాప్తు అధికారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి విపులంగా తెలుసుకుందాం. ఇంకా »