యూనిట్
Flash News
పోలీస్ సిబ్బందికి యోగ తరగతులు
విశాఖ నగర పోలీసు కమిషనర్
డా.సి.యం.త్రివిక్రమ వర్మ అదేశాల మేరకు శుక్రవారం సిటీ అర్మెడ్ రిజర్వ్ మైదానం
నందు బ్రహ్మ కుమారి సంస్థ వారి అధ్వర్యంలో
పోలీసు సిబ్బందికి యోగా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు ఏ.డీ.సీ.పీ
(ఏ.అర్) కె.సుబ్రమణ్యం , ఏ.సి.పి (ఏ.అర్)
ఆర్.పి.ఎల్ శాంతి కుమార్ మరియు ఏ.
రాఘవేంద్ర మరియు అర్. ఐ లు పాల్గొన్నారు.
నగరంలో నిత్యం పలు రకాల విధులు
నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా, మానసికముగా
దృడముగా ఉండేందుకు సహాయపడుతుందనేది ఉద్దేశంతో సి.పి గారు బ్రహ్మ కుమారి సంస్థ వారి
ఆధ్వర్యంలో ఈ రోజు పోలీసు సిబ్బందికి ప్రత్యేక యోగ తరగతులు నిర్వహించారు.
బ్రహ్మ కుమారి సంస్థ వారు
నిర్వహించిన ఈ తరగతిలో ముఖ్యంగా పని ఒత్తిడి నుండి వెంటనే బయటపడి మనస్సును
ప్రశాంతముగా ఉంచుకొను మార్గాలను, అలాగే సిబ్బందికి మనోధైర్యం
పెంపొందే పలు మార్గాలను సూచిస్తూ, పాజిటివ్ థింకింగ్ కలిగి
ఉండాలని, రోజులో కొంత సమయం ధ్యానం చేయడానికి కేటాయించాలని
తెలిపి, దానివలన కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు.