యూనిట్

పోలీస్ కలం

పోలీసుకు సెల్యూట్‌

అరే శివ రేపు పండుగ కదా, స్కూలు సెలవు కదా, మా ఇంటికి రారా, గేమ్స్‌ ఆడుకుందాము అన్నాడు జగదీష్‌. ''రావడము కుదరుదురా, మా అమ్మా నాన్నలతో పండుగ సెలబ్రేట్‌ చేసుకోవాలి, రేపు పార్కు, సినిమా, బీచ్‌కు వెళ్తాము ఎంజాయ్‌ చేస్తాము.''అని ఉత్సాహంగా జవాబిచ్చాడు శివ. ఇంకా »

'నవ్యాంధ్ర అభివృద్ధిలో పోలీసు పాత్ర - పోలీసు-ప్రజల భాగస్వామ్యం ఆవశ్యకత

ఇండో-టిబెట్‌ సరిహద్దుల్లో చైనా సైన్యం దాడిలో అమరులైన భారత సైనికులకు నివాళులర్పిస్తున్నాను. 1959 అక్టోబర్‌ 21న ఇండో-టిబెట్‌ సరిహద్దులోని ఈశాన్య లడఖ్‌ ప్రాంతంలో ''హాట్‌ స్ప్రింగ్స్‌'' ప్రవేశం వద్ద భారత సైనిక బృందాలపై చైనా దళాలు దాడులు చేశారు. వారి ప్రాణత్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో పోలీసుపాత్ర: ఇంకా »

నవ్యాంధ్ర అభివృద్ధిలో పోలీసు పాత్ర - ప్రజల భాగస్వామ్యం ఆవశ్యకత

ఏదేశం చరిత్ర చూసినా - ఏమున్నది గర్వకారణం' అని మహాప్రస్థానం చేసిన ఓ శ్రీశ్రీ - నాదేశ, రాష్ట్ర పోలీసు చరిత్రలో చూడు ఎన్ని విధులో, ఎన్ని సేవలో, ఎన్నెన్ని ప్రాణత్యాగాలతో నిండి ఉన్నాయో అర్థమవుతుంది. ''సత్యమేవ జయతే'' అనేది పోలీసులకు కేవలం ఒక నినాదం కాదు, అది మన పోలీసుల విధి విధానం - అంతేకాదు, 'శ్రీమయేవ జయతే'కి ప్రత్యక్ష సాక్షి పోలీసు - శ్రమైక జీవన సౌందర్యానికి విరామ మెరుగని నిత్య పరిశ్రమించిన వాడు. నిరంతర ప్రజా సేవకుడు పోలీస్‌. ''ఎందెందు వెతికి చూచినా అందందేకలడు చక్రీ సర్వోపగతుండు'' అని బమ్మెర పోతన చెప్పిన ఈ పద్యం ఆ మహావిష్ణువుకు వర్తిస్తుందో లేదో గాని, ఎక్కడ సంఘ విద్రోహాలు, నేరగాళ్ళు, రౌడీలు, ఇంకా »

మాయమై పోతున్నాడమ్మ మనిషన్నవాడు

మనిషితనం కనుమరుగవుతున్న సమాజంలో ఎలా జరగడానికైనా అవకాశం వుంది. మానవ సంబంధాలు - ఆర్థిక సంబంధాలుగా కొనసాగుతున్నప్పుడు, అక్రమ సంబంధాలు విజృంభిస్తున్నప్పుడు, నైతిక విలువలు, సామాజిక కట్టుబాట్లు వాటికవే తెగిపోవడం సహజం. వాటిని నిలబెట్టే ప్రయత్నంలో పోలీసు శాఖ వున్నప్పటికి ఆ వ్యవస్థలోనే కీచకలు బయట పడినప్పుడు ఎటువంటి దారుణాలు సమాజం ఎదుర్కోవలసి వస్తుందో ఈ సంఘటనే ఉదాహరణ. ఇంకా »

పోలీసులు- సమాజం

విశాఖ జిల్లాలో ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలలో మొదటగా చెప్పుకోవలసింది సింహాచలం, శ్రీ వరహా లక్ష్మి నృసింహస్వామి దేవాలయం. ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సంవత్సరానికి ఒక్కసారి జరిగే చందనోత్సవము. స్వామి వారికి గందం వొలుపు కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వేలకొలది భక్తులు వస్తుంటారు. ఈ చందనోత్సవానికి మొదటి రోజు విజయనగర రాజరికానికి చెందిన ఈనాటి కేంద్రమంత్రి అశోకజగపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారి గందం వొలుపు కార్యక్రమానికి నాంది పలుకుతారు. అంతటి ప్రత్యేకత వున్న ఈ దేవాలయానికి మా విశాఖపట్నం ప్రజలు ప్రతీ సంవత్సర ఇంకా »

వార్తావాహిని