యూనిట్

నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్న పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌

నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్న పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర పోలీసు శాఖ నిర్మాణాలను చేపట్టడానికి ఆవిర్భవించిన పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నేడు ఇతర ప్రభుత్వ శాఖల భవనాలను కూడా సమర్థవంతంగా నిర్మిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్నది. నలభైయేళ్ళ సుదీర్ఘ ప్రస్థానం ఉన్న కార్పొరేషన్‌ వార్షిక పనుల విలువ గతంలో ఏడాది గరిష్టంగా 250 కోట్లు ఉండగా ప్రస్తుతం అది 1,750 కోట్లకు చేరుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది. సంస్థ పనితీరు మెచ్చి సాంఘిక సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ అంధ్రప్రదేశ్‌, శ్రీ వెంకటేశ్వర, శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ, ఆచార్య యన్‌జి రంగా విశ్వవిద్యాలయాలతోపాటుగా ఇతర ప్రభుత్వ శాఖలు మన సేవలు వినియోగించుకుంటున్నాయి. కార్పొరేషన్‌ ఉన్నతికి కారకులైన ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించడమైనది. అదే విధంగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఎక్కడా లేని విధంగా భీమా సౌకర్యాన్ని కల్పించి డిజిపి శ్రీ డి. గౌతమ్‌ సవాంగ్‌ గారి చేతుల మీదుగా బాండ్‌లను అందజేశాము. కార్పొరేషన్‌ పురోభివృద్ధికి, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న డిజిపి గారికి సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

వార్తావాహిని