యూనిట్
Flash News
రాష్ట్ర పోలీస్‌కు ప్రతిష్టాత్మక 'స్కోచ్' పురస్కారాల పంట
సమాజానికి విశిష్ట సేవలు అందించే వారికి బహుకరించే స్కోచ్ పురస్కారాలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వుంది. అటువంటి ఈ పురస్కారాలను మునుపెన్నడు లేని విధంగా తొమ్మిది గెలుచుకొని జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ధ్యేయంతో మన పోలీస్ శాఖ రూపకల్పన చేసిన తొమ్మిది స్ఫూర్తిదాయక, ఆధునిక, సాంకేతికపర విధానాలు దేశవ్యాప్త పరిశీలనలో ఎంపిక సాధించి సత్తా చాటాయి. స్కోచ్ సమ్మిట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వారు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సదస్సులో కేంద్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాలలోని నిపుణులు, మీడియా ప్రముఖులు ఇలా దేశవ్యాప్తంగా హాజరైన 250 మంది ప్రతినిథుల సమక్షంలో ఈ అవార్డ్‌లు బహుకరించారు.
కార్యక్రమానికి హాజరైన డిజిపి శ్రీ డి గౌతమ్ సవాంగ్ ఈ
విధానాల రూపకల్పనకు కృషి చేసిన విశాఖ సిటీ కమీషనర్ శ్రీ ఆర్‌కె మీనా మరియు
ఎస్పీలను, ఇతర అధికారులు సిబ్బందిని అభినందించారు. ఈ
పురస్కారాలు మన పోలీస్ శాఖ శ్రమకు, నిబద్దతకు నిదర్శనమని,
ఈ ప్రోత్సాహంతో మరింతగా ప్రజాసేవలో అంకితమవుతామని అన్నారు. అవార్డ్‌లను
దక్కించుకొన్న విధానాలు.
వారాంతపు సెలవు: ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పోలీస్ శాఖలో
వారాంతపు సెలవు కు శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి
డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారు కంకణబద్దులై అడిషనల్ డిజి లా అండ్ ఆర్డర్
శ్రీ రవిశంకర్ అయ్యన్నార్ గారి నేతృత్వంలో 21 మంది సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీ త్వరితగతిన
సమగ్ర అథ్యయనం జరిపి 19 రకాల షిఫ్ట్ విధానాలను సిఫారసు
చేసింది. అధికారికంగా, సమర్థవంతంగా పోలీస్ వీక్లీ ఆఫ్ ను
అమలు జరుపుతున్న తొలి రాష్ట్రంగా ఖ్యాతికెక్కింది. పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు
ఎప్పుడు, ఎవరికి, ఎలా వీక్లీ ఆఫ్
వస్తుందో సులువుగా తెలుసుకోవడానికి ఒక సాఫ్ట్‌వేర్ యాప్‌ను డిఐజి టెక్నికల్
సర్వీసెస్ పాలరాజు మరియు ఎస్పీ ఎస్‌వి రాజశేఖర బాబులు ఆధ్వర్యంలో రూపొందించారు.
స్కోచ్ అవార్డ్ ఎంపిక నిమిత్తం నిర్వహించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో ఈ వీక్లీ ఆఫ్
విశేష స్పందన పొంది అవార్డ్ సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది సిబ్బంది ఈ సౌలభ్యాన్ని కుటుంబాలతో పంచుకొంటూ మరింత ఉత్సాహంతో
విధులు నెరవేరుస్తున్నారు.
ఉమెన్ జువైనల్ వింగ్: చిత్తూరు జిల్లాలో
చేపట్టబడిన ఈ ప్రాజెక్ట్ మహిళలపై జరుగు నేరాలు, వాటిని
అడ్డుకోవడానికి అవలంభించాల్సిన విధానాలపై ప్రజలలో విరివిగా అవగాహన కల్పించింది.
సైకిల్ ర్యాలీలు, హాకథాన్‌లు, సాంస్కృతిక
కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ విధానం ప్రజలకు బాగా చేరువ అయినందుకు అవార్డ్
అందుకుంది. అదనపు ఎస్పీ శ్రీమతి ఇ. సుప్రజ ఆధ్వర్యంలోని బృందం ఈ ప్రాజెక్ట్‌ని
జ్యూరీ ముందుకు తీసుకొని వచ్చారు.
ఫేస్ ట్రాకర్: నేరస్థులను సులువుగా కనిపెట్టడానికి సహకరించే ఆధునిక సాఫ్ట్‌వేర్ విధానం.
ఇందులో పొందుపరచబడిన వివరాల ప్రకారం అనుమానితుల ముఖ కవళికలు పరీక్షించడం ద్వారా
నేరస్థులను కనుగొనడం జరుగుతుంది. ఆర్‌ఎస్‌ఐ సురేష్ రెడ్డి బృందంచే జ్యూరీ వద్దకు
తీసుకు రాబడిన ఈ ప్రాజెక్ట్ ఎంపిక సాధించడంతో అనంతపురం ఎస్పీ సత్య యేసుబాబు
జిల్లా పోలీస్ తరపున అవార్డ్ అందుకున్నారు.
ప్రేరణ: గిరిజన యువతకు స్వయం ఉపాధి, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ
అవకాశాలు కల్పించే లక్ష్యంలో భాగంగా వారికి విశాఖ జిల్లా పోలీస్ వృత్తి
నైపుణ్యాలను అందించడంలో సహాయపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ అవార్డ్
దక్కించుకోవడానికి సతీష్ ఐపిఎస్ ఆధ్వర్యంలోని బృందం విశేషంగా కృషి చేసింది.
స్ఫూర్తి: పాడేరు ఎస్‌డిపిఓ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో
చేపట్టిన ఈ కార్యక్రమం గిరిజన యువత పోలీస్, ఆర్మీ మరియు ఇతర రాష్ట్ర, కేంద్ర
సాయుధ బలగాలలో ఉద్యోగాలు పొందేందుకు విశేషంగా దోహదపడింది. శిక్షణతో పాటు వారికి
ఆహార, వసతి ఏర్పాట్లు చేసి వారి భవిష్యత్‌కు బాటలు
వేసినందుకు విశాఖ జిల్లా పోలీస్ పురస్కారాన్ని సాధించింది.
ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ పెట్రోలింగ్
అండ్ రీసెర్చ్ సెంటర్: ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం నుండి పోలీస్
బీట్స్ మరియు పెట్రోలింగ్స్‌ను ఇ - సర్వేలెన్స్ చేసే ఈ విధానాన్ని అనకాపల్లి ఎస్‌డిపిఓ
శ్రీమతి కె. శ్రావణి రూపొందించి జ్యూరీ ముందుకు ప్రవేశపెట్టి అవార్డ్
దక్కించుకోవడంలో విశేష కృషి చేశారు. ఇందుకు గాను విశాఖ జిల్లా పోలీస్ మరో
పురస్కారాన్ని అందుకున్నారు.
జూనియర్ దర్యాప్తు అధికారులు (జె.ఐ.ఓ): క్రింది స్థాయి అధికారులకు దర్యాప్తులో మెలకువలు, వివిధ అంశాలపై అవగాహన
పెంచడం, వారికి శిక్షణ అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
దీనిని ప్రకాశం జిల్లా పోలీస్ ఇన్‌స్పెక్టర్స్ శ్రీరామ్ మరియు
నాగమల్లేశ్వరరావులు రూపొందించారు. జ్యూరీ మెప్పు పొందడం ద్వారా ఈ విధానం ప్రకాశం
పోలీస్‌కు పురస్కారాన్ని సాధించిపెట్టింది.
బదిలీ నిర్వహణ వ్యవస్థ: సంస్థానుగతంగా, క్రమానుగతంగా శాఖలో జరిగే సిబ్బంది బదిలీలకు సంబంధించిన
ప్రాజెక్ట్ ఇది. దీనిని శ్రీకాకుళం జిల్లా ఇన్‌స్పెక్టర్ ఎన్. హెచ్. విద్యానంద్
జ్యూరీ వద్దకు తీసుకు రావడంలోను, పురస్కారాన్ని
అందుకోవడంలోను కృషి చేసారు.
విజిటర్స్ మానిటరింగ్ సిస్టమ్: హోటళ్ళు, లాడ్జ్‌లు మరియు
రిసార్ట్స్‌లలో విడిది చేసే వారిని సునిశితంగా పరిశీలించి మరియు అనుమానాస్పద
అంశాలపై తనిఖీ చేయడం వంటి వానికి తోడ్పడే ప్రాజెక్ట్. దీనిని రూపొందించి
సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకుగాను విశాఖ సిటీ పోలీస్ ఈ పురస్కారాన్ని కైవసం
చేసుకుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిజిపి శ్రీ డి.
గౌతమ్ సవాంగ్ గారితోపాటు రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా, బెటాలియన్ ఐజిపి బత్తిన
శ్రీనివాస్, విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ ఆర్ కె మీనా,
డిఐజి పాలరాజు, ఏఐజి రాజశేఖర్‌బాబు, గ్రేహండ్స్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, శ్రీకాకుళం
ఎస్పీ అమ్మిరెడ్డి, నెల్లూరు ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, అనంతపురం ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు, చిత్తూరు
ఎస్పీ సెంథిల్ కుమార్, ప్రకాశం ఎస్పీ సిద్దార్థ్ కౌశల్,
5వ బెటాలియన్ కమాండెంట్ కోటేశ్వరరావు మరియు ఇతర ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.
శ్రీకాకుళంకు 'ట్రాన్స్‌ఫర్ మాడ్యుల్'కి స్కోచ్ అవార్డు
న్యూఢిల్లీ కాన్‌స్ట్యూషన్ క్లబ్ ఆఫ్
ఇండియా సదస్సులో శ్రీకాకుళం జిల్లా పోలీస్ సాంకేతిక విభాగం రూపొందించిన 'ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్'' సాఫ్ట్ వేర్ ప్రతిభకు రాష్ట్ర డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్
గారి సమక్షంలో స్కోచ్ ఫౌండేషన్ మేనేజ్‌మెంట్ వారి చేతులమీదగా జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.
అమ్మిరెడ్డి స్కోచ్ అవార్డును అందుకున్నారు. పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియలో ఈ
ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్ ఎంతగానో సహకరిస్తుంది. బదిలీల సమయంలో సిబ్బంది, గతములో ఏయే పోలీస్ స్టేషన్లలో ఎంత కాలం పని చేశారు. ప్రస్తుతం జిల్లాలో
అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న ఖాళీలను ఒకేసారి స్క్రీన్ పై కనిపించే విధముగా
రూపొందించడంతో, ట్రాన్స్‌ఫర్ కౌన్సిలింగ్ సమయములో వారికి
కావలసిన పోలీస్ స్టేషన్ ఎంపిక చేసుకునే విధంగా, పోలీస్
సాంకేతిక విభాగములో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేయుచున్న బలివాడ రమేష్ ఆధ్వర్యంలో
ఈ ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీని వలన పారదర్సకంగా,
తక్కువ సమయంలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇది ఢిల్లీ
స్థాయిలో గుర్తింపు పొందడం జిల్లా ఎస్పీని డిజిపి గారు అభినందించారు.
స్కోచ్ అవార్డుకు ఎంపికైన ''ఫేస్ ట్రాకర్''
అనంతపురం జిల్లాలో నూతనంగా ప్రవేశపెట్టిన ''ఫేస్ ట్రాకర్'' ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డుకు ఎంపికైంది. శుక్రవారం ఢిల్లీలో స్కోచ్
సంస్థ నిర్వహించిన ఈ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర డి.జి.పి శ్రీ
దామోదర్ గౌతమ్ సవాంగ్, ఇతర సీినియర్ పోలీసు అధికారులతో
కలిసి జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు స్కోచ్ అవార్డు అందుకున్నారు. అనంతపురం
జిల్లాలో ఫేస్ ట్రాకర్ యాప్ ద్వారా నేరస్థులను గుర్తించే కార్యక్రమానికి ఎస్పీ
నేతత్వంలో చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. జిల్లాలో రాత్రి సమయాల్లో
అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల ఫోటోలు, వేలిముద్రలు
స్వీకరించే కార్యక్రమాలను కొన్ని నెలలుగా చేపడుతున్నారు. ఫేస్ ట్రాక్‌ర్ పాటు
ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్‌వర్కింగ్ సిస్టం (ఖీIచీూ)
యాప్‌తో జాతీయ స్థాయిలో నేరస్థుల వివరాలు నమోదై ఉండడం ద్వారా జిల్లాలో
అడుగుపెట్టిన వెంటనే పట్టుబడుతున్నారు. టెక్నాలజీ వినియోగంలో అనంతపురం జిల్లా
ముందుండడంతో ఈ అవార్డుకు ఎంపికైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. జిల్లా ఎస్పీతో
ఆర్.ఎస్.ఐ సురేష్ రెడ్డి, ఐ.టి కోర్ టీం సిబ్బంది
మంజునాథ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా ఉమెన్ జువెనైల్ వింగ్
ప్రాజెక్ట్‌కు స్కోచ్ సిల్వర్ అవార్డు ప్రధానం
మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దాడులు, వారి
రక్షణ కొరకు చిత్తూరు జిల్లా పోలీసు శాఖ పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.
ప్రత్యేకంగా మహిళలు, పిల్లల రక్షణకు ఉమెన్ అండ్ జువెనైల్
వింగ్‌ను ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా ఎన్నెన్నో అవగాహన కార్యక్రమాలు, సదస్సులు జరిపించారు. ఉమెన్ అండ్ జువెనైల్ వింగ్ ఆధ్వర్యంలో ప్రతి
రోజూ స్కూల్స్, కాలేజీలలో, గ్రామాలలో
సందర్శించి చట్ట పరంగా విద్యార్థులను మరియు మహిళలను చైతన్య పరుస్తున్నారు. ఆ కోవలో
భాగంగా 2017వ సంవత్సరం నందు నలుగురు మహిళా కానిస్టేబుళ్ళచే
జిల్లాలోని 56 మండలాలలో 1200కి.మీ.లు 45 రోజుల సైకిల్ యాత్ర నిర్వహించి లక్షల మంది మహిళలు, విద్యార్ధులలో చట్టాలపై అవగాహన కల్పిస్తూ స్ఫూర్తి నింపారు. అంతర్జాతీయ
మహిళా దినోత్సవం మార్చి 8, 2018 వ తేదీన ఉమెన్ హ్యాకథాన్‌ను
ప్రారంభించి 30 ప్రచార రధాలతో సుమారు 1100 పంచాయతీలలో 4740 గ్రామాలలో ప్రతి దినం మహిళా రక్షణ,
భద్రత మరియు సాధికారతపై ఒక గంట నిడివి గల వీడియోలు ప్రదర్శించి
అవగాహన సదస్సులు ఏర్పరచి ప్రజలలో, మహిళలలో మరియు
విద్యార్థులను చైతన్య పరిచారు. అదే విధంగా జిల్లా నందు 8
ముఖ్యమైన పట్టణాల నందు వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు విభాగాల వారిని సమన్వయ పరిచి
భారీ అవగాహన సదస్సులు నిర్వహించారు. 38 జు- దీIఖజుూ సైకిల్‌లతో పెట్రోలింగ్, ఈ విధంగా పలు
విన్నూత్నమైన కార్యక్రమాలతో ఉమెన్ అండ్ జువెనైల్ వింగ్ తన ఉనికిని చాటు కోవడమే
కాకుండా మహిళల మరియు పిల్లలపై జరుగు నేరాలు మరియు అఘాయిత్యాలను నిరోధించడంలో
సఫలీకతం అయ్యారు. జాతీయ స్థాయిలోప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల యందు నిర్వహించు
వినూత్న కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులను ప్రోత్సహించే విధంగా స్కోచ్ సంస్థ
ప్రతి సంవత్సరం ప్రముఖుల ఆధ్వర్యంలో అవార్డు ప్రధానోత్సవం నిర్వహిస్తారు. ఈ
సంవత్సరం చిత్తూరు జిల్లా నుంచి ఉమెన్ అండ్ జువెనైల్ వింగ్ తరపున
నిర్వహిస్తున్న పలు ప్రాజెక్ట్స్‌ను స్కోచ్ సంస్థ వారికి ప్రజెంటేషన్ ఇవ్వడం
జరిగినది. స్కోచ్ సంస్థ వారు తమ వెబ్‌సైట్ ద్వారా జాతీయ స్థాయిలో 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఓటింగ్
నిర్వహించడం జరిగినది. జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఓటింగ్ నందు చిత్తూరు జిల్లా
ఉమెన్ అండ్ జువెనైల్ వింగ్ ప్రాజెక్ట్ 2260ఓట్లతో
దూసుకెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీ నందు Constitution Club of India నందు నిర్వహించిన స్కోచ్ అవార్డు ప్రదానోత్సవం నందు చైర్మన్ అఫ్ స్కోచ్
గ్రూప్ శ్రీ సమీర్ కొచ్చర్ మరియు CEO Dr. Dhanjal స్కోచ్
సిల్వర్ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ గారు,
సమక్షంలో చిత్తూరు జిల్లా ఎస్.పి.సెంథిల్ కుమార్ గారికి
అందజేశారు.