యూనిట్

ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు జి-ఫైల్స్‌ గవర్నెన్స్‌ - 2019

న్యూఢల్లీ లోని సివిల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కేంద్ర మంత్రులు శ్రీ నితిన్‌ జయరామ్‌ గడ్కరీ, అర్జున్‌రామ్‌ మెగ్వాల్‌ చేతు మీదుగా 7వ జి-ఫైల్స్‌ గవర్నెన్స్‌ అవార్డ్‌ అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్పందన’ కార్యక్రమాన్ని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నత పౌర సేలు అందిస్తున్నందుకుగాను వీరికి ఈ  పురస్కారం లభించింది.

ఈ సందర్భంగా ఎస్పీ సిద్థార్థ్‌ కౌశల్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారు, డిజిపి శ్రీ డి. గౌతమ్‌ సవాంగ్‌ గారు ప్రవేశపెట్టిన స్పందన’ వినూత్న కార్యక్రమంని చిత్తశుద్ది, అంకితభావంతో అమలు చేయడం వలన తనకు ఈ పురస్కారం భించిందని, అందుకు ఇది వారితోపాటు తనకు సహకరించిన జిల్లా సిబ్బంది అందరికీ దక్కిన గుర్తింపు అని అన్నారు. గతంలో 10 నుంచి 20 శాతం మంది మహిళలు మాత్రమే తమ సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేవారని, స్పందన’ కార్యక్రమం ద్వారా 50 శాతానికి పైగా మహిళలు ధైర్యంగా పోలీస్‌ స్టేషన్‌కు వస్తున్నారన్నారు.

అతి తక్కువ వ్యయంతో మారుమూల పోలీస్‌ స్టేషన్‌ను కూడా జిల్లా కార్యాలయంతో అనుసంధానం చేసి స్పందన’ ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి పరిష్కరించడం చేస్తున్నామన్నారు. అంతే కాకుండా విదేశాలో వుంటున్న వారి సమస్యలను కూడా ఆన్‌లైన్‌లో మాట్లాడి పరిష్కరించడం ద్వారా కార్యక్రమాన్ని మరింత ఫలప్రదం చేస్తుందన్నారు.

వార్తావాహిని