యూనిట్

పిపియం, ఐపియంలు


పేరు బీ సి. జయ రామరాజు

హోదా : డిఎస్పీ, ప్రస్తుత విధులు  : ఎస్‌ఈ సెల్‌, ఏసీబీ హెడ్‌ క్వార్టర్స్‌, విజయవాడ

రివార్డ్స్‌ క్యాష్‌ రివార్డ్స్‌ -37, కమెండేషన్స్‌ : 2, ఏప్రిసియేషన్స్‌ -5, జిఎస్‌ ఈ - 73, ఎం ఎస్‌ ఈ - 4, ఐక్యరాజ్య సమితి పతకం, పోలీస్‌ డ్యూటీ మీట్‌లో ప్రతిభ కారణంగా రెండు అడ్వాన్స్‌ ఇంక్రిమెంట్స్‌, 2009లో రాష్ట్ర పోలీస్‌ సేవాపతకం, 2018లో రాష్ట్ర పోలీస్‌ ఉత్తమ సేవాపతకం, 2011లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

బయోగ్రఫీ:  1989లో సబ్‌ ఇన్స్పెక్టర్‌గా పోలీస్‌ శాఖలో బాధ్యతు స్వీకరించారు. తీవ్ర ఫ్యాక్షన్‌ ప్రభావిత ప్రాంతాలైన పులివెందు,రాయచోటి,ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు 1  టౌన్‌, ప్రొద్దుటూరు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్స్‌లో అత్యంత ప్రతిభావంతంగా విధులు నిర్వర్తించారు. ఫ్యాక్షన్‌ వర్గాలపై కఠినంగా కేసులు పెట్టడం, బైండోవర్‌ చేయడం, బాంఋ, తుపాకులు, కత్తులు వంటి ఇతర మారణాయుధాలు వశపర్చుకోవడంతో, అసాంఘిక శక్తులు గ్రామాలు వదిలిపోవడంగాని, ఫ్యాక్షన్‌ వదిలి రాజీపడి బతకడం గాని జరిగింది. అయోధ్య - బాబ్రీమసీదు మతకల్లోలాల నేపథ్యంలో సమీప కడప, మదనపల్లెలో ఘర్షణు చోటు చేసుకున్నా, ముస్లిమ్స్‌ అధికంగా ఉన్న రాయచోటిలో ఏ ఒక్క అవాంఛనీయ ఘటన జరగకుండా జాగ్రత్త వహించి అందరి ప్రశంసలు పొందారు. 2000  నుండి 2014 వరకు కడప, కర్నూల్‌ ఇంటలిజెన్స్‌ విభాగమునందు ఇన్స్పెక్టర్‌గా, డిఎస్పీగా విశిష్ట సేవలు అందిన్చారు. ఈ క్రమంలో 2004 2009 2014 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు స్థానిక ఇతర ఎన్నికులు సజావుగా సాగడానికి క్షేత్ర స్థాయి సమాచార సేకరణ, సర్వులు, నివేదికలు అందించడం ద్వారా కీలకంగా వ్యవహరించారు. 2016  నుండి ఎసిబి విభాగంలో విధులు నిర్వర్తిస్తూ 40 అవినీతి వలపన్నిన కేసు నమోదు చేసి 20  కోట్ల మేర నగదు స్వాధీన పర్చుకున్నారు. అనేక పోలీస్‌ డ్యూటీ మీట్‌లో పాల్గొని లెక్కకు మించిన పతకాలు పొంది రాష్ట్ర పోలీస్‌ ఖ్యాతిని ఇనుమడిరపజేశారు.


పేరు : రాజీవ్‌ కుమార్‌ మీనా, ఐపిఎస్‌.

హోదా : ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, ప్రస్తుత విధులు: విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌, ప్రకటించిన పతాకం : ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

బయోగ్రఫీ : 1995లో   ఐపీఎస్‌గా ఉత్తీర్ణత సాధించి, శిక్షణానంతరం ఎఎస్పీ ములుగు, వరంగల్‌ పదవీ భాద్యతలు స్వీకరించారు. తదనంతరం ఆదిలాబాద్‌ అడిషనల్‌ ఎస్పీగా, 6, 13  ఏపీఎస్పీ బెటాలియన్స్‌ కమాండెంట్‌గా, మహబూబ్‌ నగర్‌, ఖమ్మం జిల్లా ఎస్పీగా మరియు నిజామాబాద్‌ రేంజ్‌ డిఐజిగా సమర్థవంతమైన విధులు  నిర్వర్తించారు. వీరు ఎక్కువ కాలం నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలో ప్రతిభావంతంగా విధులు నిర్వర్తించి నక్సల్‌ కార్యకలాపాను కట్టడి చేయడంతో పాటు ఎంతో మంది లొంగుబాట పట్టడానికి ముఖ్యపాత్ర వహించారు. వీరి ప్రతిభకు తార్కాణంగా కేంద్ర హొం శాఖ యాంటీ నక్షల్‌ ఆపరేషన్‌కు డైరెక్టర్‌గా నియమించగా అక్కడ కూడా విశిష్ట సేవతో గుర్తింపు పొందారు.రాష్ట్ర విభజన అంశాలో ఒకటైన స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్స్‌ పంపకాలలో నోడల్‌ ఆఫీసర్‌గా ఎటువంటి వివాదాలకు తావులేకుండా విభజన జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం మరియు అమరవీరుల దినోత్సవములను అత్యంత సమర్థ వంతంగా నిర్వహించారు. యెస్డిఆర్యయ్ఫ్ విభాగపు ఇంచార్జ్‌గా తిత్లీ తుఫాన్‌ సమయంలో సమర్థ సేవలు అందించి భారీ ఆస్తి, ప్రాణ నష్టమును నివారించి అందరి ప్రశంసలు  అందుకున్నారు. పోలీస్‌ స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌గా ఉన్న సమయంలోనే మన పోలీస్‌ జట్టు యుఎస్‌ఏలోని లాస్‌ ఏంజెల్స్‌, కాలిఫోర్నియాలో జరిగిన వరల్డ్‌ పోలీస్‌ అండ్‌ ఫైర్‌ గేమ్స్‌ - 2017లో పాల్గొని మూడు బంగారు, ఏడు వెండి, ఒక కాంస్య పతకం సాధించి సరికొత్త చరిత్ర లికించింది.

 

పేరు : జి. విజయకుమార్‌, ఐపిఎస్‌.
హోదా : ఎస్పీ, ప్రస్తుత విధులు : ఇంటలిజెన్స్‌ విభాగం, విజయవాడ

రివార్డ్స్‌ : 2009 రాష్ట్ర ప్రభుత్వ పోలీస్‌ సేవ పతకం, ప్రకటించిన పతకం : ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

బయోగ్రఫీ : 1998 లో డిఎస్పీగా పోలీస్‌ శాఖలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌ రూరల్‌ మరియు గోదావరి ఖని ఎస్డీపీఓగా అత్యంత సమర్థవంతంగా పనిచేసి అనేక మంది మావోయిస్ట్ ల అరెస్ట్‌, లొంగిపోవుటకు మరియు భారీ స్థాయిలో తుపాకు, మందుగుండు సామాగ్రి వశపర్చుకోడానికి దోహదపడ్డారు. డిఎస్పీ అనంతపూర్‌ సబ్‌ డివిజన్‌, అడిషనల్‌ ఎస్పీ  అనంతపూర్‌ జిల్లాగా ప్రతిభావంతంగా విధు నిర్వర్తించి ఫ్యాక్షనిజం, వామపక్ష తీవ్రవాదంను విజయవంతంగా అణచివేశారు. డిసిపి విజయవాడ గా విధులు నిర్వర్తిస్తూ ఐపిఎస్‌గా పదోన్నతి అందుకున్నారు. మెదక్‌, కృష్ణ జిల్లా ఎస్పీగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజ ఆదరాభిమానాలు అందుకున్నారు. నాటి గౌరవ ముఖ్యమంత్రివర్యులకు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ప్రతిభావంత సేవలన్దించారు. అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గా లు కలిగి ఉండే తూరుపు గోదావరి జిల్లా ఎస్పీగా 2014 ఎన్నికలను ఎటువంటి అలజడి కూడా జరగకుండా చూసారు. ప్రస్తుతం విజయవాడ ఇంటలిజెన్సు విభాగమునందు సేవలన్దిస్తున్నారు.

 

పేరు : జి. రామాంజనేయులు
హోదా : అడిషనల్‌ ఎస్పీ, ప్రస్తుత విధులు : రీజనల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీస్‌, అనంతపురం, రివార్డ్స్‌ : క్యాష్‌ రివార్డ్స్‌ - 89,
  కమెండేషన్స్‌ - 5, ఏప్రియేషన్స్‌ 14, ప్రకటించిన పతకం : ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ 

బయోగ్రఫీ : 1985లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్‌ శాఖలో అడుగుపెట్టారు. గుంటూరు రూరల్‌, గుంటూరు అర్బన్‌, ప్రకాశం, నల్గొండ జిల్లాలో 23 దొంగతనం, దోపిడీ, హత్య కేసులో ముద్దాయిలైన 9 మంది కరడుగట్టిన క్రిమినల్‌ గ్యాంగ్‌లను అరెస్ట్‌ చేసి భారీ ఎత్తున చోరీసొత్తును, తుపాకలు, కత్తు వంటి మారణాయుధాలను స్వాధీన పరచుకొని ఉన్నతాధికారుల మన్ననలను అందుకున్నారు. ఒంగోలు పిటిసి ప్రిన్సిపాల్‌గా 670 మంది పోలీస్‌ ట్రైనీలకు అత్యుత్తమ బోధనా,మౌలిక సదుపాయాలు అందించి సుశిక్షిత సిబ్బందిగా తీర్చిదిద్దారు. ఎన్నో అధునాతన సాంకేతిక శిక్షణా అభ్యసనాలను రూపొందించి సర్వీసులో ఉన్న సిబ్బంది, అధికారులకు బోధించారు. 2018 మే నెలో అనంతపురం రీజనల్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి, 170 కోట్ల ప్రభుత్వ ధనం అక్రమ మార్గాలు పట్టకుండా కాపాడారు. 

 


పేరు : వి. గిరిధర
హోదా : ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, ప్రస్తుత విధులు: ఎసిబి తిరుపతి

రివార్డ్స్‌ : క్యాష్‌ రివార్డ్స్‌ - 24 , కమెండేషన్స్‌ : 5 , ఏప్రిషియేషన్స్‌ : 1 , ఎంఎస్‌ ఈ : 3 , జిఎస్‌ ఈ : 14 , 2010 లో   రాష్ట్ర ప్రభుత్వ సేవాపతకం   ప్రకటించిన, పతకం : ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

బయోగ్రఫీ : 1995లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్‌ శాఖలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా సికె పల్లి పోలీస్‌ స్టేషన్‌, కడప జిల్లా బ్రహ్మం గారి మఠం పోలీస్‌ స్టేషన్స్‌ పరిధిలో తుపాకలు, నాటు బాంబులు స్వాధీన పరచుకోవడం తోపాటు ఫ్యాక్షన్‌ నేరాలకు ప్పాడే వారిని కఠినంగా అణచివేశారు. జూబ్లీ హిల్స్‌ బాంబ్‌ ఘటన, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే రమణ రెడ్డి హత్య ఘటన తదనంతరం గ్రామాలో ఎటువంటి అలజడులు పెక్కుచ్చర్లికుండా సమర్తవంతంగా అదుపుచేశారు. ఎసిబి ఇన్‌స్పెక్టర్‌గా 57 అవినీతి కేసులు, 6 డిఏ కేసులు, 29 ఆకస్మిక తనిఖీలు చేపట్టడమే కాకుండా ఎన్నో కేసులో అక్రమార్కులకు శిక్షలు పడేట్టు చేసారు.


పేరు : పాపర్తి శరత్‌బాబు
హోదా : ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, ప్రస్తుత విధులు : సిఐడి రీజనల్‌ ఆఫీస్‌, విజయవాడ

రివార్డ్స్‌ : క్యాష్‌ రివార్డ్స్‌  2, జిఎస్‌ఇ  22, కమెండేషన్స్‌  3,  2016లో రాష్ట్ర ప్రభుత్వ సేవాపతకం, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉత్కష్ట పతకం, ప్రకటించిన పతకం : ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

బయోగ్రఫీ :  1996లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్‌ శాఖలో పదవీబాధ్యతలు చేపట్టారు. కృష్ణాజిల్లా పెడన ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచనం సృష్టించిన హైవే రాబరీ గ్యాంగ్‌ను అత్యంత సాహసభరితంగా అరెస్ట్‌ చేసి ఉన్నతాధికారుల మన్ననను అందుకున్నారు. 2010లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి అందుకున్నారు. డిప్యుటేషన్‌పై సిఐడి విభాగంలో అగ్రిగోల్డ్‌, ఎన్‌మార్ట్‌, మల్టీలెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థలు మరెన్నో ఆర్థిక సంబంధ కేసు దర్యాప్తులో ప్రశంసాపూర్వక విధు నిర్వర్తించారు. వీరి ఉద్యోగ జీవితంలో ఎన్నో కీలక కేసులను పరిష్కరించి, ఎందరో కరడుగట్టిన నేరస్థులను అరెస్ట్‌ చేసి వారికి కఠిన శిక్షలు పడేలా చేసారు.  



పేరు : బి. సోమయ్య
హోదా : అసాల్ట్‌ కమాండర్‌, ప్రస్తుత విధులు : గ్రేహోండ్స్‌

రివార్డ్స్‌ : క్యాష్‌ రివార్డ్స్‌  15, ఇతర గుర్తింపు : 18, కమెండేషన్స్‌ : 14, 2005లో రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం, ప్రకటించిన పతకం : ఇండియన్‌ పోలీస్‌మెడల్‌

బయోగ్రఫీ : 1999లో రిజర్క్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్‌ శాఖలో ఉద్యోగబాధ్యతలు స్వీకరించారు. గ్రేహోండ్స్‌ విభాగంలో చేరి ఎంతో విశిష్ట సేవలు అందించారు. అనేక మావోయిస్ట్‌ ఎదురు కాల్పుల ఘటనలోను, మావోయిస్ట్‌లు లొంగుబాటు, ఆయుధాల స్వాధీనం వంటి ముఖ్య ఘటనలో ప్రధాన బాధ్యత వహించారు. అసాల్ట్‌ కమాండర్‌గా పదోన్నతి స్వీకరించిన అనంతరం ఏవోబి ప్రాంతంలో మావోయిస్ట్‌ కార్యకలాపాలు కట్టడికి ఎంతో సమర్థవంతంగా వ్యూహాలు రచించి ప్రణాళికాబద్దంగా అమలుపరిచి, ఏజెన్సీ ప్రాంత ప్రశాంతతకు దోహదం చేశారు.



పేరు : జె. నరసింహ మూర్తి
హోదా : ఏఆర్‌ఎస్‌ఐ, ప్రస్తుత విధు : 3వ ఏపిఎస్‌పి బెటాలియన్‌ కాకినాడ

రివార్డ్స్‌ : క్యాష్‌ రివార్డ్స్‌  16, జిఎస్‌ఇ  113, ప్రకటించిన పతకం : ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

బయోగ్రఫీ : వీరు 1979లో ఏపిఎస్‌పి కానిస్టేబుల్‌గా కాకినాడ 3  బెటాలియన్‌ నందు ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 2004లో హెడ్‌కానిస్టేబుల్‌గాను, 2019లో ఏఆర్‌ఎస్‌ఐగా పదోన్నతలు అందుకున్నారు. డ్రైవింగ్‌లో వీరికి ఉన్న అధ్బుత నైపుణ్యంతో మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలోకి పోలీస్‌ బలగాను క్షేమంగా చేరవేయడంలో, తిరిగి వారిని క్షేమంగా యూనిట్‌కు చేరవేయడంలోను ప్రధాన పాత్ర వహించారు. అదే విధంగా విఐపి ఎస్కార్ట్స్‌, ఎన్నికల విధులలోను ప్రతిభకనబరిచారు. తుఫాన్‌లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులో బాధితులను రక్షించడంలో సాహసోపేత సేవలు అందించారు.

 

పేరు : వి. విశ్వనాథ నాయుడు
హోదా : సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ప్రస్తుత విధు : స్పెషల్‌ బ్రాంచ్‌, చిత్తూరు

రివార్డ్స్‌ : క్యాష్‌ రివార్డ్స్‌ - 22, జి ఎస్‌ ఈ - 60,  ఏప్రియేషన్‌ : 2,  ప్రకటించిన పతకం : ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

బయోగ్రఫీ : 1983 లో కానిస్టేబుల్‌గా పోలీస్‌ శాఖలో ప్రవేశం పొందారు.2004లో హెడ్‌ కానిస్టేబుల్‌గా, 2012 లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా, 2017లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతలు అందుకున్నారు. 1885 ఉప ఎన్నికల సందర్భంగా ముదివేడు పిఎస్‌ పరిధి తంబళ్ళ పల్లిలో నాటు తుపాకలు స్వాధీనం చేసుకోవడంలో ప్రధాన పాత్ర వహించారు. క్లూరు పిఎస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా చేస్తున్న సమయంలో పది నాటు తుపాకలు స్వాధీనపరుచుకున్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా పులిచెర్ల మండలం కావేటి వారి పల్లి పంచాయతీలో 540 టాయిలెట్స్‌ కట్టించి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల, ప్రజా ప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారు. 


పేరు : టి. శ్రీనివాసరావు
హోదా : అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ప్రస్తుత విధు : పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ అండ్‌
  స్టాండర్డైజేషన్‌, టెక్‌టవర్‌, రివార్డ్స్‌ : క్యాష్‌ రివార్డ్స్‌ - 4 జిఎస్‌ ఈ - 18 ఏప్రిషియేషన్‌ - 1, 2010 రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం, 2017 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవా పతకం, ప్రకటించిన పతకం : ఇండియన్‌ పోలీస్‌ పతకం

బయోగ్రఫీ : 1983లో కానిస్టేబుల్‌గా పోలీస్‌ శాఖలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 2010లో హెడ్‌ కానిస్టేబుల్‌గా, 2013లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతులు  అందుకున్నారు.సుదీర్ఘ కాలం స్టేషన్‌ రైటర్‌గా, ఇన్‌స్పెక్టర్‌ రైటర్‌గా స్టేషన్‌, కార్యాయం రికార్డ్స్‌ నిర్వహించడంలోనూ మరియు దర్యాపులో అధికారులకు సహరించడంలోనూ కీలక పాత్ర నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్ర వరం అర్బన్‌ ఐటి కోర్‌ టీమ్‌ నందు ప్రతిభావంతంగా సేవందించడమే కాకుండా సిబ్బందికి, ట్రైనీలకు సాంకేతికాంశాలో శిక్షణ అందించారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర పోలీస్‌ కంప్యూటర్స్‌ అండ్‌ స్టాండర్డైజేషన్‌ విభాగమునందు విశిష్ట సేవలు అందిస్తున్నారు.


 పేరు : బి. జయరాముడు
హోదా : సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ప్రస్తుత విధులు: స్పెషల్‌ బ్రాంచ్‌, కడప

రివార్డ్స్‌ : క్యాష్‌ రివార్డ్స్‌ - 20 , జి ఎస్‌ ఈ : 70 , ఏప్రియేషన్‌ - 6, ప్రకటించిన పతకం : ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

బయోగ్రఫీ : 1983లో కానిస్టేబుల్‌గా పోలీస్‌ శాఖలో అడుగుపెట్టారు. 2010లో హెడ్‌ కానిస్టేబుల్‌గా, 2013లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా, 2018లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతులు పొందారు. కానిస్టేబుల్‌గా పొద్దుటూరులో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు భారీ స్థాయిలో నాటుబాంఋ పట్టుకున్న ఘటనలో, హెడ్‌ కానిస్టేబుల్‌గా పెండ్లిమర్రి పిఎస్‌లో చేస్తున్నప్పుడు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్న ఘటనలో కీలకంగా వ్యవహరించారు. అదే విధంగా మరెన్నో కేసులో కరడుగట్టిన  నేరస్తులను అరెస్ట్‌ చేసి, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సైగా జిల్లా కార్యాలయంనందు ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


పేరు : సిహెచ్‌ వి వీరాంజనేయులు,
హోదా : అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ప్రస్తుత విధులు: ఎస్‌ఐబి, ఇంటలిజెన్స్‌, విజయవాడ, రివార్డ్స్‌: క్యాష్‌ రివార్డ్స్‌ - 8 , జిఎస్‌ ఈ
   / ఎం ఎస్‌ ఈ - 16, 2013  రాష్ట్ర పోలీస్‌ కఠిన సేవాపతకం, ప్రకటించిన పతకం : ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

బయోగ్రఫీ : 1983లో కానిస్టేబుల్‌గా పోలీస్‌ శాఖలో అడుగుపెట్టారు. 2010లో హెడ్‌ కానిస్టేబుల్‌గాను, 2016లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గాను పదోన్నతులు అందుకున్నారు. కానిస్టేబుల్‌గా ఖమ్మం జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలో సుదీర్ఘ కాలం సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. అనేక మంది మావోయిస్టులు అరెస్ట్‌ కావడానికి, లొంగిపోవడానికి మరియు పేలుడు పదార్థాలు, ఆయుధాలు వశపరచుకోబడడానికి కీలక సహాయ సహకారాలు అందించారు. అనంతరం ఖమ్మం, గుంటూరు రేంజ్‌ ఇంటలిజెన్స్‌ విభాగములో అత్యంత ప్రతిభావంతంగా సేవంలన్దించి ఉన్నతాధికారు మన్నలను పొందారు. 2009 నుండి ఎస్‌ ఐబి విభాగంలో విధులు నిర్వర్తిస్తూ ఎంతో విలువైన సమాచార సేకరణ, నివేదిక అందజేత ద్వారా సేవలు అందిస్తున్నారు. 


పేరు : జి. అరుణ్‌ ప్రసాద్‌
హోదా : అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ప్రస్తుత విధులు: నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌, గుంటూరు అర్బన్‌, రివార్డ్స్‌ : క్యాష్‌ రివార్డ్స్‌-11, జిఎస్‌ఈ: 6, ఎం ఎస్‌ఈ:6,, ప్రకటించిన పతకం : ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

బయోగ్రఫీ : పశ్చిమ గోదావరి జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన తండ్రి నాగేశ్వర రావు స్ఫూర్తితో 1989లో కానిస్టేబుల్‌గా పోలీస్‌ శాఖలో అడుగుపెట్టారు. 2012లో హెడ్‌ కానిస్టేబుల్‌గా, 2018లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతులు అందుకున్నారు. 1989లో అమరావతిలో విధు నిర్వర్తిస్తున్నప్పుడు అమరలింగేశ్వర ఆలయం వద్ద బిచ్చగాడిని ఎవరో కత్తితో పొడవగా తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఘటన జరిగింది. సహాయానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అతనిని భుజాలపైన వేసుకొని హాస్పిటల్‌కు చేర్చి ప్రాణాలు నిబెట్టారు. అదే విధంగా 2006లో కూడా ఇరువర్గాల కొట్లాటలలో తీవ్ర రక్త గాయాలు అయిన వ్యక్తిని రక్షించారు. ఇటువంటి మరెన్నో అంకితభావం విధులతో అటు అధికారుల చేత, ఇటు ప్రజల చేత మన్ననలు అందుకున్నారు.

వార్తావాహిని