యూనిట్
Flash News
ప్రతిభావంతులకు సత్కారం
విజయవాడ ఆర్టీసీ భవన్‌లో
ఎబిసిడి అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. రాష్ట్రంలోని నేర పరిశోధనలో అత్యుత్తమమైన
వాటిని ఎంపిక చేసి అందులో మూడింటిని ఎబిసిడి కింద (అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైయిమ్
డిటెక్షన్) ఎంపిక చేయడం జరిగింది.
మొటి బహుమతి: తూర్పుగోదావరి జిల్లా రాజోల్ సర్కిల్ సిఐ
క్రిష్టోఫర్, ఎస్.ఐ.
విజయబాబు బృందం మొదటి బహుమతి కింద ఎంపికైంది. హెచ్‌సి బొక్కా శ్రీనివాస్
తదితరులను డిజిపి
శ్రీ యన్.సాంబశివరావు, మాజీ డిజిపి శ్రీ కోడె దుర్గాప్రసాద్‌లు మెమొంటోలతో
సత్కరించారు. సలాది లక్ష్మినారాయణ అనే నిందితుడు ఏకంగా ఐదుమంది మహిళలను
హత్యచేశాడు. సంబరాలకు వచ్చే మహిళలను టార్గెట్ చేసుకుని.. అందరినీ ఒకే ప్రదేశంలో
హత్యకు ప్లాన్ చేసుకుని, అమాయక
మహిళలను అంతమొందించాడు.
రెండవ బహుమతి: చిత్తూరుకు చెందిన సి.ఐ. సి.హనుమంతునాయక్
బృందం రెండవ ఎబిసిడి అవార్డుకు ఎంపికైంది. ఎటిఎంలను టార్గెట్ చేసుకుని అక్కడి
వచ్చే వారిపై 3 హత్యలు, 2 హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. అతన్ని చాకచక్యంతో
పట్టుకుంది.
మూడవ బహుమతి: విజయవాడ నగరంలో ఓ విద్యార్థిని ఆటోలో
ప్రయాణించే ఆకతాయిలు వేధించారని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్
లేఖలో పేర్కొంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన డిఎస్‌పి శ్రావణి బృందం. అసలు
నిందితులను అరెస్టు చేసి, శభాష్
అనిపించారు.