యూనిట్
Flash News
కాబోయే భార్యే హంతకురాలు...
ఏబీసీడీ మూడవ బహుమతి -
ఆగస్టు - 2019
కడప జిల్లా
రైల్వేకోడూరు పట్టణం రంగనాయకుపేటకు చెందిన అబ్దుల్‌ఖాదర్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్
కంపెనీలో ఇంజనీరుగా పనిచేసేవాడు. జూన్ 23న ఖాదర్‌కు అత్తకూతురితో
వివాహం జరగాల్సి ఉంది. రంజాన్ పండుగ కోసం జూన్ 5న సొంత
ఊరికి వచ్చేందుకు రైల్వేకోడూరులో బస్సు దిగి ఇంటికి వెళుతుండగా దారుణ హత్యకు
గురయ్యాడు. ఈ హత్య పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు పది రోజుల్లోనే ఈ
మిస్టరీని ఛేదించారు. పెండ్లికూతురిగా పెళ్లిపీటు ఎక్కాల్సిన యువతి తన ప్రియుడితో
కలిసి ఈ హత్యకు ప్పాడినట్లు పోలీసు ప్రాథమికంగా గుర్తించారు. సీఐ బాలయ్య, ఆయన సిబ్బంది సీసీ ఫుటేజీను పరిశీలించగా అబ్దుల్‌ఖాదర్‌ను హత్య చేసింది
తమిళనాడు ముఠా అని గుర్తించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడులో
ఉంటున్న ఖాదర్ మేనత్త కూతురు సబ్నకు ఖాదర్‌తో జూన్ 23న
వివాహం నిశ్చయించారు. కానీ సబ్న మాత్రం ప్రిన్స్ అనే యువకుడిని ప్రేమించడం,
ప్రియుడితోనే ఉండాలని, అత్త కొడుకు ఖాదర్‌ను
హతమార్చాలని ప్రణాళికు రచించారు. రంజాన్ పండుగ కావడంతో బెంగుళూరు నుంచి బస్సు
దిగి ఇంటికి వెళుతున్న ఖాదర్‌ను మాటు వేసి కిరాతకంగా నరికి చంపారు. అక్కడున్న సీసీ
ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి పది రోజుల్లోనే అరెస్టు చేసి రిమాండుకు
పంపారు. పది రోజుల్లోనే హత్య మిస్టరీ ఛేదించి నిందితును అరెస్టు చేయడంలో విజయం
సాధించిన కోడూరు పోలీసుకు రాష్ట్ర
డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ఎబిసిడి అవార్డుతో సత్కరించారు. ఈ కేసులో ప్రతిభ
కనబర్చిన అప్పటి రైల్వే కోడూరు, ప్రస్తుత చిత్తూరు జిల్లా
ఈస్ట్ సి.ఐ కె.బాయ్య, కోడూరు ఎస్సై పి.వెంకటేశ్వర్లు,
ఓబువారిపల్లి ఎస్సై ఆర్.మోహన్, కోడూరు
పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు ఓ.నరసింహు (పిసి 2637), వి.బ్రహ్మాండ
రెడ్డి (పిసి 2679), పి.అనిల్ కుమార్ (పిసి 848) అవార్డులను
అందుకున్నారు.