యూనిట్

సీసీ పుటేజీతో కేసు ఛేదన...

ఏబీసీడీ రెండవ  బహుమతి - ఆగస్టు - 2019

విజయనగరంలో సుమారు 13లక్షల విలువైన పేపరు లారీలో లోడ్‌ చేసుకుని బెంగళూరు గమ్యస్థానానికి చేరాల్సి వుంది. బెంగళూరుకు పేపర్‌ లోడ్‌ చేరకపోవడంతో పేపర్‌ యజమాని విజయవాడకు చెందిన వినయ్‌ ప్రతాప్‌సింగ్‌ విజయనగరం వన్‌ ట్‌న్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న తర్వాత సీసీఎస్‌ పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీఎస్‌ డీఎస్పీ జె. పాపారావు ఆధ్వర్యంలోని పోలీస్‌ బృందం దర్యాప్తును ముమ్మరం చేశారు. టోల్‌ ప్లాజాల వద్దగ సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లోడ్‌తో వెళ్లిన లారీని పశ్చిమబంగాలోని పనుసుకురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నారంద పసుపురా వద్ద పార్కింగ్‌లో వుండడాన్ని గుర్తించారు. సీసీఎస్‌ సిబ్బంది లారీ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా లారీ డ్రైవర్‌తో కలిసి పేపర్‌ను విక్రయించినట్లు తేలింది. ఎటువంటి ఆధారం లేని కేసును కేలవం టోల్‌ గేట్‌ సీసీ కెమెరా పుటేజీ అధారంగా ఛేదించిన నందుకుగాను సీసీఎస్‌ పోలీసును ఏబీసీడీ అవార్డుకు డీజీపీ గారు ఎంపిక చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాయంలో ఈ అవార్డును సీసీఎస్‌ డీఎస్పీ జె. పాపారావు, సీఐ పి. శోభన్‌ బాబు, ఎస్‌ఐ ఎస్‌. జియాద్దీన్‌, ఏఎస్‌ఐ ఆరి, హెచ్‌సీ డి. శంకరరావుకు డీజీపీ శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ గారు అందజేసి అభినందించారు.

వార్తావాహిని