యూనిట్
Flash News
‘ఎబిసిడి’లతో సత్కారం - ఆగస్టు - 2019
నేర పరిశోధనలో
అత్యుత్తమ పనితీరుకు ‘ఎబిసిడి’లతో సత్కారం - ఆగస్టు - 2019
రాష్ట్ర పోలీస్ శాఖలో
ప్రతి మూడు నెలకు ఒకసారి నేర పరిశోధనలో అత్యుత్తమ పనితీరు కనబర్చి క్లిష్టమైన
కేసులను ఛేదించే పోలీస్ దర్యాప్తు బృందాను ‘ఏబీసీడీ’ అవార్డులతో డీజీపీ గారు
సత్కరించడం ఆనవాయితీ. దీనిలో భాగంగానే రెండో త్రైమాసికంలో అత్యంత క్లిష్టమైన
కేసును ఛేదించిన దర్యాప్తు బృందాను డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ప్రశంసించారు. వారి
ప్రతిభకు గుర్తింపుగా ‘‘అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ)’’
పురస్కారాలను అందించారు. మంగళగిరిలోని ఏపీ పోలీసు ప్రధాన కార్యాయంలో జరిగిన
కార్యక్రమంలో వీటిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పోలీస్ కమీషనర్
సి.హెచ్. ద్వారకా తిరుమల రావు గారు, శాంతి భద్రతల విభాగం
డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్
అడిషనల్ డీజీపీ శ్రీ ఎన్. శ్రీధర్ రావు, బెటాలియన్స్
ఐజీపీ బి. శ్రీనివాసు, లీగల్ ఐజీపీ వెంకటేశ్వరరావు
పాల్గొన్నారు.
సైబర్ నేరగాళ్ళ
ఆటకట్టించిన విశాఖ సైబర్ పోలీసులు..
ఏబీసీడీ మొదటి బహుమతి
- ఆగస్టు - 2019
ముఖ్యమంత్రి, మాజీ
ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుగా నమ్మించి ప్రజాప్రతినిధుల, రాజకీయ
నాయకుల నుంచి నగదును దోచుకున్న ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన విశాఖ సైబర్
పోలీసు స్టేషన్ బృందం రాష్ట్రంలో ఏబీసీడీ (అవార్డు ఫ్రం బెస్ట్ క్రైం డిటెక్షన్)లో
మొదటిస్థానంలో నిలిచి అవార్డు సాధించింది. సైబర్ పోలీసుస్టేషన్ సి.ఐ. గోపినాథ్
ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి
నిందితులను పట్టుకున్నారు. నిందితులు
అంతర్జాతీయ వాట్సాప్ కాల్స్ ద్వారా మొబైల్స్‌కు దొరక్కుండా స్పూఫింగ్ కాల్స్‌తో
బాధితులను మోసగించారు. విశాఖతోపాటు హైదరాబాద్, ఇతర జిల్లాకు
చెందిన రాజకీయ నాయకులను ఈవిధంగా మోసం చేశారు. ఈ కేసును అత్యాధునిక సాంకేతిక
పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అదుపులోకి తీసుకోవటంలో సైబర్ పోలీసులు
విజయవంతమయ్యారు. అవార్డును రాష్ట్ర డీజీపి శ్రీ గౌతమ్ సవాంగ్ గారు మంగళగిరిలోని
పోలీస్ ప్రధాన కార్యాయంలో ప్రధానం చేశారు. అవార్డును సైబర్ క్రైం పోలీస్
స్టేషన్ సి.ఐ. గోపినాథ్, ఎస్.ఐ. ఎన్.రవికుమార్, కానిస్టేబుళ్లు బి.వి.సతీష్‌కుమార్ (పిసి 3559), పి.మురళీ (పిసి 3313), పి.
సూర్యచంద్రరావు (ఎఆర్‌పిసి 589), హెచ్.జి 557 బి.వి.రాంబాబులు
అందుకున్నారు.