యూనిట్
Flash News
నకీలీ పోలీస్ ఆగడాలు కట్టించిన కర్నూలు పోలీసులు
ఎబిసిడి అవార్డ్‌లలో
కన్సొలేషన్ బహుమతి - 2019
బూడిదపాడు జయరాజు అనే
ఆటో డ్రైవర్ చెడు వ్యసనాలకు బానిస అయ్యి, సెల్‌ఫోన్ దొంగతనాలు
వంటి చిన్న చిన్న నేరాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడి జైలుకు
వెళ్ళాడు. బెయిల్‌పై తిరిగి వచ్చిన తరువాత కర్నూలులో ఇల్లు కట్టుకోవాలని తలచి
ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుందని గ్రహించి మళ్ళీ నేరాల బాట పట్టడానికే
నిర్ణయించుకున్నాడు. ఈసారి తన డబ్బు సంపాదనకు నకీలీ పోలీస్ గా మరో తప్పుడు
మార్గాన్ని ఎంచుకున్నాడు. జాతీయ రహదారులలో ప్రయాణించే అమాయకులే లక్ష్యంగా తన
నేరాలు కొనసాగించాడు. ముందుగానే ఎంచుకున్న అమాయకులను బైక్‌పై వెంబడించి, అటకాయించి, తాను పోలీస్‌నని దగ్గరలో దొంగతనం
జరిగిందని వారిపై అనుమానం ఉందని వారి వద్డ వున్న పర్స్‌లు, ఇతర
సొత్తును తనిఖీ పేరుతో తీసుకొని ఉడాయించేవాడు.
కొందరు పోలీసులకు
ఫిర్యాదు చేయగా మరి కొందరు భయంతో ఫిర్యాదు చేయకుండానే వెళ్ళిపోయేవారు. కర్నూలు
జిల్లాతోపాటుగా జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా విరివిగా నేరాలు చేసాడు. నకిలీ
పోలీసు ఆగడాలు మితిమీరి పోతుండడంతో జిల్లా ఎస్పీ అతనిని పట్టుకోవడానికి ప్రత్యేక
బృందాలను ఏర్పాటు చేసారు. బాధితులు ఇచ్చిన ఆధారాల సహాయంతో జాతీయ రహదారిపై సిసి
టివి ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా నకిలీ పోలీసుగా ఆగడాలు చేస్తున్నది
పాత నేరస్థుడైన బూడిదపాడు జయరాజు అనే నిర్థారణకు వచ్చారు. చక్కని ప్రణాళికతో పథకం
ప్రకారం వలపన్ని నకిలీ పోలీసు జయరాజును పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
అతని వద్ద నుండి 3 తులాల
బంగారు నగలు, రూ. 6.25 లక్షల
నగదుతోపాటు బైక్‌ను స్వాధీనపరుచుకున్నారు. ప్రతిభావంతమైన దర్యాప్తుకుగాను ఏబిసిడి
అవార్డ్‌లలో కన్సొలేషన్ అవార్డ్ అందుకుంది. రాష్ట్ర డీజిపి గారి చేతుల మీదుగా
కర్నూలు తాలూకా సీఐ చలపతిరావు, ఎస్‌ఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుళ్ళు శివరంగయ్య, సులేమన్, కానిస్టేబుళ్ళు సుబ్బరాయుడు, ఎస్‌కే మహబూబ్ బాషాలు
అవార్డ్‌లు అందుకున్నారు.