యూనిట్
Flash News
రైలు నుండి గర్భిణీ తోసివేత, దోపిడీ కేసు పరిష్కారం
రైలు నుండి గర్భిణీ తోసివేత, దోపిడీ
కేసు పరిష్కారం
ఎబిసిడి అవార్డ్‌లలో
మూడో బహుమతి - 2019
గత సంవత్సరం డిసెంబర్ 18న కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయా ణిస్తున్న గర్భిణీని
కిందకు తోసివేసి, ఆపై ఆమె ఒంటిపై నగలు, నగదు గుర్తు తెలియని దుండగుడు దోచుకున్న ఘటన
తీవ్ర కలకలం సృష్టించింది. బెంగుళూరుకు చెందిన 7 నెలల గర్భిణీ రైలులో ప్రయాణిస్తుండగా,
రైలు ధర్మవరం మండలం బడన్నపల్లి గ్రామ సమీపంలోకి రాగానే దుండగుడు ఆమెను అకస్మాత్తుగా
రైలు నుండి తోసివేశాడు. ఆ వెనుకనే అతను కూడా దూకి ఆమె వద్దకు వచ్చి నగలు, నగదును తీసుకొని
పరారయ్యాడు. ఇదే తరహాలో మరో ముగ్గురిని కూడా రైలు నుండి తోసి వేసి సొమ్ము దోచుకుపోయాడు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైల్వే పోలీసులు అత్యంత పకడ్బందీగా దర్యాప్తు
సాగించి పది రోజుల్లోనే నిందితుడిని పట్టుకొని కటకటాలు వెనుకకు పంపించారు. తమిళనాడుకు
చెందిన వేలాయుధం రాజేంద్ర అనునతనిని ముద్దాయిగా గుర్తించి అదుపులోనికి తీసుకొని, అతని
వద్దనుండి రూ. 2.60 లక్షల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఈ నిందితుడిపై
11 కేసులు ఉండడం పోలీసులను విస్మయపరిచింది. ఏ ఆధారాలు లేని ఎంతో క్లిష్టమైన ఈ కేసును
అత్యంత ప్రతిభావంతంగా పరిష్కరించినందుకుగాను ప్రతిష్టాత్మక ఏబిసిడి అవార్డ్‌లలో మూడో
స్థానం పొందింది. ఈ ఘనతకు కారణమైన తిరుపతి జిఆర్‌పి డీఎస్పీ రమేష్‌బాబు, ధర్మవరం జీఆర్‌పి
సీఐ మోహన్ ప్రసాద్, గుత్తి ఆర్‌పిఎఫ్ సీఐ రవిశంకర్, డోన్ రైల్వే ఎస్‌ఐ హనుమంతయ్యలు
డీజిపి గారి చేతుల మీదుగా బహుమతులను స్వీకరించారు.