యూనిట్
Flash News
ఏటేటా పలకరించి మురిపించే పండుగ

మనమంతా కూడా జనవరి 1వ తేదీని సంవత్సర
ఆరంభంగానే భావించి పెద్ద ఎత్తున పండుగలా జరుపుకుంటున్నాం కదా!
ప్రపంచం యావత్తూ
కూడా జనవరి 1ని నూతన సంవత్సరాదిగానే బేషరతుగా ఒప్పుకుంది
మరి! అసలీ సంవత్సరాలని లెక్కించడం, జనవరి 1వ తేదీ సంవత్సరపు తొలి మజిలీగా తీసుకోవడం ఎలా
వచ్చింది? దీనికి చాలా కథా
కమామిషూ ఉందండోయ్! దానిని గురించి ఇప్పుడే ముచ్చటించు కొందాం.
ప్రతి మనిషీ
సంఘజీవి కదా! వీaఅ ఱర a రశీషఱaశ్రీ aఅఱఎaశ్రీ. తాను
నిర్మించుకున్న సమాజ చలనానికీ, పైగా తన మతపర, ఆధ్యాత్మిక, ధార్మిక, వైయక్తిక ఆలోచనలకి, జరుగుబాటుకి ఓ
రూపు నివ్వటానికీ, దైనందిన జీవన మనుగడకీ అతనికి ''కొల గణనము''
- అంటే
కాలాన్ని లెక్కించడం తప్పనిసరి అయ్యింది. ప్రతి నేలలోనూ, ప్రతి సంస్క
ృతిలోనూ ఈ 'కాలగణన' అంతర్లీనమై, అవిభాజ్యమై పోయింది. ఈ శోభాయమానమైన ప్రపంచమంతా
విభిన్న సంస్క ృతుల, మతాల, అభిప్రాయాల 'కొమ్మెరుంగుల' కలబోత కాబట్టి
కాలగణనలో మార్పులు తప్పలేదు.
చరిత్ర పుటల్ని
తీరిగ్గా తిరగేస్తే కాలాన్ని లెక్కించడం క్రీ.పూ. 6000 ఏళ్ళకి పూర్వమే
మొదలైనట్లు దాఖలా ఉంది. మొదట చంద్రుడి గమనాన్ని బట్టీ, తర్వాత సూర్య
చలనాన్ని బట్టి కాలగణన చెయ్యడం - రెండు పద్ధతులుగా - అలవాటయ్యింది. భారతదేశంలో చాంద్రమానం
ప్రకారం కాలగణన చేయడం సంప్రదాయమైంది. గ్రీసులోనూ, ఈజిప్టులోనూ సూర్య
గమనాన్ని బట్టే కాలగణన చేసేవారు. నిజానికి వీటన్నింటికంటే అతి ప్రాచీనమైన మన వైదిక
యుగాన్ని గమనిస్తే ఋగ్వేదంలో ఈ కాలగణన ప్రసక్తి ప్రస్ఫుటంగా ఉంది. మన వైదిక ఋషులు
అత్యంత రమణీయంగా కవిత్వ పోకడలతో ఆకాశంలో 12 ఆకుల చక్రం
తిరుగుతోందనీ, 720 మంది పిల్లల జంటలున్నారనీ కాలాన్ని వర్ణంచారు.
అంటే మరేం లేదు. 12 ఆకుల చక్రం అంటే 12 నక్షత్రాల రాశుల
చక్రం అన్నమాట. 720 పిల్లల జంటలంటే 360 పగళ్ళూ,
360 రాత్రులన్న
మాట. దీన్నిబట్టి మన వైదిక ఋషులు ఏడాదికి 360 రోజులని ఏనాడో
చెప్పినట్టు ఋజువవుతోంది.
బాబిలోనియాలో 4000 ఏళ్ళ క్రిందటే
సంవత్సరాది చేసుకున్నారట. వాళ్ళు ఈ పండుగని ''అకిటు'' అనే పండగతో కలిపి
చేసుకొనేవారు. సుమేరియన్ భాషలో ''అకిటు'' అంటే బార్లీ
గింజలు. వాళ్ళు బార్లీని మార్చి - ఏప్రిల్‌ల మధ్య వచ్చే ూజూతీఱఅస్త్ర లో కోస్తారు.
వాళ్ళ మత విశ్వాసం ప్రకారం వాళ్ళ ఆకాశ దేవుడు 'మార్డక్' దుర్మార్గురాలైన సముద్ర దేవత 'టియామాట్' పై విజయం సాధించిన
సందర్భంగా సంవత్సరపు తొలిరోజుగా భావించారు. ఆరోజే వారి నూతన చక్రవర్తిని సింహాసనం
మీద అధిష్టింపజేస్తారు.
ఈ గణాంకాల మధ్య, క్యాలెండర్ల మధ్యా
సమన్వయంలోపించి, అంతా అవకతవకగా పరిణమిస్తున్న సందర్భంలో జులియస్
సీజర్ అనే రోమను చక్రవర్తి, అనేక గణిత, ఖగోళ శాస్త్రజ్ఞుల సూచన మేరకు సూర్యగమనాన్ని
అనుసరించి క్రీ.పూ. 46 సం||లో 365 రోజులు సంవత్సరాని
కుండేటట్లూ, జనవరి 1వ తేదీ సంవత్సరాది అయ్యేటట్లూ ''జూలియస్
క్యాలెండర్'' ప్రారంభించాడు. రోమన్ దేవుడు జీaఅబర రెండు
ముఖాలున్నవాడు. ఒక ముఖం జరిగిపోయిన గతాన్నీ, రెండో ముఖం రాబోయే భవిష్యత్తునీ సూచిస్తాయి.
ఆజేనస్ దేవుణ్ణి పూజించి, గౌరవించే నిమిత్తం జూలియస్ సీజరు చక్రవర్తి
మొదటి నెలని ఁజీaఅబaతీవఁ అన్నాడు. ఆరోజు రోమన్లు జేనస్ దేవతకి
ముడుపులు చెల్లించి, బాగా ఇళ్ళని అలంకరించుకొని, ఒకరికొకరు
బహుమతులిచ్చి పుచ్చుకొని సంరంభంగా, పార్టీలు ఇచ్చుకొనే వారు. తర్వాతి కాలంలో
కొద్దిమంది క్రైస్తవ నాయకులు జనవరి 1ని తీసేసి డిసెంబర్ 25ని సంవత్సరాదిగా
ప్రకటించారు. కానీ క్రీ.శ. 1582లో క్రైస్తవ
మతాచార్యుడు పోప్ గ్రేగరీ 13, జనవరి 1నే మళ్ళీ
సంవత్సరాదిని చేసి, అప్పటి క్యాలెండర్లలో మార్పులూ, చేర్పులూ చేసి ''గ్రెగోరియన్
క్యాలెండర్'' (+తీవస్త్రశీతీఱaఅ జaశ్రీవఅసవతీ) ని
రూపొందించాడు. ముఖ్యంగా నాలుగు సంవత్సరాలకి ఒకసారి ఒక పూర్తి రోజుని ''ఫిబ్రవరి'' నెలకి కలిపి ''లీప్'' సంవత్సరాన్ని
ఏర్పాటు చేశాడు. ఈనాడు ప్రపంచంలోని యావన్మంది ప్రజలూ అనుసరింస్తున్నది ఈ
గ్రెగోరియన్ క్యాలెండర్‌నే.
ఈ క్యాలెండర్
లోని 12 నెలల పేర్లూ
గ్రీకు, రోమను మత
విశ్వాసాల ప్రాతిపతికగా ఏర్పడ్డాయి. ఇందాక జీaఅబర దేవుడి పేరిట 'జనవరి' ఏర్పడినట్లు
చూశాం. ''ఫిబ్రువా'' అనే సంప్రదాయం
పేరిట 'ఫిబ్రవరి' ఏర్పడింది. గ్రీకు
యుద్ధ దేవత 'మార్స్' (వీaతీర - వీవతీషవసశీఅఱబర) పేరిట 'మార్చ్' నెల వచ్చింది.
ఃూజూష్ట్రతీశీసఱ్‌వః అనే శృంగార దేవత పేరిట 'ఏప్రిల్' వచ్చింది.
ఇటలీలోని వసంత ఋతువు దేవత 'మెయ్యా' పేరిట 'మే' వచ్చింది. మన సంస్క ృతిలోని ''వసంతుడి''లా అన్నమాట
ఈమెయ్య. రోమన్ల వివాహానికీ, స్త్రీ సౌభాగ్యానికీ అధి దేవత 'జూనో'. ఆవిడ పేరిట 'జూన్' వచ్చింది.
(చూడండి! గ్రీకు, రోమన్ల సంస్క ృతికీ, మన సంస్క ృతికీ
ఎన్ని పోలికలో! మనవాళ్ళు పెళ్ళికీ, సౌభాగానికీ అధి దేవతగా ''గౌరీదేవి''ని చెబుతారు.
అందుకే పెళ్ళిళ్ళప్పుడు పెళ్ళికూతురు సౌభాగ్యం వర్ధిల్లాలనీ పెళ్ళి కూతురిచేత ''గౌరీపూజ'', పెళ్ళయిన ఆడపిల్లల
చేత ఐదేళ్ళపాటు శ్రావణ 'మంగళ గౌరీ వ్రతం' చేయిస్తారు.
శిశుపాలుడితో ఇష్టంలేని పెళ్ళి చేసుకోలేక రుక్మిణీదేవి పెళ్ళి కూతురిగా 'గౌరీపూజ' చేసుకోవడానికి
వెళ్ళి ''కృష్ణ!
పురుషోత్తమ! నన్ను చేకొనిపొమ్ము వచ్చెదన్'' అని అగ్ని
ద్యోతనుడు అనే విప్రుడిచేత కృష్ణుడికి లేఖ పంపించి కృష్ణుడితో వెళ్ళిపోతుంది.
రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ పేరిట 'జూలై', ఆయన కొడుకు 'అగష్టన్ సీజర్' చక్రవర్తి పేరిట 'ఆగష్టు' వచ్చాయి. అంతకు
ముందు పంచాంగంలో ఏర్చి కూర్చిన ఏడో నెల నుంచే పదో నెలవరకూ వాటి సంఖ్యను బట్టీ ఆయా
పేర్లు వచ్చాయి. సెప్టెంబర్, (గ్రీకులో నవజ్ూa అంటే ఏడు. ఇది మన 'సప్త' నుంచే వచ్చింది.
భాషలో 'స,హ' గా మారడం సహజమే), అక్టోబర్, (గ్రీకులో a అంటే ఎనిమది. ఇది
మన 'అష్ట' నుంచి వచ్చింది), నవంబర్, (గ్రీకులో చీశీఅa అంటే తొమ్మిది.
ఇది మన 'నవ' నుంచి వచ్చింది), డిసెంబర్,
(గ్రీకులో ణవషa అంటే పది. ఇది మన 'దశ' నుంచి వచ్చింది).
దాదాపు అన్ని
దేశాలలో నూతన సంవత్సరపు వేడుకలు డిసెంబర్ 31వ తేదీన
మొదలవుతాయి. ఉరకలేసే ఉత్సాహంతో, ఆనందాతిరేకంతో పెద్దా, చిన్నా తారతమ్యాలు
లేక ఈ సంవత్సరాదిని జరుపుకుంటారు. పాశ్చాత్యులు ఈ విందులూ, ఆర్భాటాలూ రాబోయే
సంవత్సరం - జనవరి ఒకటి నుంచే - శుభాన్ని కలుగచేస్తాయని నమ్ముతారు. స్పెయిన్, స్పానిస్ భాష
మాట్లాదే దేశాలలో 12 ద్రాక్షపళ్ళని
దాస్తారు. ఇవి రాబోయే 12 నెలలలో వారి
కోర్కెలనీ, ఆశలనీ తీరుస్తాయని వారి నమ్మకం. చాలా దేశాల్లో
తినే వంటకాలలో ఃకూవస్త్రబఎవరః ని వాడతారట. ఇవి జశీఱఅర -
నాణాల, ఆకారంలో ఉండి
రాబోతున్న సంవత్సరంలో ఆర్ధిక లాభాన్ని చేకూరుస్తుందని వారి నమ్మకం. క్యూబా, ఆస్ట్రియా, హంగేరీ, పోర్చుగల్ లలో
పందులు అభివృద్ధినీ, భాగ్యాన్నీ సూచిస్తాయని (పందిమాసం) తప్పక తింటారట. నెదర్లాండ్స్‌లో
ఉంగరంలాగా గుండ్రంగా కేక్స్, పేస్ట్రీస్ చేస్తారు. గుండ్రంగా ఉండటం ఒక
సంవత్సరం ఒక పరిభ్రమణ గుండ్రంగా చేస్తోందని అర్ధం. స్వీడన్, నార్వేలలో
బాదంపప్పులని దాచిన పుడ్డింగ్‌లని పెడతారు. ఎవరైతే ఆ దాచిన బాదం పప్పుని
చేజిక్కించుకుంటారో వారికి 12 నెలల పాటు శుభమే
కలుగుతుందని వారి నమ్మకం.
యువత సంవత్సరాది
నాడు టపాకాయాలు పేల్చడం, పాటలు పాడటం, నృత్యాలు చేయడం, గేమ్స్ ఆడటం, వంటివి పరిపాటి.
అలాగే నూతన సంవత్సరారంభంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యసనపరులైతే సిగరెట్టూ, మందూ, జూదం, పేకాట, బెట్టింగు, గుర్రపు పందేల
జోలికెళ్ళమని ఘాట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ సంవత్సరం తిరిగి డిసెంబరు 31 నాటికి కాలుతున్న
సిగరెట్టులతో, మందు గ్లాసులతో, పేకాట జోరులో, రేసు గుర్రాల
హుషారులో వీరు కనబడటం - షరా మామూలే. మరి కొద్దిమంది మొబైల్ ఫోనూ, వాట్సాప్, యూట్యూబ్, వాడకాన్ని
తగ్గించు కుంటామంటారు. మరికొంతమంది భోజనప్రియులు లావు తగ్గటానికి జతీaరష్ట్ర - సఱవ్‌ఱఅస్త్ర
మొదలుపెట్టాలనుకుంటారు. మరి కొద్దిమంది బద్ధకస్తులు నడక, పరుగు, వ్యాయామం, యోగా వంటివి
గంటైనా చేసి తీరతామని తీర్మానించుకుంటారు. ఈ తీర్మానాలన్నీ మఖలో పుట్టి, పుబ్బలో
మాడిపోతాయి.
ఏ నిర్ణయానికైనా, తీర్మానికైనా
మనోబలం చాలా ముఖ్యం. మన పోలీసు సోదరులు మనోదార్డ్యంతో, మనోవికాసంతో
నిర్ణయాలు తీసుకొని, వాటిని అమలు చేయడంలో అంతే శ్రద్ధా, అంకితభావం
చూపిస్తారనీ, పోలీసు సోదరులకీ వారి కుటంబాలకీ నూతన సంవత్సరం
సకల శుభాలనీ, సంతోషాలనీ చేకూర్చాలనీ, నిండుమనసుతో
కోరుకుంటూ అందరికీ హార్దిక శుభాభినందనలు తెలుపుతూ భగవంతుడి ఆశీస్సులు మీ అందరి
కుటుంబాల మీదా పూలజల్లులా కురవాలని కోరుకుంటున్నాను.
దేశమనెడు పూదోటలో
బూసెపూలు
తేనెధారలు గట్టి
పూదీవెకొనల
కొమ్మ కొమ్మును
కోకిలల్ కూయదొడగె
చిలిపి తగువింక
మనకేల తెలుగుబిడ్డ ... (నార్ల చిరంజీవి - 'తెలుగుపూలు')