యూనిట్
Flash News
మానవత్వాన్ని చాటుకున్న మైదికురు సి ఐ
కడప జిల్లా మైదుకూరు
రోడ్లపై మానసిక పరిస్థితి సరిగాలేక అస్తవ్యస్తంగా తిరుగాడుతున్న వ్యక్తిని అందరూ
చూస్తున్నారేగాని ఎవరూ పట్టించుకోవడం లేదు. మానవత్వంతో కొందరు ఆహారం పెట్టినా, అతను
విసిరిపారేస్తున్నాడేగాని తినాలన్న ధ్యాసే తెలియడం లేదు. ఇది గమనించిన గాలితొట్టి వెంకటేశ్వర్లు
అన్న పాత్రికేయుడు తన సోషల్ మీడియా గ్రూప్‌లో ఆ వ్యక్తి దీనావస్థ గూర్చి
సభ్యులందరికీ తెలియపర్చాడు. మైదుకూరు రూరల్ సి.ఐ వై. వెంకటేశ్వర్లు ఈ విషయమై
తక్షణం స్పందించి, ఆ మానసిక రోగి వద్దకు వెళ్ళి, తన సిబ్బంది సహాయంతో అతనిని హాస్పిటల్‌కు తరలించి, అక్కడ
జాయిన్ చేయించారు. తమ స్టేషన్ కానిస్టేబుల్స్ సుబ్బయ్య, కిశోర్‌లను
ఆ వ్యక్తి సంరక్షణ నిమిత్తం ప్రత్యేకంగా నియమించారు. వారు ఆ వ్యక్తిని పసిబిడ్డలా
సాకుతూ అన్నపానాదులను ఇతర సదుపాయాలను క్రమం తప్పకుండా అందించారు. ఎప్పటికప్పుడు
సి.ఐ వెంకటేశ్వర్లు హాస్పిటల్ సందర్శిస్తూ, అతనికి
అందుతున్న వైద్య, సంరక్షణ సహాయాన్ని దగ్గరుండి
పర్యవేక్షించారు. హాస్పిటల్‌లో వివిధ కారణాల వలన చికిత్స పొందుతున్న రోగులు,
వారి బంధువులు పోలీసుల సేవా తత్పరతను ప్రత్యక్షంగా చూసి
ప్రశంసించారు. ఇంతలో పోలీస్, పాత్రికేయుల సమన్వయ చర్యల సహకారంతో
సదరు వ్యక్తి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా న్యూసత్రం బావి ప్రాంతానికి
చెందిన పందల రాజమోహన్‌గా తెలిసినది. అతను రైల్వేలో కీ మ్యాన్‌గా విధులు
నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల కొన్ని ఆధ్యాత్మిక భావాలు పట్ల తీవ్ర ఆసక్తి
కనబరుసున్నాడు. చాలా పరధ్యానంగా కూడా వుంటున్నాడు. 19.11.2017 వ తేదీ విధుల
నిమిత్తం ఇంటినుండి బయటకు వెళ్ళిన రాజమోహన్ - భోజనం క్యారియర్, బైక్ రైల్వే స్టేషన్ వద్దనే వదలివేసి,ఎటో
వెళ్ళిపోయాడు. ఆందోళన చెందిన అతని తండ్రి అన్ని చోట్ల వెదికినా ఫలితం లేక, వెంకటాచల సత్రం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. పోలీసుల ద్వారా
మైదుకూరు హాస్పిటల్‌లో రాజమోహన్ వున్నాడన్న విషయం తెలిసి కుటుంబసభ్యులు, స్నేహితులు అక్కడకు
వచ్చి అతనిని కలసి ఆనందపరవశులయ్యారు.
మైదుకూరు రూరల్ సి.ఐ
వెంకటేశ్వర్లు వారి సిబ్బంది సకాలంలో స్పందించి, హాస్పిటల్‌లో వుంచి
రెండు రోజులు సంరక్షించినందు వల్లే రాజమోహన్ తమకు దక్కాడని వారు కన్నీళ్ళపర్యంతమై
పోలీసులకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అదే విధంగా పాత్రికేయుడు వెంకటేశ్వర్లుని
కూడా అభినందించారు. చట్టాలను మీరిన వారిపట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు, ఆపదలో వున్న వారిపట్ల ఆదరణ, ఆప్యాయత చూపడంలో ముందుంటారని
మరోసారి నిరూపించారు.