యూనిట్
Flash News
కాల్వలో పడి కొట్టుకుపోతున్న మహిళను రక్షించిన ఆర్ఎస్ఐ
కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో బందరు కాలువకు సమీపంలో పోలీస్ నివాస సముదాయాలు ఉన్నాయి. విజయవాడ నగర ఒకటవ పట్టణ ట్రాఫిక్ పీఎస్ లో ఆర్ఎస్ఐగా విధు నిర్వర్తిస్తున్న డి. అర్జునరావు అక్కడే క్వార్టర్స్లో నివాసముంటున్నాడు. డిసెంబర్ 2న ఉదయం 8.30 గంట సమయంలో అర్జునరావు ఆరుబయట నిలుచున్నారు. బందరు కాలువలో వేగంగా ప్రవహిస్తున్న నీటి ఉధృతిలో ఒక మహిళ కొట్టుకుపోతున్న దృశ్యాన్ని ఆర్ఎస్ఐ గమనించారు.
వెంటనే స్పందించిన ఆయన ఒకక్షణం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాలువలోకి దూకారు. మునిగి, తేలుతూ కాలువలో కొట్టుకుపోతున్న ఆ మహిళను నేర్పుగా పట్టుకొని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు రక్షించాడు. షాక్కు గురై కొన ఊపిరితో ఉన్న మహిళకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. బాధితురాలు కృష్ణలంకకు చెందిన కూరగాయల వ్యాపారిగా గుర్తించారు.
కొద్దిరోజులుగా మానసిక స్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకోవడానికి కాలు వలోకి దూకినట్లు తేలింది. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కాలువలోకి దూకి రక్షించిన ఆర్ఎస్ఐని నగర పోలీస్ కమిషనర్ శ్రీ సిహెచ్డి తిరుమరావు, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
అనంతరం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు
ఆర్ఎస్ఐ అర్జునరావును పిలిపించి అభినందించారు. ఈ సందర్భంగా అర్జునరావుకు
ప్రధనమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్ కు సిఫారసు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి అధికారులను
ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్ డిజిపి కార్యాలయంలో
ఆర్ఎస్ఐని అభినందించారు.