యూనిట్
Flash News
పేగు బంధాన్ని కలిపిన ‘స్పందన’
పసిప్రాయంలో
తల్లిదండ్రుల చెంత గారాభంగా పెరగాల్సిన వయసులో తెలిసీ తెలియక చేసిన చిన్నచిన్న
తప్పులకు ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులను వదిలి పారిపోవడం, ఇంకా
అనేక అఘాయిత్యాలు చేసుకోవడం జరుగుతోంది. ఊహతెలిసిన తదనంతరం తల్లిదండ్రుల పేగు బంధాన్ని
తలచుకొని కుమిలిపోయే వారు ఎంతోమంది మనకు తరచూ కనబడుతూనే ఉంటారు. ఇలాంటి ఘటన విజయవాడ
పోలీస్ కమిషనర్ శ్రీ సి.హెచ్. ద్వారకా తిరుమరావుగారికి ఎదురైంది. ఆమె పేరు
ఆదిలక్ష్మి, ఇంకా పూర్తిగా పరిపక్వత చెందని వయస్సు, ఇద్దరు మగ పిల్లల నడుమ జన్మించడంతో అల్లారు ముద్దుగా, మరింత గారాభంగా పెరిగింది. సున్నితమైన మనసు గల ఆదిలక్ష్మి ఒక రోజు
బడికి వెళ్ళనందుకు తల్లి చెంచమ్మ మందలించింది. ఆదిలక్ష్మి ఎంతో బాధపడి ఇంటి నుండి
పారిపోయింది. విజయవాడ బస్టాండులో బిక్కుబిక్కుమని దిక్కు చూస్తున్న చిన్నారిని
ఒకామె దయతలచి అక్కును చేర్చుకుంది.
అక్కున చేర్చుకున్న
ఆ మహిళ చెన్నై నగరానికి తీసుకెళ్ళింది. అక్కడ ఆమె సన్నిహితురాలు పిల్లలు లేని
మధురిక, చిన్నారి ఆదిలక్ష్మిని చూసి ఎంతో సరదాపడి పెంచుకుంటానని
సదరు మహిళ నుంచి కొనుక్కుంది. తను సొంత కూతురిలా ఆదిలక్ష్మిని పెంచి పెద్దచేసింది.
ఆదిలక్ష్మిని పెంచి పెద్దచేసి వివాహము చేసింది. కొద్దికాలం తరువాత పెంచిన తల్లి
మధురిక వయసు మీదపడి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఆదిలక్ష్మికి కన్నవారిపై
మమకారం పెంచుకుంది. వెంటనే భర్తకు విషయం చెప్పింది. ఎలాగైనా తన పుట్టింటికి
తీసుకెళ్ళాని, తల్లిదండ్రులను చూడాని తన పేగు బంధాన్ని
భర్తకు చెప్పింది. వెంటనే ఇరువురు విజయవాడకు బయుదేరి వచ్చారు. ఆమె నివాసముంటున్న ఏరియాను
గుర్తుపట్టి చూడగా రోజు రోజుకు పెరిగి మహానగరంగా మారిన నగరం గుర్తుపట్టలేనంతగా
మారిపోయింది. వెంటనే ఇరువురు ఓ లాయర్ను సంప్రదించారు. లాయర్ సహా మేరకు ‘స్పందన’కార్యక్రమానికి వచ్చారు. అక్కడే ఫిర్యాదు
స్వీకరిస్తున్న జాయింట్ పోలీస్ కమిషనర్ డి. నాగేంద్రకుమార్ కు తన స్వీయ చరిత్రను
తెలిపింది. 2007 సంవత్సరంలో తను ఇంటి నుండి వెళ్ళిపోయానని చెప్పింది.
తనకు తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, చెంచమ్మ, అన్నా, తమ్ముళ్ళు ఉన్నారని కుటుంబ వివరాు ‘స్పందన’ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే విషయాన్ని నగర పోలీస్
కమిషనర్ శ్రీ సి.హెచ్. ద్వారకా తిరుమల రావుకు తెలిపారు. కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించి
యువతి ఆదిలక్ష్మి గురించి వివరాలను విస్తృతంగా ప్రచారం చేయించారు. ప్రసార మాధ్యమాల్లో
తన కూతురు వివరాలను తెలుసుకున్న తండ్రి క్ష్మినారాయణ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ సమయంలో
ఆనంధానికి అవధుల్లేవు. వెంటనే డిసెంబర్ 10న విజయవాడ పోలీస్
కమిషనర్ కార్యాలయానికి చేరుకుని తన వద్ద వున్న ఆధారాలను తెలియపర్చాడు. ఆదిలక్ష్మి
తన కూతురేనని నిర్ధారణకు వచ్చిన నగర పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించి
ఆదిలక్ష్మిని తల్లిదండ్రుకు అప్పగించాడు.
ఆదిలక్ష్మి తండ్రి
మంగళగిరి క్ష్మినారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పోలీస్స్టేషన్లో హోంగార్డుగా
పనిచేస్తుండేవాడు. ఒక్కగానొక్క కూతురు, అందులో గారాబంగా
పెంచుకుంటున్న కూతురు కనబడకపోవడంతో జీవితం ఆలకల్లోంగా అనిపించింది. కూతురు సమాచారం
తనకు తెలిసిన ప్రాంతాన్ని తిరిగి... వేసారి బిక్కమొఖం వేసుకుని ఇంటికి తిరిగి
వచ్చాడు. ఈ క్రమంలో ఉద్యోగం కూడా సరిగా చేయలేని పరిస్థితి, ఏదో
తెలియని కోపం, ఎవరిమీద చూపించాలో తెలియని వ్యధ, చివరకు ఉద్యోగం వీడి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో గాలించాడు. రెండు సంవత్సరాలైనా తన కుమార్తె
కనపడకపోయేసరికి ఆశలు వదుకుని హోంగార్డు ఉద్యోగాన్ని వదిలేసి చిన్నపాటి ఉద్యోగంలో
కాలం వెళ్ళదీస్తున్నాడు.
చివరకు పేగు బంధం
ఎంతైనా గొప్పదని, ఎవరూ విడదీయలేరని రుజువైంది.
తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ వందలాది కిలో మీటర్లు... సంవత్సరాలు గడిచినా మరచిపోని బంధం...
చివరకు కాలమే వారిని కలిపేలా చేసింది. కూతురుని చూసిన తల్లిదండ్రుల గుండెల్లో అర్ధ్రత నిండింది.
పేగు బంధం ఎంత బలమో ఈ ఘటన నిరూపించింది.
ఆదిలక్ష్మి తిరిగి
తన తండ్రిని కుసుకునేందుకు ఎంతో ప్రయాసు పడింది. భార్య వెనుక ఉండి ప్రోత్సహించిన
భర్త కాంచీవనంను, న్యాయవాది బాకృష్ణ ఇరువురిని నగర పోలీస్
కమిషనర్ శ్రీ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు అభినందించారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్పందన’కార్యక్రమం వల్ల ఎంతో మందికి ఉపయోగపడటమే కాక, పోలీసులను సామాన్యులు సైతం ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమాన్ని చిన్నారి నుంచి వయోవృద్ధుల వరకు అందరూ సద్వినియోగం చేసుకోవాని నగర ప్రజకు సూచించారు. ఏ సమస్యనైనా తక్షణమే పరిష్కరించే విధంగా పోలీసు కృషి చేస్తారని హామీ ఇచ్చారు.