యూనిట్
Flash News
మానవత్వాన్ని చాటిన డి.ఎస్.పి.
తిరుమల ట్రాఫిక్ డి.ఎస్.పి.గా విధులు
నిర్వర్తిస్తున్న మునిరామయ్య ప్రమాదం జరిగిన సమయంలో స్పందించి మానవత్వాన్ని
చాటుకున్నారు. తిరుమల మొదటి కనుమ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీ కొని
ఇద్దరు వ్యక్తుల కాళ్లు తెగిపడ్డాయి. ప్రమాద ఘటన తెలుసుకుని హుటాహుటీన బయల్దేరిన
మునిరామయ్య తెగిపడి రోడ్డుపై ఉన్న కాళ్లను చూశాడు. అప్పటికే ప్రమాదంలో గాయపడిన
కుమార్, మధులను
తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్‌కు అంబులెన్స్‌లో తరలించారు.
తెగిపడిన కాళ్లను రోడ్‌పై వదిలేసి
వెళ్ళడం వలన వాటిని తిరిగి సర్జరీ ద్వారా అతికించే అవకాశం జేజారవచ్చని భావించిన
మునిరామయ్య మరో అంబులెన్స్‌ను రప్పించి ఆ కాళ్లను స్విమ్స్ హాస్పిటల్‌కు
చేర్చారు. పరిస్థితిని గమనించిన స్విమ్స్ హిస్పిటల్ వైద్యులు కాళ్లను తిరిగి
అతికించే అవకాశం ఉందని సరైన సమయంలో స్పందించి కాళ్లను హాస్పిటల్‌కు తీసుకొచ్చిన
మునిరామయ్యను అభినందించారు. స్విమ్స్ హాస్పిటల్‌లో ఈ సర్జరీ నిర్వహించడానికి
సరయిన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల వైద్యులు వీరి ఇరువురిని మద్రాస్‌లోని సూపర్
స్పెషాలిటీ హాస్పిటల్‌కు పంపించారు. ఈ సర్జరీ విజయవంతం అయినట్లు, ప్రమాదంలో
గాయపడ్డ కుమార్, మధులు
కోలుకోవడానికి సంవత్సరం కాలం పడుతుందని వైద్యులు తెలిపినట్లుగా మునిరామయ్య
తెలిపారు.
సరయిన సమయంలో స్పందించి ఇద్దరు వ్యక్తుల
జీవితాలను కాపాడిన డిఎస్‌పి మునిరామయ్యగారు ఎందరికో ఆదర్శంగా నిలిచారనడంలో సందేహం
లేదు.
అవినీతి సి.ఐ. అరెస్టు
రోడ్డుపక్కన ప్లాట్‌పారంపై తోపుడు
బండిపై వ్యాపారం చేసుకుని బతికే పేదలను సైతం వదలక పట్టిపీడిస్తున్న పోలీస్ ఇన్స్‌పెక్టర్
ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. కాసుల కోసం కక్కుర్తిపడి, స్థాయిని
మరిచి పదివేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి
వెళితే...
నెల్లూరు (నార్త్) ట్రాఫిక్ సి.ఐ.గా
బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎన్.రామారావు సి.ఐ.గా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు
కూడా తిరక్కుండానే ఇంతకు మునుపు ఎస్.ఐ.గా పనిచేసిన స్టేషన్‌లోనే దోషిగా
నిలబడ్డాడు. సంపాదనే ధ్యేయంగా నగరంలోని రోడ్లపై వ్యాపారం చేసుకుని బతికే పేద
వ్యాపారులకు వదలనంతగా సాగాయి ఇతని ఆగడాలు.
అవినీతి నిరోదకశాఖ అధికారుల వివరాల
ప్రకారం మహ్మద్ యూసుఫ్ అనే వ్యక్తి రోడ్డు పక్కన చెప్పులమ్ముకుంటూ గత 20
ఏండ్లుగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రామారావు
యూసుఫ్‌ను నెలకు రూ.5వేలు
లంచంగా ఇవ్వాలని లేదంటే షాపును పీకిస్తానని బెదిరించాడు. రోజు ఫోన్‌చేసి యూసుఫ్‌ని
డబ్బులివ్వాల్సిందిగా వేధించేవాడు. సార్
'ఫుట్‌పాత్‌పై
చెప్పులు అమ్ముకునే వాడ్ని'
నేను
నెలకు రూ.5వేలు
ఎలా ఇవ్వగలనని బతిమలాడాడు,
ప్రాధేయపడ్డాడు.
సి.ఐ. రామారావు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నెలకు రూ.5వేలు కాకుండా 6
నెలలకు రూ.15వేలు
ఇవ్వాలని. అయ్యా, అంతకూడా
నేనిచ్చుకోలేనని కన్నీరు మున్నీరయ్యాడు. అయితే షాపు తీసేయ్యాలని బెదిరించాడు
సి.ఐ.. జీవనాధారమైన షాపు తీసేస్తె తన కుటుంబం రోడ్డు పాలవుతుందని కన్నీటి
పర్యంతమయిన యూసుఫ్‌పై కనికరం చేపలేదు రామారావు. చివరిగా రూ.10వేలు
ఇస్తే సరేసరి లేకపోతే షాపు ఎత్తేయాల్సిందేనని భయపెట్టాడు. విసిగిపోయిన యూసుఫ్
ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం రామారావుకు ఫోన్‌చేసిన యూసుఫ్ రూ.10వేలు
నగదు ఇస్తానని ఫోన్‌చేసి చెప్పడంతో హోంగార్డుతోపాటు చేరుకున్నాడు.
యూసుఫ్‌నుంచి రూ.10వేలు
లంచం తీసుకుంటూ ఏసీబీ డి.ఎస్.పి. తోట ప్రభాకర్, సి.ఐ. శివకుమార్‌రెడ్డిల బృందం చేతికి
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. యూసుఫ్‌తో రామారావు మాట్లాడిన సంభాషనలన్నీ ఏసీబీ
అధికారులు రికార్డుచేసి ప్రశ్నించారు.
కష్టపడి బతుకీడుస్తున్న వ్యక్తిని..
బాగా చదువుకుని పోలీసాఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నెలనెల జీతం తీసుకుంటూ
అక్రమ సంపాదన మోజులో జీవితం నాశనం చేసుకున్న రామారావు జీవితం మరెంతమందికో పరోక్ష
హెచ్చరిక.