యూనిట్
Flash News
నొప్పి డాక్టర్ గారు పనిచేయడం
ప్రతిరోజు
జంతువులు నొప్పిడాక్టరుగారి దగ్గరికి వైద్యానికి వచ్చేవి - నక్కలు, కుందేళ్లు, సీలు జంతువులు,
గాడిదలు, చిన్న ఒంటెలు. కొన్నింటికి
కడుపునొప్పయితే, కొన్నింటికి పంటినొప్పి. ప్రతి దానికీ
డాక్టరుగారు మందు యిచ్చేవాడు. అన్ని జంతువులకీ నయమయేది. ఒకరోజున తోకలేని చిన్న మేక
ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన దానికి కొత్త తోకని కుట్టాడు. అప్పుడు యెక్కణ్నో
దూరంనుంచి ఒక ఆడ ఎలుగుబంటి వచ్చింది. అది గుడ్లనీరు కుక్కకుంది. మూలుగుతోంది,
ముక్కుతోంది. ఓ పెద్ద పేడు దాని పంజాలో దిగబడి వుంది. డాక్టరుగారు ఆ
పేడు తినేసి, గాయం కడిగేసి, తనువాడే
దివ్య అంజనాన్ని రాశాడు. వెంటనే నొప్పి తగ్గిపోయింది. ''చాకా'' అని ఆడ ఎలుగుబంటి
అరిచి యింటికి, తన గుహకి, వెళ్లి
పోయింది. దాని పిల్లలు అక్కడ వున్నాయి. ఆ తర్వాత ఒక కుందేలు వచ్చింది. కుక్కలు
దాన్ని చిత్తుగా కొరికేశాయి. తర్వాత ఒక రోగిష్టి పొట్టేలు వచ్చింది. దానికి
చచ్చేటంత జలుబూ, దగ్గూనూ. తర్వాత రెండు కోడిపెట్టలు వచ్చాయి.
అవి ఓ టర్కీ కోడిని తీసుకువచ్చాయి. దానికి విషపు పుట్టగొడుగుల విషం బాగా
యెక్కింది. ప్రతి జంతువుకీ డాక్టరుగారు మందు యిచ్చాడు. వాటి అన్నిటికీ వెంఠనే
బాగయి పోయింది. ప్రతీ జంతువూ ''చాకా'' అంది.
అలా జంతువులన్నీ వెళ్లి పోయాక డాక్టరుగారికి గుమ్మం వెనకనుంచి అలికిడి వినిపించింది.
''లోపలికి రండి'' అని ఆయన కేకవేశాడు. ఏడుపు మొహం పెట్టుకుని ఓ తాకోకచిలక ఆయన దగ్గరికి వచ్చింది. '' నా రెక్క కాలింది దీపానికి సహాయం చెయ్యండి నొప్పి డాక్టరూ కాలిన నా రెక్క ఒకటే నొప్పి!'' డాక్టరుగారికి సీతాకోకచిలకంటే జాలేసింది. దాన్ని అరచేతిలోకి తీసుకుని,
కాలిన రెక్కని జాగ్రత్తగా చూశాడు. అప్పుడు చిరునవ్వు నవ్వి అన్నాడు:
''ఏంటది బెంగపడకు సీతాకోకచిలకా యింకో రెక్క కుడతాను నీలం రంగు పట్టుది వాలి పడుకో పక్కకి. కొత్తది మంచిది మరో రెక్క!'' అలా అని
డాక్టరుగారు పక్కగదిలోకి వెళ్లాడు. చిన్న పీలికల పోగుని తీసుకువచ్చాడు. అందులో
వెల్వెట్, కాంబ్రిక్, శాటిన్,
పట్టు పీలికలు అన్నిరకాల రంగులవీ వున్నాయి. నీలంవి, ఆకుపచ్చని, నల్లటివి వున్నాయి. నప్పే పీలిక కోసం
డాక్టరుగారు చాలాసేపు వెదికి, ఆఖరికి ఎర్ర చుక్కలతోటి
మెరిసిపోయే నీలం ముక్కని తీశాడు. కత్తెర తీసుకుని, మంచి ముక్కని
రెక్కలా కత్తిరించి సీతాకోకచిలకకి కుట్టాడు. కిలకిలా నవ్వింది సీతాకోకచిలక
తుర్రునపోయింది పచ్చికమీదకి ఆడింది, పాడింది బర్చ్
చెట్లకింద మిడతలతో, తూనీగలతో. హుషారుగా వుండే నొప్పి డాక్టరు
అరిచాడు దాన్ని చూసి కిటికీనుంచి ''ఆడుకో, పాడుకో హుషారుగా కాని మాత్రం జాగ్రత్త నిప్పు చూసుకో!'' ఆ రకంగా సాయంత్రంబాగా పొద్దుపోయేదాకా డాక్టరుగారు రోగులతో తీరికలేకుండా
గడిపాడు. ఆ తర్వాత సోఫా మీద వాలి నిద్రపోయాడు. నిద్రలో ఆయనకి తెల్ల ఎలుగు బంట్లు,
లేళ్లు, వాల్రస్‌లు కనిపించాయి. వున్నట్టుండీ
యెవళ్లో తలుపు తట్టారు.