యూనిట్

పరీక్షిత్తు పరీక్ష

పూర్వం హస్తినాపురాన్ని పరిపాలించిన గొప్ప రాజుల్లో ఒకరు పరీక్షిత్తు. ఆయనకు వేటాడటం అలవాటు. ఒకసారి అడవిలో ఒక జింకను తరుముతూ వెళ్ళాడు. అతని బాణం దానికి తగిలింది. ఐనా చాలా దూరం కనబడకుండా పారిపోయింది. దాన్ని వెదుకుతూ పరీక్షిత్తు ఒక రుషి ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఆ రుషి పేరు శమీకుడు. ఆయన దగ్గరకు వచ్చి ‘‘అయ్యా నా పేరు పరీక్షిత్తు ` అభిమన్యుడి కుమారుడిని, ఈ దేశానికి రాజును. దెబ్బ తగిలిన జింక ఒకటి ఇటువైపు గాని వచ్చిందా?’’ అని అడిగాడు. రుషి ఆ రోజు మౌనవ్రతంలో వున్నాడు. కనుక మాట్లాడలేదు. కాబట్టి ఆయనకు వినబడదు కాబోలు అనుకుని ఆయన చెవి దగ్గర వచ్చి మళ్ళీ అడిగారు పరీక్షిత్తు. అప్పుడు పరీక్షిత్తుకు చాలా కోపం వచ్చింది. బాగా వినబడే చెవు వున్నా సరే విననట్టే నటిస్తున్నాడు ఈ ముసలివాడు. ఎంత పొగరు! అనుకున్నాడు. ధ్యానంలో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు రుషి, రుషి కొడుకు పేరు శృంగి. ఆయన స్నేహితుని పేరు కృష్ణుడు. అతను ఈ గొడవంతా దూరం నుంచీ చూశాడు. అతను అక్కడికి వచ్చే లోపు పరీక్షిత్తుకి ఒక చచ్చిన పాము కనిపించింది. కోపంలో వున్న పరీక్షిత్తు ఆ పాముని తన బాణంతో తీసి రుషి మెడలో వేసి వెళ్ళిపోయాడు. కృష్ణుడు జరిగినదంతా రుషి కుమారుడు శృంగికి చెప్పాడు. శృంగి తన తండ్రి మెడ మీద వున్న చచ్చిన పాముని తీసి వేశాడు. రుషి కళ్ళు తెరవలేదు. తండ్రిని ఇలా అవమానించిన రాజు ఏడు రోజు ముగియకుండానే తక్షకుడనే పాము కాటుతో మరణిస్తాడని శపించాడు. అది విన్న రుషి కళ్ళు తెరచి, మౌన వ్రతం వదిలేసి కొడుకుని మందలించాడు. అంత శాపం ఇవ్వవసిన అవసరం ఏముందని, శాపం సంగతి రాజు గారికి తెలియబరచమని గురుముఖి అనే శిష్యుడిని పరీక్షిత్తు దగ్గరకు పంపాడు రుషి, రాజు  అంతా విన్నాడు. తను తప్పు చేసినందుకు బాధపడ్డాడు. శాపం సంగతి కూడా తెలియబరచిన రుషికి నమస్కారం చేశానని గురుముఖి చేత కబురు చేశాడు. 

అప్పుడు పరీక్షిత్తు మహారాజు తనకు గురువు వంటి కశ్యపునికి కబురు చేశాడు. కశ్యపుడు ఎంతటి విషానికయినా విరుగుడు చెప్పగలడు. కశ్యపుడు వచ్చేలోగా రాజుగారు అతి పొడవయిన పెద్ద మేడ నిర్మించి ఆపైన ఒక ప్రత్యేకమైన గదిని కట్టించారు. ముఖ్యమైన మంత్రులు తప్ప ఎవరూ లోపలికి రాకుండా చూశారు రాజాధికారులు. 

రాజుగారి కోసం బయలుదేరిన కశ్యపుడికి ఒక ముసలివాడు ఎదురయ్యాడు. తనకు సహాయం చేయమని కోరాడు. ‘‘ ఏ సహాయం కావాలి’ అనడిగాడు కశ్యపుడు.’’ అయ్యా నేను రాజుగారిని చూడాలి ` ఎవరూ లోనికి పోనివ్వటం లేదు’’ అని అన్నాడు వృద్ధుడు. నేను రాజుగారిని తక్షకుడి నుంచీ రక్షించే పనిమీద పోతున్నాను ` మరి నీవు ఎం పనో చెబితే సాయం చేస్తా’’ అన్నాడు కశ్యపుడు. ‘‘నేను రాజుగారిని చంపాలి. నా పేరు తక్షకుడు’’ అని తన పాము రూపం చూపెట్టాడు. భయంకరమైన అతి పేద్ద పాము. న్లటి కోరలు, ఎర్రటి కళ్ళు. కశ్యపునితో ‘‘నేను దేన్నయినా నా విషంతో నల్లగా మసి చేయగలను. నా విషానికి విరుగుడు వుందా?’’ అని అడిగింది. నీ శక్తి చూపించమన్నాడు కశ్యపుడు. అప్పుడు తక్షకుడు ఒక పచ్చని చెట్టు మీద విషం ఊదాడు. ఆ చెట్టు నల్లగా కాలి బూడిదయింది. కశ్యపుడు ఆ బూడిదను తీసుకుని మంత్రం ఏదో చదివాడు. వెంటనే ఆ బూడిదలోంచి పచ్చని ఆకుతో కాయతో చెట్టు పుట్టుకొచ్చింది. 

అప్పుడు పరీక్షిత్తు శాపం వన తను పరీక్షిత్తుని కాటు వేయక తప్పదని, పరీక్షిత్తు మరణించక తప్పదనీ తక్షకుడు చెప్పాడు. 

సరే, ఎవరి ప్రయత్నం వారు గట్టిగా చేయవలసిందే అని కశ్యపుడు తన దారిన పరీక్షిత్తు మహారాజు గారి ఒంటి స్థంభం మేడకు వెళ్ళారు ` తక్షకుడు ఉపాయం ఆలోచిస్తూ వుండి పోయాడు. చివరికి అతనికి ఒక ఉపాయం తట్టింది. 

ఒంటి స్థంభం మేడలో పరీక్షిత్తు రాజు గారు జాగ్రత్తగా రోజు గడిపారు. ఇక చివరి రోజు సాయంత్రం అయింది. రక్షణ అధికారులు, సైన్యం దాటుకొని ఎవరూ రాలేరు ` ఇంక గడువు కాలం కూడా అయిపోతోంది ` అని రాజు సంతోషంగా వున్నాడు. అప్పుడు కొందరు సన్యాసు పూలు, పండ్లతో రాజదర్శనం కోసం వచ్చారు. సన్యాసులే కదా అని లోనికి రానిచ్చారు. వాళ్ళు రాజుగారిని దీవించి ఒక పండు ఇచ్చి వెళ్ళారు. రాజు ఆ పండుని కొరికాడు. అప్పుడు అందులో నల్లగా చిన్న పురుగు కనబడిరది. అది పురుగే కదా అని తీసి వేయబోయాడు పరీక్షిత్తు. క్షణాల్లో ఆ పురుగు నల్లని పొడవైన పెద్ద తక్షకుడిగా పెరిగి పడగ విప్పి కోరు చూపి కాటు వేశాడు రాజును. అంతే పరీక్షిత్తు మాడి మసి అయి మరణించాడు.  

వార్తావాహిని