యూనిట్

నక్క జిత్తులు

ఒక పెద్ద అడవిలో రెండు నక్కలు వుండేవి. రెండూ ఎంతో స్నేహంగా వుండేవి. కలిసి ఆహార సంపాదన కోసం తిరిగేవి. మెల్లగా అడవి దగ్గరి ఊరిలో ఇళ్ళలోకి దూరి కోళ్ళను పట్టుకుపోదామనుకున్నాయి. కోళ్ళను పట్టడం సులభం అని నక్కల నమ్మకం. అందుకు ఒక ఉపాయం పన్నాయి. ఒక నక్క గ్రామంలో ఇంటి ముందు పెద్దగా అరుస్తుంటే ఇంటి వారు, ఊరు వారూ దగ్గరకు రాగానే పారిపోవచ్చు. ఈ లోగా రెండవ నక్క ఇళ్ళ పెరట్లో తిరిగే కోడిని ఎత్తుకుపోవచ్చు. ఇదీ వాటి పథకం. అలాగే ఒకటి రెండుసార్లు నక్కలు ఊళ్ళో కోళ్ళని పట్టుకుపోగలిగాయి. కానీ వీటి ఉపాయం ఊళ్ళో వాళ్ళకి తెలిసిపోయింది. ఒక రోజు రెండింటినీ పట్టుకోవాలని జనం ప్రయత్నించారు. కోడితో సహా ఒక నక్క తప్పించుకుని పారిపోయింది. ఒకటి మాత్రం దొరికిపోయింది. నక్కలన్నిటికీ బుద్ధి వచ్చేలాగ శిక్షించాలని ఊరివాళ్ళు అనుకున్నారు. అందుకని దొరికిన నక్కను ఊరి బయటి చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడదీశారు. ఒక కాలికి తాడు కట్టి అలా వేలాడదీశారు. అందరూ వెళ్ళిపోయాక నక్క గింజుకుంటోంది. అప్పుడు అక్కడికి ఒక ఎలుగుబంటి వచ్చింది. దాన్ని చూడగానే నక్క సరదాగా ఉయ్యాల ఊగుతున్నట్టు నటించింది. అటూ ఇటూ ఊగుతున్నది. ‘‘నీకు ఉయ్యాల ఊగాలని ఉందా?’’ అని నక్క ఎలుగుబంటిని అడిగింది. ‘‘సరే ఐతే ఈ కట్టు విప్పు’’ అని అడిగింది నక్క. ఎలుగుబంటి చకచకా కొమ్మ ఎక్కి తన గోళ్ళతో ఉచ్చు ముడి వదులు చేసింది. వెంటనే నక్క కాలు ఉచ్చు ముడిలోంచి జారింది. నక్క కింద పడి వెంటనే అడవిలోకి పారిపోయింది. పాపం ఎలుగుబంటి చెయ్యి ఆ ఉచ్చు ముడిలో ఇరుక్కుపోయింది. ముడి బిగుసుకుంది. ఎలుగుబంటి తాడుకు వేలాడుతూ గింజుకుంది. ఆ రోజు నుంచీ నక్కలను ఎలుగుబంట్లు నమ్మడం మానేశాయి.

వార్తావాహిని