యూనిట్
Flash News
మురికి అంటే అంతముద్దా!!
(సమ్-భాషణ) నేను: ‘‘ నేను చక్కగా తల దువ్వుకున్నాను, చిన్న జడవేసుకున్నాను. ఉతికి ఇస్త్రీ చేసిన మంచి గౌను వేసుకున్నాను. తమ్ముడేమో తెల్లటి శుభ్రంగా వున్న లాగు, చొక్కా వేసుకున్నాడు. ఇంక తప్పు ఏం జరిగిందీ?! సుబ్భరంగానే వున్నాం కదా!?’’ అమ్మ: తరవాత ఇద్దరూ ఏం చేశారు? కారప్పూస, బూందీ కట్టి ఇచ్చిన కేరీబేగ్‍ను ఏం చేశారు?... ఆడుకుందుకు వెళ్లి, ఆడిన చోటే అవి తిని కేరీబ్యాగ్‍ను అక్కడే పడేసేరు. చుట్టూరా కారప్పూస, బూందీ అక్కడక్కడ పడ్డాయి. శుభ్రత నీవేగాదు, నీ చుట్టూ వున్న చోటంతా శుభ్రం గా వుండాలి-వుంచుకోవాలి. నాన్న: నిజమే..మరి నువ్వేం చేసేవు? కేరీ బ్యాగ్ - పల్చటి ప్లాస్టిక్ కేరీబ్యాగ్‍లో తినేవేవో పెట్టి పంపించావు- ఆ కేరీ బ్యాగ్‍ను మేకలో, ఆవులో, గేదెలో తినేస్తే వామవుతుంది! అమ్మ: ఆవులూ, మేకలూ కంచీలు ఎందుకు తింటాయి! గడ్డీశాదం గదా తింటాయి!!’’ నాన్న: పట్టణాల్లో, నగరాల్లో మాత్రం మేకలు, ఆవులూ వాల్‍పోస్టర్‍లు, ఒకటేమిటి చిరిగిన పాత బట్టలూ తినేస్తుంటాయి ఆకలి అలాటిది! అవి తిన్న జంతువులు రోగన పడతాయి. తమ్ముడు: అలా వీధుల్లో దూడల్నీ, మేకల్ని ఎందుకు వదిలేస్తారు! నాన్న: ఆ జంతువుల్ని, పశువుల్ని పోషించేవారి తప్పు అది. పైగా నగరాల్లో గడ్డి ఎక్కడ దొరుకుతుంది? కొనాలంటే ఖరీదు! వీధిన పడిన మనుషులనీ, పశువులనీ పోషించే మనుషులు, సంస్థలూ వున్నవి చాలవు. నేను: ఒక వేళ జంతువులు ప్లాస్టిక్ సిలఫెన్ సంచీలు తినకపోతే ఫరవాలేదు గదా!? నాన్న: అలాటి సంచీలు కాలవల్ని, డ్రైనేజి గొట్టాలనీ నీరు పారకుండా అడ్డుకుంటాయి, పైగా అవి నేలలో కలిసిపోవు. వందల సంవత్సరాల యినా అవి అలాగే నేలలో వుండి పోతాయి ఒకవేళ కాలవల్లో కలిసి పోతోంటే వాటిని మింగే చేపలు, సముద్రంలో, అయితే తిమింగలాలు సైతం మింగి చచ్చిపోతాయి. కడుపులో ఈ చెత్త సంచీలు చుట్టుకుపోతా. యన్నమాట. అమ్మ: రైల్లో, బస్సులో వెళ్ళేటప్పుడు తినే పదార్థాలు రోడ్డుమీద, రైల్వే కల్వర్టు వంతెనలు, గట్లమీద పడేయకూడదు.. నేను: ఏం? పాపం ఎలకలో, ఏవో తింటాయి గదా!! నాన్న: అలా పడేస్తే- వంతెన గట్లమీద పందికొక్కులు ఎలకలూ చేరి వాటిని తింటుంటాయి. అలా అక్కడ రోజూ ప్రయాణం చేసే వాళ్లు పడేసినవి తిని ఊరుకోవు- పెద్దపెద్ద కన్నాలు చేసుకుని వంతెన గట్లలో వుంటాయి. వర్షం నీరు ఆ కలుగు ల్లోకి చేరితే వంతెన కట్ట్టె బలం తగ్గుతుంది- వాటి మీదవేసిన రైలుపట్టాలూ కుంగుతాయి ఏదోరోజు వంతెనా, రైలూ కూలి పోతాయి- బురద మట్టి గుత్తిలాగ! నేను: హమ్మో! నాన్న: అందుకే మనం ఏ రకంగానూ మన చుట్టూ వున్న పరిసరాలను పాడుచేసే పన్లు చేయకూడదు. నేను: సరే, మనం ఇప్పుడు రైల్లో, బస్సులో లేం గదా! ఓ చాక్లెట్ ఇచ్చెయ్యి! అమ్మ: ఐతే దాని రౌప•ర్, ముచ్చిరోమ్ కాయితం నలిపి చెత్తబుట్టలో వెయ్యి’’ నేను: ఆ పని నువ్వు చెయ్యి, నేను చాక్లెట్ తింటాను. అమ్మ: మీరే! తప్పుమీద ఒక్కటిస్తా చూడు! శ్రీశ్రీ శ్రీశ్రీ శ్రీశ్రీ శ్రీశ్రీ ఏం గొప్ప! (2) నేను: డాడీ.. మానవజన్మ ఉకృషం ఐనది - అంటే ఏంటీ? నాన్న: ఉకృషం కాదు - ఉత్కృష్టము- ఉత్కృష్టమైనది-ఇతర జీవాలకంటే మానవ జన్మే మేలయినది, గొప్పదీ అని అర్థం - ఇంత పెద్ద పదం నీకెవరు చెప్పేరు? నేను: టీచర్ చెప్పేరు.. అమ్మ: కరెక్ట్, బాగా చెప్పేరు- మా మధ్య టీవీలో పెద్దాయన అదే చెప్పేరు. నేను: మమ్మీ మరి మన కుక్కపిల్ల పప్పీ వుందిగదా- దాని ‘ఉకృషం’ కాదా మరి?! అమ్మ: దాని జన్మ ఉత్కృష్టమైంది కాదనే గదా అర్థం!? తమ్ముడు: డాడీ, మరి అక్కడ చెట్టు, దాని మీద ఉడత - అవీ మనలాంటివి కావా? నాన్న: కపించేప్రతి జీవి జన్మ - అదే పుట్టుక ఉత్కృష్టమైందే. మన మనుషుల జన్మ ఉత్కృష్టం అని మనకిమనమే చెప్పుకొంటే సరిపోయిందా! జంతువులో, పక్షులో, చేపలో, పురుగులో వచ్చి మనుషుల జన్మ మాకంటే గొప్పది అని చెబితే గదా! అమ్మ: అంతేనంటారా! నాన్న: ఆహా! సమస్త జీవులు- అంటే- అన్ని ప్రాణులూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి వుంటాయి. అన్ని అందరం సమానంగా ఉండటం నేర్చుకుంటే మనం - అంటే మనషులం, పక్షులు, జంతువులు, పురుగులూ, సూక్ష్మ జీవులూ అన్నీ హాయిగా వుంటాయి, కానీ మనం అలావుండనిస్తే గదా మన గొప్ప తెలిసేది?! నేను: ‘సమానంగా వుండటం’, ‘ఒకదానిమీద ఒకటి ఆధారపడి’ వుండటం ఎందుకు? ఎలా? నాన్న: నేలమీద, మట్టిలో సన్నసన్నటి వానపాములు, పురుగులు, సూక్ష్మ క్రిములూ మొదలయినవన్నీ వుంటే భూమికి పంటలు,చెట్లు, పూలు, కాయలు, విత్తనాలు- వాటినుంచీ కుళ్లీ మొలకలు, మొక్కలు - ఇలా వస్తాయి. ఆ చెట్ల బెరడుకు చిన్నచిన్న పురుగులు, వాటిని తినే పెద్ద పురుగులు, వాటి కోసం పిట్టలు, గూళ్లు, గుడ్లు మళ్లీ బుజ్జిపిట్టలు, చెట్ల నీడ, చల్లగాలి, వర్షం, మబ్బూలూ అన్ని వుంటాయి. అలాంటి చెట్లుండే అడవుల్లో ఏం వుంటాయి. తమ్ముడు: సింహం, పులి, ఎలుగుబంటి, ఉడత, తాబేలు... నాన్న: ఓకే... అలా అన్ని వుంటాయి. చెట్లకి అడవులకే సంబంధం వుంది, అడవులా, జంతులూ, పిట్టలు ఒకదానిమీద ఒకటి ఆధారపడి వుంటాయి. నేను: రాళ్లు, కొండలు, కాలువలు, బావులు, చెరువులు, నదులూ కూడా నా? నాన్న: కరెక్ట్ - ఇదీ ఇవన్నీ కూడా నేల పై, అడవులపై ఆధారపడినవే. ఇవన్నీ, ఉన్నా వుంటేనే మనకి అన్నం, పండు, కాయ, గింజ, మొలకలూ వచ్చేది. వీటికి నష్టం వచ్చే ఏ పని చేసినా మనమనుషులం జబ్బున పడతాం, తిండీ దొరకదు - వట్టి బంగారాన్ని కరెన్సీ కాయితాలనీ తినలేం గదా! అందుకే అన్ని ఉతృష్టమైవనే, గొప్పమే. మన సంగతే చెప్పవేం మరి!!’’