యూనిట్
Flash News
ఎదురు దెబ్బ
పూర్వం
కృష్ణానది ఒడ్డున ఒక కొండ దగ్గర రెండు నక్కలుండేవి. అవి భార్యాభర్తలు. అక్కడే
ఎప్పుడూ గొర్రెల మందలూ వుండేవి. ఎలాగయినా ఆ గొర్రెలని తినాలని నక్కలు ఆశగా
వున్నాయి. ఇందుకు ఒక ఉపాయం పన్నాయి. ‘‘నువ్వు జాగ్రత్తగా గొర్రెలతో స్నేహం చెయ్యి. నీ మీద నమ్మకం కుదిరిన
తరువాత నేను చచ్చిన దానిలాగ పడి వుంటాను. అప్పుడు నువ్వు మా ఆయన చనిపోయారు... అని
పెద్దగా ఏడుపు. ఒకసారి చూసి వెళ్ళమని అడుగు. అప్పుడు గొర్రె నా దగ్గరకు రాగానే
దాని మెడ కొరికేస్తా - మంచి భోజనం చెయ్యవచ్చు’’ అని మగ
నక్క ఆడ నక్కకు చెప్పింది. అది అలాగే వెళ్ళి గొర్రెల దగ్గర మంచి దానిలా నటించి
హఠాత్తుగా ఏడిచింది. ‘‘ఏమైంది? ఎందుకేడుస్తున్నావని
ఆడ నక్కని ఒక గొర్రె అడిగింది.’’ నా భర్త అక్కడ గుహలో
చనిపోయారు. ఇక నాకెవరు దిక్కు?!... నువ్వు నాతో వచ్చి
ఒకసారి చూడు’’ అని బతిమాలింది. గొర్రె నమ్మింది. ఆడ
నక్కకి ధైర్యంగా వుండమని చెబుతూ గొర్రె నక్క వెంట గుహలోకి వచ్చింది. కానీ అతి
తెలివి వలన అత్యాశవల్ల తొందరపడి చచ్చినట్టు నటించిన మగనక్క ముందే లేచి చూసింది.
గొర్రెకు వెంటనే మోసం అర్థమైంది. వెంటనే రెండు నక్కలకు దొరకకుండా పారిపోయింది. అప్పుడు
నక్కలు మళ్ళీ ఉపాయం పన్నాయి. ఈసారి ఆడనక్క అమాయకంగా వున్నట్టు నటిస్తూ గొర్రె
దగ్గర మర్యాద నటిస్తూ దూరంగా నిలబడి ‘‘నువ్వు నిన్న మా
గుహకు రావడం మంచిదయింది. మాకు ఎంతో మేలు చేశావు. నువ్వు రావటం వలన మా ఆయన
చావునుంచీ బయటపడ్డాడు. అందుకని మేము నీకు మంచి విందుని ఇద్దామనుకుంటున్నాం. -
నువ్వు రావాలి’’ అని ఆడనక్క అన్నది. అంతకు ముందే
గొర్రెలన్ని కలిసి ఉపాయంగా ఏం మాట్లాడాలో చిన్న గొర్రెకు చెప్పాయి. అందుకని ఆ
గొర్రె సంతోషంగా తల ఊపుతూ ‘‘మరి నే ఒక్కదాన్నే రావాలా?
ఒకరిద్దరు నాతో విందుకు రావచ్చా? ఒక్కదాన్ని
విందుకు వెళ్ళే అలవాటు లేదు’’ అన్నది. ఈ గొర్రెతో మరో
రెండు మూడు గొర్రెలు కూడా వస్తాయి కాబోలు - అన్నీ తినవచ్చు అని ఆలోచించి నక్క ‘‘గొర్రెలే కదా- ఎందరొచ్చినా ఫరవాలేదు - పెద్ద వంట చేసి వుంచుతా’’
అన్నది నక్క. అప్పుడు చిన్న గొర్రె నవ్వి ‘‘అబ్బే - నాతో వచ్చేవి గొర్రెలు కావు. నీలాగే నాకు నాలుగు వేట కుక్కలు
బలిసినవి వున్నాయి. అవి వస్తాయిలే!’’ అంది చిన్న గొర్రె.
ఆడ నక్కకి అంతా అర్థమైంది. క్షణంలో అక్కడి నుంచీ పరిగెత్తి పారిపోయింది.!