యూనిట్
Flash News
ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందుటకు ఈ కొత్తసంవత్సరము సరైన సమయము
ప్రతి సంవత్సరం జరిగే పండుగలలో కొత్త సంవత్సర వేడుకలు
ప్రత్యేకమైనవి. ప్రపంచ వ్యాప్తంగా ఆన్ని రకాల వ్యక్తులు కూడా ప్రత్యేకంగా
జరుపుకుంటారు ఈ పండుగను. ఈ పండుగ కోసం ఆతురతతో ఎదురు చూస్తుంటారు. చాలామంది తీర్మానాలు
తీసుకుంటారు, వాటిలో కొన్ని సాదించడానికి ప్రయత్నిస్తారు వాటిలో కొన్ని సాధించడంలో వైపల్యం
చెందుతుంటారు. కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుంది. చెడు విషయాలను విడిచిపెట్టి మంచి
విషయాలలో ముందుకు కదిలేలా ఈ కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించడానికి
ప్రయత్నించాలి. అందు వలన కొత్త జీవన శైలిని అలవర్చుకోవడం కోసం పాత జ్ఞాపకాలను
విడిచిపెట్టి ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి.
మంచి
ఆరోగ్యానికి సరైన ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారం మీద జీవనశైలి పైన శ్రద్ధ
తీసుకుంటే, చాలా రకాలైన వ్యాధులకు గుండె సమస్యలు, షుగరు, క్యాన్సర్
తదితర వ్యాధులకు దూరంగా వుండవచ్చు.
ఈ
క్రింద ఇచ్చిన సలహాలు మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.
1. శరీర
బరువును సాధారణంగా వుంచుకోవాలి.
2. ప్రతిరోజు
వ్యాయామం చేయాలి.
3. ఆహార
నియమాలు పాటిస్తు వ్యాయామం చేయాలి.
4. ఆహారాన్ని
తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తినాలి, ఎక్కువసేపు
ఏమీ తినకుండా వుండకూడదు..
5. మూడు
పూటలా ఆహారాన్ని తీసుకోవాలి. ఏ పూటా ఆహారాన్ని తినకుండా వుండరాదు. బ్రేక్ ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ లను తీసుకుని మద్య, మద్యలో ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తీసుకోవాలి.
ప్రూట్స్ మరియు సలాడ్స్ లాంటివి తీసుకొవచ్చు.
6. వేయించిన
వంటలు, వెన్నతో చేసిన వంటలు, మీగడ, నెయ్యి, డాల్డా, మేక/బీఫ్/ఫోర్క్
మాంసం వంటి వాటికి దూరంగా వుండాలి.
7. మంచి
కొవ్వు పదార్దాలున్న ఆహారాన్ని తీసుకోవాలి ఎక్కువగ ఉప్పుతక్కువగా ఉన్న గింజలు ఉదా:
బాదం, అక్రోట్ మరియు చేపలు వంటివాటిని తీసుకోవాలి.
8. స్వీట్లు, వేయించిన ఆహార పదార్దాలు మరియు జంక్ పుడ్స్
వంటి అధిక క్యాలరీలు ఉండే పదార్దాలను తీసుకోకూడదు.
9. ప్రతిరోజు
తీసుకునే ఆహారంలో త్రుణధాన్యాలను అనగా పండ్లు, కూరగాయలు
మరియు కాబూలీ చనగలు, రాజ్‌మాలు, బఠానీలు, పెసర
పప్పు వంటి వాటిని తీసుకోవాలి.
10. ఎక్కువ
రంగున్న పండ్లు బొప్పాయి, క్యారెట్, దానిమ్మ, పుచ్చకాయ
మరియు ఆకుపచ్చ ఆకుకూరలును తీసుకోవాలి. వీటిలో వుండే Anti oxidents, విటమిన్లు మరియు ఖనిజాలు వలన గుండె సంబందిత
వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధించవచ్చును.
11. ఉప్పు
మరియు ఉప్పు ఆధికంగా ఉండే ఆహార
పదార్ధాలైన చిప్స్, పికిల్స్, సాల్ట్ బిస్కెట్స్, మిక్చర్ వంటి వాటిని తగ్గించాలి.
12. నిత్యం
మీ యొక్క రక్త ప్రసరణ మరియు చెడు కోలెస్ట్రాల్ లెవెల్స్ తమ ఆదీనంలో వుండే టట్లు
చూసుకోవాలి.
13. మద్యంను
అతిగా సేవించరాదు.
14. పొగత్రాగరాదు
మరియు పొగాకు సంబందిత వస్తువులను వాడరాదు.
15. ఒత్తిడికి
దూరంగా వుండండి మరియు ఒత్తిడిని అధిగమించడానికి సాదనాలైన యోగా మరియు మెడిటేషన్
వంటివాటిని అలవాటు చేసుకోవాలి.
16. రెగ్యులర్‌గా
హెల్త్‌చెకప్‌లు చేసుకోవాలి. \
-- డా|| శ్రీమతి వసుధా మాథుర్,
చీఫ్ డైటీషియన్
బసవతారకం
ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి, హైదరాబాద్