యూనిట్
Flash News
వర్షాకాలంలో పాటించవల్సిన ఆరోగ్య చిట్కాలు
వేసవికాలానికి వీడ్కోలు
పలికి వర్షాకాలానికి స్వాగతం పలికే సంధికాలంతో పాటు వర్షాకాలంలో మనం అనేక వ్యాధుల
బారిన పడే ప్రమాదం వున్నది. వేసవిలో వున్న వేడిమి, ఉక్కపోతల
నుండి ఎప్పుడెప్పుడు వర్షాకాలం వస్తుందా ఈ వేడిమి, ఉక్కపోతల
నుండి
ఉపసమనం లభిస్తుందా అని ఎదురు
చూసే మనకు, వేడిమి నుండి ఉపసమనంతో
పాటుగా కొన్ని వ్యాధులను కూడా స్వాగతం పలకాల్సివస్తుంది.
ఈ వర్షాకాలంలో కొన్ని చిన్న
చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా వుండవచ్చు. అలాగని అవి నీరు
నిల్వ వుండే ప్రదేశాలకోసం మరియు వీది చిరు తిల్ల కోసం కాదు. వర్షాకాలంలో పూర్తి
స్థాయిలో ఆరోగ్యంగా వుండడానికి నిర్దేశించిన ఏడు చిట్కాలు.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని
అలవాటు చేసుకోవాలి: ఈ వర్షాకాలంలో శరీరం మరియు జీర్ణవ్యవస్థ అంటువ్యాధులకు గురి
అయ్యే అవకాశం వుంది. ఈ వ్యాధులన్నీ ప్రధానంగా మనం తాగే నీటి ద్వారా వస్తాయి కావునా
వేడి నీటిని తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కాలంలో మనకు ఇష్టమైన చాట్, జూస్, కుల్ఫీలు
మరియు బజారులో లభించే ఆహారాలను మన మెనూ నుండి తొలగించాలి మరియు బయట కూరగాయలను
శుభ్రపర్చుకుని ఇంట్లో వాటితో ఇంట్లోనే వంటకాలను తయారు చేసుకుని తినడం ఆరోగ్యానికి
ఎంతో శ్రేయస్కరం.
మీరు ఉషారుగా వుండడానికి
కావల్సినంత నీటిని తీసుకోవాలి: ప్రధానంగా ఆల్కహాల్, రసాయనిక జ్యూస్‌లు, కాఫీ వంటివి మూత్ర విసర్జనకు మాత్రమే పని
చేస్తాయి. వీటి బదులుగా యాంటీ బాక్టీరియల్ వుండే ఆయుర్వేధ టీలు తీసుకోవడం చాలా
ప్రయోజనకరం.
వర్షంలో నడకకు దూరంగా
వుండాలి: వర్షపు నీరు రోడ్ల పై పారుతుంటే ఆ నీటిలో నడవాలని, ఆడుకోవాలని చాలా ఉత్సాహంగా వుంటుంది. అలా నడవడం
వలన కొన్ని రకాల మెదడు పొరల వ్యాధులు, పాదం
మరియు గోళ్ళపై అనేక అంటు వ్యాధులు సోకడానికి అవకాశం వుంటుంది. మీ పాదాలు తడిగా
వుంటే వెంటనే తుడుచుకోవాలి అంతే గాని ఆ తడి పాదాలతొ సాక్సులు, షూస్ వంటివి ధరించరాదు. ప్రత్యేకంగా షుగరు
వ్యాధిగ్రస్థులు ఒట్టి పాదాలతో నడవరాదు, అ
నీటిలో అన్ని రకాల సూక్ష్మజీవులు అధికంగా వుంటాయి. వర్షంలో తడిచినప్పుడు ఆ తడి
బట్టలతో ఏసి గదులలో కూర్చోకుండా, పొడి
బట్టలు మార్చుకుని కూర్చోవాలి. కార్యాలయాలకు వెల్లినప్పుడు ఇంకో బట్టల జత తీసుకు
వెల్లడం ఉత్తమమైన పని.
ఇంటిలోకి తడి చేరనీయకండి: అస్తమా
లేదా మరే ఇతర శ్వాసకోస వ్యాధులతో భాద పడుతుంటే గోడలు తడిగా వున్న ఇళ్ళలో వుండరాదు.
తడి గోడలకు ఫంగస్ చేరి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
దోమల మందు లేకుండా ఇల్లు
విడిచి వెళ్ళ వద్దు: పోలీసులు బందోబస్తులు మరియు ఇతర డ్యూటీల నిమిత్తం ఎక్కువగా
బయటకు వెళ్ళాల్సి వుంటుంది. అలా బయటకు వెళ్ళే సమయంలో దోమలను నివారించే మందును వెంట
తీసుకు వెల్లాలి. ఎక్కడ పడితే అక్కడ వర్షం నీరు నిల్వ వుండడం వలను మలేరియా వంటి
వ్యా ధులను వ్యాప్తి చేసే దోమలు అధికంగా వుంటాయి. వాటి నుండి మనల్ని మనం
రక్షించుకోవడానికి దోమల నివారణ మందును వెంట తీసుకు వెళ్లాలి. అవసరం అనుకుంటే యాంటీ
మలేరియా మందులను వాడడం మేలు.
రోజూ రెండు పూటలు స్నానం
చేయాలి: పోలీస్ ఉద్యోగంలో నిత్యం రోడ్లపైన తిరుగుతుంటాం. మన శరీరానికి దుమ్ము, ధూళి అధికంగా పడుతుంది కావున ప్రతిరోజు ఉద్యోగం
ముగించి ఇంటికి చేరుకున్న వెంటనే స్నానం చేయాలి. అలా చేయడం వలన కొన్ని రకాల అంటు
వ్యాధులకు దూరంగా వుండవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెర గడానికి రోజు విటమిన్ 'సి' లభించే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసు కోవాలి.
కళ్లను తాకరాదు: కండ్ల కలలు, కంటి కురుపు, పొడి
కళ్ళు వంటి కంటి వ్యాధులు రావడం ఈ వర్షాకాలంలో సర్వ సాధారణం. పరిశుభ్రం లేని
చేతులతో కళ్లను తాకితే వ్యాధులు వచ్చే
ప్రమాదం వున్నది మరియు టీవిలు, కంప్యూటర్స్
ముందు ఎక్కువ సేపు కాలం గడిపే వారి కళ్లు ఎరుపు ఎక్కడం, దురదగా వుండడం లేదా చికాకు పర్చడం చేస్తాయి.
ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేకపోతే అంధత్వం వచ్చే
ప్రమాదం వున్నది.
ఇవండీ వర్షాకాలంలో మనం
పాటించవల్సిన జాగ్రత్తలు. పైన తెలిపిన చిన్న చిన్న చిట్కాలను పాటించి మన
ఆరోగ్యాన్ని ఈ వర్షాకాలంలో కాపాడుకుందాం....