యూనిట్

లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ విజేత సిఆర్పిఎఫ్ జట్టు

విశాఖలో వేడుకగా జరిగిన 20వ ఆల్ ఇండియా పోలీస్ లాన్ టెన్నిస్ టోర్నీ టీమ్ ఛాంపియన్ షిప్ను సిఆర్పిఎఫ్ జట్టు కైవసం చేసుకుంది. ఐటిబిపి జట్టు రన్నరప్గా నిలిచింది. వెటరన్ సింగిల్స్లో సీవి ఆనంద్ (సి.ఐ.ఎస్.ఎఫ్), ఓపెన్ సింగిల్స్లో అక్షయ్ఆహుజా (ఐటిబిపి) విజేతుగా నిలిచారు. వెటరన్ డబుల్స్ ఫైనల్స్లో రణ్దీప్ దత్తా, రాజు భార్గవ (సీఆర్పీఎఫ్) జోడీపై ఆంద్రప్రదేశ్కు చెందిన వి. సత్తిబాబు (డీఎస్పీ), బి. సత్యనారాయణ (డీఎస్పీ) జోడీ విజయం సాధించింది. అదే విధంగా ఓపెన్ డబుల్స్ ఫైనల్లో రణ్ధీప్ దత్తా, జేకుమార్ (సీఆర్పీఎఫ్)    జోడీపై ఆశిష్ కపూర్ (పంజాబ్), రాజు బార్గవ (సీఆర్పీఎఫ్) జోడీ విజయం సాధించింది. వుడా పార్క్లోని   ఎంజీఎం గ్రౌండ్స్లో జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర హోంశాఖామంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు విజేతుకు ట్రోఫీు అందజేసారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 18 పోలీస్ జట్లు పాల్గొన్న ఈ జాతీయస్థాయి టోర్నీని విశాఖ పోలీస్ ఎంతో ప్రణాళికాబద్దంగా, సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. అదే విధంగా విజేతకు, పాల్గొన్న  క్రీడాకారుకు అభినందను తెలియజేశారు. టోర్నీ నిర్వాహక కార్యదర్శి, నగర పోలీస్ కమీషనర్ ఆర్కె మీనా మాట్లాడుతూ ఈ టోర్నీ నిర్వహణకు తొమ్మిది మంది సీనియర్ అధికారుతో కూడిన  కమిటీను, వాటి పర్యవేక్షణలో 19 సబ్ కమిటీను ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందించామన్నారు. అందుకు అనుగుణంగా నగరంలోని వివిధ వేదికలో నాుగు రోజుపాటు ఈ పోటీను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.


టోర్నీ నిర్వాహక కమిటీ ఛైర్మన్, రాష్ట్ర డీజిపీ శ్రీ దామోదర్ గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడుతూ జాతీయస్థాయి టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించడంలో సఫలీకృతమయ్యామన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాకు చెందిన పోలీస్ జట్లకు ఈ పోటీు ఒక మధురానుభూతిని మిగ్చుతాయన్నారు. ఐబీ ప్రత్యేక డైరెక్టర్ ప్రభాకర్ అలోకా మాట్లాడుతూ చైనాలో జరిగిన పోలీస్ గేమ్స్లో మన దేశం తరపున 130 మంది పోలీస్ క్రీడాకాయి పాల్గొని 286 పతకాు సాధించి దేశానికి వన్నె తెచ్చారన్నారు.


క్రీడల్లో ప్రతిష్టాత్మకమైన అర్జున,ద్రోణాచార్య అవార్డ్తోపాటు నాుగు పద్మవిభూషణ్, ఎనిమిది ఖేల్ రత్న అవార్డుల్ని కూడా పోలీస్ క్రీడాకాయి సాధించి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు. విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి ఎల్.కే. రంగారావు, డిసిపిు ఎస్. రంగారెడ్డి, బి. ఉదయ్ భాస్కర్, విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజి తోపాటు పువురు ఉన్నతాధికాయి పాల్గొన్నారు.

వార్తావాహిని