యూనిట్
Flash News
మిస్టర్ ఆంధ్ర విజేత విశాఖ కానిస్టేబుల్
పోలీస్
అంటేనే శారీరక, మానసిక ధృఢత్వానికి
ప్రతీక. అందుచేతే క్రీడలలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి పోలీస్ విభాగంలో ప్రవేశం
మిగతావారితో పోల్చితే కొంత సులభతరమౌతుంది. ఉద్యోగంలో చేరిన తదుపరి క్లిష్ట విధులు, వేళల వలన
తమకు ఆసక్తి ఉన్న క్రీడాంశాలకు దూరమౌతున్నారు ఎందరో పోలీస్ క్రీడా ఔత్సాహికులు.
కానీ విశాఖ జిల్లా పోలీస్ కానిస్టేబుల్ జి. శ్రీనివాసరావు తన విధులు నిర్వర్తిస్తూనే
ఎంతో ఇష్టమైన బాడీ బిల్డింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
ప్రతిభ కనబరుస్తూ పోలీస్ శాఖకు వన్నె తెస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాడీ బిల్డర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ది 10.12.2017 వ తేదీ శ్రీకాకుళంలో జరిగిన 16 వ మిష్టర్ ఆంధ్ర
బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ 2017 నందు శ్రీనివాసరావు 85 కే.జీల విభాగంలో పాల్గొని మొదటి స్థానం సాంధించారు. శ్రీకాకుళం ఎన్.టి.ఆర్
ఎమ్.హెచ్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీలలో వివిధ విభాగాలలో 120 మంది పోటీపడ్డారు. గతంలో ఇండియన్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వారు 2016 సం.లో కేరళలో నిర్వహించిన సీనియర్ నేషనల్స్ పోటీలలో కూడా శ్రీనివాసరావు
85 కే.జీల విభాగంలో పోటీపడి బ్రాంజ్ మెడల్‌ను పొందాడు.
డిసెంబర్ 17 నుండి 19 వరకు థాయ్‌లాండ్
దేశంలోని బ్యాంకాక్‌లో జరుగనున్న 'ఏషియన్ బాడీ బిల్డింగ్
అండ్ ఫిట్‌నెస్ ఛాంపియన్ షిప్' పోటీలలో ఆంధ్రప్రదేశ్
నుండి శ్రీనివాసరావు ఒక్కడే పాల్గొనే అపూర్వ అవకావాన్ని దక్కించుకున్నాడు. రాష్ట్ర
డి.జి.పి శ్రీ నండూరి సాంబశివరావు గారు, మరియు జిల్లా ఎస్పీ
శ్రీ రాహుల్‌దేవ్ శర్మ గారి ప్రత్యేక చొరవతో రాష్ట్ర పోలీస్ విభాగం నుండి
శ్రీనివాసరావుకు ఆర్థిక సాయంగా 2.50 లక్షల నగదును అందించడం
జరిగింది.
ఈ
సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయాసలను, ఒత్తిడులను ఎదుర్కొని శ్రీనివాసరావు బాడీ
బిల్డింగ్ లో రాణిస్తున్నారని అభినందించారు. ఇదే విధంగా త్వరలో పాల్గొననున్న
బ్యాంకాక్ ఛాంపియన్ షిప్‌లో కూడా ప్రతిభ కనబరచి, ఆంధ్రప్రదేశ్
పోలీస్ శాఖకు అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకురావాలని ఆకాక్షించారు. ఇతర అధికారులు
తోటి సిబ్బంది కూడా అభినందనల ప్రోత్సాహాన్ని అందించారు.