యూనిట్
Flash News
మానసిక ఒత్తిడి ఉపశమనానికి క్రీడలు ఎంతో మేలు చేస్తాయి
తిరుపతి యం.ఆర్ పల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్
నందు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఘణంగా ప్రారంబమైనది. ఈ
క్రీడలు మూడు రోజుల పాటు జరగనున్న ముఖ్య అతిదిగా ఎస్పీ డా. గజరావు భూపాల్ హాజరైనారు. పోలీస్
స్పోర్ట్స్ మీట్ సిబ్బందిచే గౌరవ వందనాన్ని స్వీకరించి తదుపరి స్పోర్ట్స్ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు. స్నేహ
సూచికగా పావురాలను ఎగరవేశారు, తదుపరి స్పోర్ట్స్ జ్యోతి ని వెలిగించి క్రీడలను ప్రారంబించినారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నిత్యం
విధి నిర్వహణలో సతమతమయ్యే పోలీస్ సిబ్బందికి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం
కలిగించడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రీడలలో పాల్గొనే ప్రతి ఒక్కరు స్పోర్ట్ ను
టీం వర్క్ గా పాజిటివ్ గా తీసుకొని ఆడాలని కోరారు. స్పోర్ట్ వలన మీరు వ్యక్తి గతంగా కూడా ఎదగడానికి దోహద పడుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో అడిషనల్ యస్.పి లు అనిల్ బాబు, వెంకటేష్ నాయక్, కల్యాణిడాం ప్రిన్సిపాల్ సూర్య
భాస్కర్ రెడ్డి , జిల్లా
లోని డి.యస్.పి లు, యస్.బి గంగయ్య, ఈస్ట్ మురళి కృష్ణ, వెస్ట్
నరసప్ప, ఏ.ఆర్ డి.యస్.పి లు నంద కిశోర్, లక్ష్మణ్ కుమార్, డి.సి.ఆర్.బి సి.ఐ వెంకటేశులు, ఆర్.ఐ. లు శ్రీనివాసులు, గిరిధర్, రెడ్డప్ప రెడ్డి, సుదాకర్,
మరియు సిబ్బంది పాల్గొన్నారు.