యూనిట్

ఘనంగా ముగిసిన పోలీస్ క్రీడలు

  గత మూడు రోజులుగా స్థానిక యం.ఆర్ పల్లి పోలీస్ గ్రౌండ్ నందు సాగిన  తిరుపతి అర్బన్ జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ మీట్  ముగింపు వేడుకలను ఘణంగా ముగిసాయి.  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన   టి.టి.డి ఈ.ఓ  అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ   పోలీస్ డిపార్టుమెంటు ఎంతో బిజీగా వుంటుందని క్రీడలకొసం సమయం కేటాయించి అందరు పాల్గొనడం సంతోషకరమన్నారు.  క్రీడల వలన ఆరోగ్యం బాగు పడటమే కాకుండా సిబ్బందిలో టీం లీడర్ షిప్  ఏర్పడుతుందన్నారు.  అనంతరం జిల్లా ఎస్పీ   డా.గజరావు భూపాల్   మాట్లాడుతూ తిరుపతి పోలిస్  సిబ్బంది, అధికారులు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు అన్ని పోటిలలో పాల్గొనడం సంతోషకరమన్నారు.   ముఖ్యంగా తిరుపతి పోలీస్ సిబ్బందికి డ్యూటీలు ఎక్కువగా వుంటాయని అయినా డ్యూటీ లు చేస్తూ ఈ స్పోర్ట్స్ మీట్ ను విజయవంతం చేశారన్నారు.       ఈ సందర్భంగా  వివిధ క్రీడా పోటిలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన సిబ్బందికి, అధికారులకు మెడల్స్ (గోల్డ్, సిల్వర్, బ్రోన్జె) మొదలగునవి ఇచ్చినారు.  ఫుట్ బాల్  - శ్రీ కాళహస్తి టీం, కబడ్డీ  తిరుపతి టీం, వాలీ బాల్ - తిరుపతి సాయుధ దళం, తగ్ అఫ్ వార్   తిరుమల టీంలు విజేతలుగా నిలిచాయి.   ఈ కార్యక్రమంలో  అడిషనల్ యస్.పి లు  అనిల్ బాబు గారు,   వెంకటేష్ నాయక్  , పి.టి.సి కల్యాణిడాం ప్రిన్సిపాల్   సూర్య భాస్కర్ రెడ్డి  , మరియు జిల్లాలోని డి.యస్.పి లు, ఏ.ఆర్ డి.యస్.పి, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్. ఐలు, ఆర్.యస్. ఐ. లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని