యూనిట్

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

 నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బందికి క్రీడలతో ఒత్తిడి నుండి ఉపశమనంతో పాటు దేహానికి ఆరోగ్యం, దేహ ధారుడ్యం కు దోహదపడుతాయని జిల్లా ఎస్.పి   కే.కే.ఎన్.అన్బురాజన్   పేర్కొన్నారు. శనివారం ఉదయం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉన్న పెరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ - 2019  ప్రారంభ కార్యక్రమంలో  అయన    ముఖ్య అతిధిగా  హాజరైనారు. 

కపోతాలను, బెలూన్ లను ఎగురవేసి కాగడా  వెలిగించి లాంఛనంగా క్రీడా పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల మార్చ్ పాస్ట్ ను తిలకించి జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేట సబ్ డివిజన్ ల తో పాటు  ఆర్మ్డ్ రిజర్వు విభాగ క్రీడాకారుల జట్లను పరిచయం చేసుకున్నారు.  ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి   మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించనున్నామన్నారు. అథ్లెటిక్స్, హాకీ, ఫుట్ బాల్, టెన్నిస్, బాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, టగ్ అఫ్ వార్ తో పాటు పలు  అంశాలలో క్రీడలు జరుగనున్నాయన్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని, క్రీడల్లో పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శించి క్రీడాస్ఫూర్తి తో గెలుపోటములను స్వీకరించాలని సూచించారు.  క్రమశిక్షణకు మారుపేరు గా పోలీసు శాఖ ఉందన్నారు. ప్రతి ఏటా పోలీసు శాఖ లో క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి (పరిపాలన)   ఏ.శ్రీనివాస రెడ్డి  ,అదనపు ఎస్.పి (ఆపరేషన్స్)  బి.లక్ష్మీనారాయణ, ఏ.ఆర్.అదనపు ఎస్.పి   రిషికేశవ రెడ్డి  , ఏ.ఆర్.డి.ఎస్.పి   బి.రమణయ్య, కడప డి.ఎస్.పి   సూర్యనారాయణ, రాజంపేట డి.ఎస్.పి   నారాయణ స్వామి రెడ్డి , జమ్మలమడుగు డి.ఎస్.పి   నాగరాజు, మహిళా పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి   కాటమరాజు, సి.సి.ఎస్.డి.ఎస్.పి  రంగనాయకులు,  మరియు ఇతరులు పాల్గొన్నారు. 

వార్తావాహిని