యూనిట్

మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు శ్యాలరీ ప్యాకేజీ ఇన్సురెన్స్ డబ్బు జమ

అనంతపురం జిల్లాలో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు శ్యాలరీ ప్యాకేజీ కింద ఇన్సురెన్స్ డబ్బు రూ. 60 లక్షలను మృత కానిస్టేబుళ్ల భార్యల బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు.  గత ఏడాది మే 29 న రాప్తాడు కానిస్టేబుల్ రవిశంకర్, జులై 13 న   గుడిబండ కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డి లు వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. బ్యాంకు వారు ఎంప్లాయూస్ ప్యాకేజీ ఇన్సురెన్స్ డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.  ప్రభాకర్ రెడ్డి భార్య విజయలక్ష్మికి, రవికుమార్ భార్య నాగరత్నలకు చెరో రూ. 30 లక్షల డబ్బును బ్యాంకు ఖాతాలో జమ కావడంతో ఈ రెండు కుటుంబాలు గురువారం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , ఆర్ ఎస్ ఐ జాఫర్ , సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్ , జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి శంకర్ , తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని